
ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఆఫీసర్‌గా లండన్‌లో చార్జ్ తీసుకున్నారు హీరోయిన్ జాన్వీకపూర్. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లో అన్నమాట. జాతీయ అవార్డు గ్రహీత సుధాన్షు సరియా దర్శకత్వం వహిస్తున్న ‘ఉలజ్’ చిత్రంలో జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జంగ్లీ పిక్చర్స్ నిర్మిస్తోంది.
దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు జాన్వీకపూర్. ఈ సినిమా షూటింగ్ తాజాగా లండన్‌లో ప్రారంభమైంది. జాన్వీకపూర్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్రయూనిట్. ఈ షెడ్యూల్ దాదాపు రెండు వారాలు సాగుతుందని టాక్. కాగా జాన్వీకపూర్ నటించిన మరో హిందీ చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ చిత్రంతో జాన్వీ తెలుగుకి పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.
ఓటీటీలో బవాల్.. వరుణ్‌ధావన్, జాన్వీకపూర్ జంటగా నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ లవ్‌స్టోరీ ‘బవాల్’. షాజిద్ నదియాద్‌వాలా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా జూలైలో డైరెక్ట్‌గా అమేజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment