తాత సెంటిమెంట్ని నమ్ముకున్న నందమూరి హీరో | Sr Ntrs Blockbuster sentiment for Kalyan ram | Sakshi
Sakshi News home page

తాత సెంటిమెంట్ని నమ్ముకున్న నందమూరి హీరో

Published Sun, Oct 16 2016 2:19 PM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

తాత సెంటిమెంట్ని నమ్ముకున్న నందమూరి హీరో

తాత సెంటిమెంట్ని నమ్ముకున్న నందమూరి హీరో

పటాస్ సినిమాతో చాలా కాలం తరువాత ఫాంలోకి వచ్చిన యంగ్ హీరో కళ్యాణ్ రామ్, ప్రస్తుతం ఇజం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తన కెరీర్లోనే బిగెస్ట్ బడ్జెట్తో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఇజం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఈ నయా సిక్స్ ప్యాక్ హీరో. అదే డేట్ రోజు తన తాత హీరోగా తెరకెక్కిన మూడు సినిమాలు రిలీజ్ అయి ఘనవిజయాలుగా నిలిచాయి. 1955లో జయసింహా, 1970లో కోడలు దిద్దిన కాపురం, 1977లో యమగోల సినిమాలు అక్టోబర్ 21నే రిలీజ్ అయి సూపర్ హిట్స్గా నిలిచాయి. దీంతో ఇజం సినిమా కూడా మంచి సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు కళ్యాణ్ రామ్ అండ్ టీం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement