ఒక్కో సినిమాకు 15 కోట్లు..? | puri taking 15 crores for both the films | Sakshi
Sakshi News home page

ఒక్కో సినిమాకు 15 కోట్లు..?

Published Sun, Nov 22 2015 1:14 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

ఒక్కో సినిమాకు 15 కోట్లు..? - Sakshi

ఒక్కో సినిమాకు 15 కోట్లు..?

సౌత్ ఇండస్ట్రీలో హీరోయిజాన్ని ఎలివేట్ చేయటంలో పూరి జగన్నాథ్ది సపరేట్ స్టైల్. ముఖ్యంగా మాస్ ఇమేజ్ కోరుకునే తారలు పూరితో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. అంతేకాదు మాస్ హీరోగా నిలదొక్కుకోవాలనుకుంటున్న స్టార్ వారసులు కూడా పూరి డైరెక్షన్లో ఇంట్రడ్యూస్ అయితే పర్ఫెక్ట్ అని ఫీల్ అవుతుంటారు. అందుకే మెగా వారసుడు రామ్ చరణ్ కూడా పూరి దర్శకత్వంలో చిరుతగా వెండితెర అరంగేట్రం చేశాడు.

ఈ ఇమేజే ఇప్పుడు ఈ క్రియేటివ్ డైరెక్టర్కు భారీ ఆఫర్ ను తీసుకువచ్చింది. ఇద్దరు హీరోలను వెండితెరకు పరిచయం చేసేందుకు భారీ పారితోషికాన్ని అందుకోబోతున్నాడు పూరి. ఈ అప్కమింగ్ హీరోస్ భారీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారు కావటంతో పూరితో సినిమా చేయటానికి ఎంతైన ఖర్చుపెట్టడానికి ముందుకు వస్తున్నారు.

మహాత్మ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయిన నిర్మాత సి ఆర్ మనోహర్ తన తనయుడు ఇషాన్ను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను పూరికి అప్పగించాడు. మాజీ ప్రధాని దేవేగౌడ మనుమడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడను కూడా పూరినే వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలు ఎనౌన్స్ కూడా అయ్యాయి. వీటిలో ఒక్కో సినిమాకు 15 కోట్ల మొత్తాన్ని పారితోషికంగా అందుకోబోతున్నాడట పూరి. ఇలాంటి విషయాలు అఫీషియల్గా బయటికి రాకపోయినా, పూరికి ఉన్న డిమాండ్కి ఆ మాత్రం ఇచ్చుకుంటారు అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement