అక్టోబర్ 5న 'ఇజం' ఆడియో | kalyan ram ism movie audio release date | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 5న 'ఇజం' ఆడియో

Published Sun, Oct 2 2016 12:16 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

అక్టోబర్ 5న 'ఇజం' ఆడియో - Sakshi

అక్టోబర్ 5న 'ఇజం' ఆడియో

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో  నందమూరి అందగాడు కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇజం. కళ్యాణ్ రామ్ సరికొత్త మేకోవర్లో కనిపిస్తున్న ఈ సినిమాను ముందుగా దసరా బరిలోనే రిలీజ్ చేయాలని భావించారు. అయితే అనుకున్నట్టుగా షూటింగ్ పూర్తి కాకపోవటంతో పాటు దసరా బరిలో భారీ కాంపిటీషన్ ఏర్పడటంతో ఇజం రిలీజ్ వాయిదా పడింది.
 
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఇజం సినిమా ఆడియో రిలీజ్ డేట్ను ప్రకటించాడు దర్శకుడు పూరి జగన్నాథ్. అక్టోబర్ 5 సాయంత్రం గ్రాండ్గా ఇజం ఆడియోను రిలీజ్ చేయనున్నారు. ఇందుకు సంబందించి ఆడియో రిలీజ్ పోస్టర్ను రిలీజ్ చేశాడు పూరి. తొలిసారిగా కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ లుక్లో కనిపిస్తున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్కు మరో బిగ్ హిట్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు యూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement