ఊహించని కాంబినేషన్ | Unexpected combinations | Sakshi
Sakshi News home page

ఊహించని కాంబినేషన్

Published Tue, Nov 22 2016 10:35 PM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM

ఊహించని కాంబినేషన్

ఊహించని కాంబినేషన్

ఇటు కామెడీ.. అటు యాక్షన్.. వీటికి తోడు కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలు మేళవించి పసందైన విందు భోజనం లాంటి సినిమా ప్రేక్షకులకు అందించాలనుకునే దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి. ఇప్పుడీ దర్శకుడు నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా ఓ సినిమా చేయనున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. ‘ఇజం’ తర్వాత కల్యాణ్‌రామ్ చేయబోయే సినిమా ఇదే అంటున్నారు. ‘దేనికైనా రెడీ’, ‘కరెంట్ తీగ’, ‘ఈడోరకం ఆడోరకం’.. ఇలా ఇటీవల జి.నాగేశ్వరరెడ్డి తీసిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి.

‘‘దర్శకుడు చెప్పిన కథకు కల్యాణ్‌రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉంది. ‘దేనికైనా రెడీ’ తరహాలో సాగే ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. భారీ సినిమాలు నిర్మించిన ఓ ప్రముఖ నిర్మాత.. కాస్త విరామం తర్వాత నిర్మించనున్న చిత్రమిది’’ అని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. అన్నట్లు... ఈ కాంబినేషన్‌ని ఎవరూ ఊహించరు కదూ. ఆ సంగతలా ఉంచితే, ‘అల్లరి’ నరేశ్ హీరోగా జి.నాగేశ్వర రెడ్డి తీసిన ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ త్వరలో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement