
త్వరలో ‘ఇజం’ పేరుతో పవన్ పుస్తకావిష్కరణ
హైదరాబాద్: జనసేన పార్టీ భావజాలాన్ని తెలియజేస్తూ సినీ నటుడు పవన్‌కల్యాణ్, రాజు రవితేజతో కలసి రచించిన ‘ఇజం(ఐడియాలజీ ఆఫ్ జనసేన పార్టీ)’ పుస్తకం త్వరలో ప్రజల ముందుకు రానుంది. దీనిని త్వరలోనే ఆవిష్కరించనున్నట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి.
‘జనసేన’కు అధికార ప్రతినిధులు లేరు
‘జనసేన’కు అధికార ప్రతినిధులు ఎవ్వరూ లేరని ఆ పార్టీ కార్యాలయం ఆదివారం ఓ పత్రికా ప్రకటనతో తెలిపింది. ప్రస్తుతం పవన్ ఒక్కరే అధికారికంగా మాట్లాడతారని, మీడియా చర్చల్లో ఎవరు పాల్గొని మాట్లాడినా అవి వారి వ్యక్తిగత అభిప్రాయమని, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది.