
కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ లుక్
పటాస్ సినిమాతో చాలా కాలం తరువాత ఫాంలోకి వచ్చాడు కళ్యాణ్ రామ్, ప్రస్తుతం మాస్ హీరో ఇమేజ్ కోసం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇజం సినిమాను చేస్తున్నాడు. పూరి మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ జర్నలిస్ట్గా నటిస్తున్నాడన్న టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమా కోసం తొలిసారిగా సిక్స్ ప్యాక్ లుక్లో కనిపిస్తున్నాడు కళ్యాణ్ రామ్.
ఇప్పటికే ఇజం టైటిల్లోగో తో పాటు కళ్యాణ్ రామ్ లుక్ను రివీల్ చేస్తూ పలు పోస్టర్లను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. శుక్రవారం కళ్యాణ్ రామ్ తండ్రి, ప్రముఖ నటుడు హరికృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ లుక్ను రిలీజ్ చేశారు. ఫుల్ మాస్ అవతార్లో కనిపిస్తున్న ఈ లుక్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తోంది.
There you go.. A new poster from #ISM. Hope you like it pic.twitter.com/Ra8DigNmEq
— KALYANRAM NANDAMURI (@NANDAMURIKALYAN) 2 September 2016