తమ్ముణ్ని విలన్ని చేస్తోన్న పూరి | Puri Jagannath Borther Sairam Shankar as villain | Sakshi
Sakshi News home page

తమ్ముణ్ని విలన్ని చేస్తోన్న పూరి

Published Tue, Sep 13 2016 2:15 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

తమ్ముణ్ని విలన్ని చేస్తోన్న పూరి - Sakshi

తమ్ముణ్ని విలన్ని చేస్తోన్న పూరి

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వారసుడిగా, 143 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటుడు సాయిరాం శంకర్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ నటుడు, కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నాడు. హీరోగా అవకాశాలు వస్తున్నా.. స్టార్ ఇమేజ్ సాధించే స్ధాయి హిట్స్ మాత్రం రావటం లేదు. దీంతో తమ్ముడి కెరీర్ను గాడిలో పెట్టే బాధ్యత తీసుకున్నాడు పూరి. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా ఇజం సినిమాను తెరకెక్కిస్తున్న పూరి, త్వరలో సాయిరాం శంకర్ కీలక పాత్రలో ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే ఈ సినిమాలో సాయి హీరోగా కాదు, విలన్గా నటించనున్నాడట. ఓ ప్రముఖ హీరో  నటిస్తున్న ఈ సినిమాతో సాయిని నెగిటివ్ రోల్లో పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే టాలీవుడ్లో విలన్ రోల్స్లో చేసిన చాలా మంది.. హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే బాటలో సాయి కూడా విలన్గా ఎంట్రీ ఇచ్చి తిరిగి హీరో అయ్యే ఆలోచనలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement