Indian Foreign Service
-
Wardah Khan: ఇంట్లో ప్రిపేరయ్యి విజేతల వీడియోలు చూసి
యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో టాప్ 25 ర్యాంకుల్లో 10 మంది మహిళా అభ్యర్థులున్నారు. భిన్న జీవనస్థాయుల నుంచి వీరంతా మొక్కవోని పట్టుదలతో పోరాడి ఇండియన్ సివిల్ సర్వీసుల్లో సేవలు అందించేందుకు ఎంపికయ్యారు. 18వ ర్యాంకు సాధించిన 23 ఏళ్ల వార్దా ఖాన్ సివిల్స్ కల కోసం కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి పెట్టింది. సొంతగా ఇంట్లో ప్రిపేర్ అవుతూ గతంలో ర్యాంక్ సాధించిన విజేతలతో స్ఫూర్తిపొందింది. నోయిడాలోని ఆమె ఇలాకా ఇప్పుడు సంతోషంతో మిఠాయిలు పంచుతోంది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుండగా వార్దా ఖాన్‌ను ‘మాక్ ఇంటర్వ్యూ’లో ఒక ప్రశ్న అడిగారు– ‘నువ్వు సోషియాలజీ చదివావు కదా. సమాజంలో మూడు మార్పులు తేవాలనుకుంటే ఏమేమి తెస్తావు’ అని. దానికి వార్దా ఖాన్ సమాధానం 1.స్త్రీల పట్ల సమాజానికి ఉన్న మూస అభి్రపాయం మారాలి. వారికి అన్ని విధాల ముందుకెళ్లడానికి సమానమైన అవకాశాలు కల్పించగల దృష్టి అలవడాలి. 2. దేశ అభివృద్ధిలో గిరిజనులకు అన్యాయం జరిగింది. వారి సంస్కృతిని గౌరవిస్తూనే వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలి. 3. దేశానికి ప్రమాదకరంగా మారగల మత వైషమ్యాలను నివారించాలి. ‘నా మెయిన్ ఇంటర్వ్యూ కూడా ఇంతే ఆసక్తికరంగా సాగింది’ అంటుంది వార్దా. నోయిడాకు చెందిన వార్దా ఖాన్ రెండో అటెంప్ట్‌లోనే సివిల్స్‌ను సాధించింది. 18వ ర్యాంక్ సాధించి సగర్వంగా నిలుచుంది. ఇంటి నుంచి చదువుకుని వార్దాఖాన్ది నోయిడాలోని వివేక్ విహార్. తండ్రి తొమ్మిదేళ్ల క్రితం చనిపోయాడు. చిన్నప్పటి నుంచి చదువులో చాలా ప్రతిభ చూపిన వార్దా వక్తృత్వ పోటీల్లో మంచి ప్రతిభ చూపేది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ వెంటనే కార్పొరేట్ సంస్థలో ఉద్యోగానికి చేరినా ఆమెకు అది సంతృప్తి ఇవ్వలేదు. ప్రజారంగంలో పని చేసి వారికి సేవలు అందించడంలో ఒక తృప్తి ఉంటుందని భావించి సివిల్స్‌కు ప్రిపేర్ అవసాగింది. అయితే అందుకు నేరుగా కోచింగ్ తీసుకోలేదు. కొన్ని ఆన్లైన్ క్లాసులు, ఆ తర్వాత సొంత తర్ఫీదు మీద ఆధారపడింది. అన్నింటికంటే ముఖ్యం గతంలో ర్యాంకులు సాధించిన విజేతల వీడియోలు, వారి సూచనలు వింటూ ప్రిపేర్ అయ్యింది. ‘సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆందోళన, అపనమ్మకం ఉంటాయి. విజేతల మాటలు వింటే వారిని కూడా అవి వేధించాయని, వారూ మనలాంటి వారేనని తెలుస్తుంది. కనుక ధైర్యం వస్తుంది’ అని తెలిపింది వార్దాఖాన్. ఏకాంతంలో ఉంటూ ‘సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వాలంటే మనం లోకంతో మన సంబంధాలు కట్ చేసుకోవాలి. నాకు నలుగురితో కలవడం, మాట్లాడటం ఇష్టం. కాని దానివల్ల సమయం వృథా అవుతుంది. సివిల్స్‌కు ప్రిపేర్ అయినన్నాళ్లు ఇతరులతో కలవడం, సోషల్ మీడియాలో ఉండటం అన్నీ మానేశాను. అయితే మరీ బోర్ కొట్టినప్పుడు ఈ సిలబస్ ఇన్నిగంటల్లో పూర్తి చేయగలిగితే అరగంట సేపు ఎవరైనా ఫ్రెండ్‌ని కలవొచ్చు అని నాకు నేనే లంచం ఇచ్చుకునేదాన్ని. అలా చదివాను’ అని తెలిపిందామె. పది లక్షల మందిలో 2023 యు.పి.ఎస్.సి పరీక్షల కోసం 10,16,850 మంది అభ్యర్థులు అప్లై చేస్తే వారిలో 5,92,141 మంది ప్రిలిమ్స్ రాశారు. 14,624 మంది మెయిన్స్‌లో క్వాలిఫై అయ్యారు. 2,855 మంది ఇంటర్వ్యూ వరకూ వచ్చారు. 1,016 మంది ఎంపికయ్యారు. వీరిలో 664 మంది పురుషులు 352 మంది స్త్రీలు. ఇంత పోటీని దాటుకుని వార్దా ఖాన్ 18 వ ర్యాంకును సాధించిందంటే ఆమె మీద ఆమెకున్న ఆత్మవిశ్వాసమే కారణం. ‘మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా కష్టపడితే కచ్చితంగా సివిల్స్ సాధించవచ్చు’ అని తెలుపుతోందామె. ఆమె ఐ.ఎఫ్.ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీసెస్)ను తన మొదటి ్రపాధాన్యంగా ఎంపిక చేసుకుంది. ‘గ్లోబల్ వేదిక మీద భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలియచేసి దౌత్య సంబంధాల మెరుగులో కీలక పాత్ర పోషించడమే నా లక్ష్యం’ అంటోంది వార్దా. -
లండన్‌లో ఇండియన్ ఆఫీసర్
ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఆఫీసర్‌గా లండన్‌లో చార్జ్ తీసుకున్నారు హీరోయిన్ జాన్వీకపూర్. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లో అన్నమాట. జాతీయ అవార్డు గ్రహీత సుధాన్షు సరియా దర్శకత్వం వహిస్తున్న ‘ఉలజ్’ చిత్రంలో జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జంగ్లీ పిక్చర్స్ నిర్మిస్తోంది. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు జాన్వీకపూర్. ఈ సినిమా షూటింగ్ తాజాగా లండన్‌లో ప్రారంభమైంది. జాన్వీకపూర్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్రయూనిట్. ఈ షెడ్యూల్ దాదాపు రెండు వారాలు సాగుతుందని టాక్. కాగా జాన్వీకపూర్ నటించిన మరో హిందీ చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ చిత్రంతో జాన్వీ తెలుగుకి పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీలో బవాల్.. వరుణ్‌ధావన్, జాన్వీకపూర్ జంటగా నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ లవ్‌స్టోరీ ‘బవాల్’. షాజిద్ నదియాద్వాలా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా జూలైలో డైరెక్ట్‌గా అమేజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. -
పోలీసులకే టోకరా.. 18 నెలలు వీఐపీ సేవలు..!
న్యూఢిల్లీ : ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) ఉద్యోగినంటూ పోలీసులకు టోకరా ఇచ్చి 18 నెలల పాటు రాచమర్యాదలు చేయించుకున్న ఓ యువతి బండారం బట్టబయలైంది. భర్తతో కలిసి ప్రభుత్వ అధికారులను మోసగించినందుకు కటకటాల పాలైంది. ఢిల్లీలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. వివరాలు... సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఉన్నత ఉద్యోగం పొందాలనుకున్న జోయాఖాన్ (35) ఆ కోరిక నెరవేరక పోవడంతో సరికొత్త మోసానికి తెరలేపింది. ఎలాగూ ఉద్యోగం రాలేదు. కానీ, ఆ జాబ్‌లోని ‘మజా’ ఎంజాయ్ చేద్దామని తన భర్త హర్ష్ ప్రతాప్ (40)తో కలిసి నకిలీలలు చేసింది. ఫేక్ ఐడీ కార్డులు సృష్టించి ఢిల్లీ రాజధాని ప్రాంతంలో గల నొయిడా, గురుగ్రామ్, మీరట్, ఘజియాబాద్, మోరాదాబాద్‌లో ఎస్కార్ట్, పోలీసు సేవల్ని యథేచ్ఛగా వాడుకుంది. ఎలా బయటపడింది..? ఈ క్రమంలోనే మార్చి 23న గౌతమ్‌బుద్ధ నగర్ (నొయిడా) ఏఎస్పీ వైభవ్ కృష్ణకి ఫోన్ చేసిన ఖాన్ పోలిస్ ఎస్కార్టును పంపడంలో ఆలస్యమవడం పట్ల కోపం ప్రదర్శించింది. తొందరగా పంపించాలని హుకుం జారీ చేసింది. దీంతో ఈ ‘ఉన్నత ఉద్యోగి’ ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఏఎస్పీ విచారణ చేపట్టారు. ఖాన్, ప్రతాప్ గుట్టు రట్టు కావడంతో వారు నివాసముంటున్న నొయిడా ఎక్స్టెన్షన్స్ నుంచి గురువారం అరెస్టు చేశారు. జోయాఖాన్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో న్యూక్లియర్ ఆఫీసర్‌గా, అఫ్గనిస్తాన్‌లో యూఎస్ దౌత్యవేత్తగా నకిలీ ఐడీ కార్డులు కలిగి ఉందని తెలిపారు. నిందితుల వద్ద నుంచి రెండు విలువైన కార్లు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఇక అఫ్గనిస్తాన్ తదితర దేశాలతో కూడా జోయాఖాన్ వ్యవహారాలు నడిపించిందా అనే ప్రశ్నలను పోలీసులు ఖండించారు. అదంతా అబద్ధమని అన్నారు. ఇలా టోకరా.. వాయిస్ కన్వర్టర్ యాప్, యూఎస్ సెక్యురిటీ కౌన్సిల్ పేరిట ఫేక్ ఈమెయిల్ ద్వారా ఖాన్ పోలీసులను బురిడీ కొట్టించినట్టు తెలిసింది. ల్యాండ్‌లైన్ ద్వారా ఫోన్ చేయడం ద్వారా ఈ విషయం వెలుగులోకి రాలేదని పోలీసులు తెలిపారు. ఇక గతవారం ప్రధాని మోదీ మీరట్‌లో పర్యటించినప్పుడు కూడా ఖాన్‌కు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆమె నకిలీ వేషాలను నమ్మిన చాలా మంది ఆమెను ప్రధాని రక్షణ దళంలో సభ్యురాలు అని కూడా అనుకున్నారు. కాగా, ఆమె ల్యాప్‌టాప్‌లో పలువురు రాజకీయ నాయకుల ఫొటోలు ప్రత్యక్షమవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమె వాట్సాప్, సోషల్ మీడియా చరిత్రను విచారించిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు స్పష్టం చేశారు. ఇక నిన్నటి వరకు వీఐపీ సేవల్లో తరించిన ఖాన్, ప్రతాప్ అరెస్టులతో స్థానికులు భయాందోళను గురయ్యారు. పోలీసులు, ఉన్నతాధికారులకే టోకరా ఇచ్చిన ఈ ఘరానా మోసగాళ్లు తమనేం చేసేవారోనని కలవరానికి గురయ్యారు. -
డిప్యూటీ ఎన్ఎస్ఏగా పంకజ్ శరణ్
న్యూఢిల్లీ: భారత డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)గా సీనియర్ దౌత్యవేత్త పంకజ్ శరణ్‌ను కేంద్రం నియమించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ పంకజ్ నియామకానికి ఆమోదముద్ర వేసింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 1982 ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) బ్యాచ్‌కు చెందిన పంకజ్ 2015 నుంచి ఇప్పటివరకూ రష్యాలో భారత రాయబారిగా ఉన్నారు. ప్రధాని కార్యాలయంలో 1995–99 మధ్యకాలంలో డిప్యూటీ కార్యదర్శిగా, 2007 నుంచి 2012 వరకూ సంయుక్త కార్యదర్శిగా పంకజ్ పనిచేశారు. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ కీలక నిర్ణయాలు తీసుకోవడంలో పంకజ్ సహాయకారిగా ఉండనున్నారు. -
నైపర్ అందించే కోర్సుల వివరాలు..
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ వివరాలను తెలపండి? -సుష్మ, నిజామాబాద్. కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ పరిధిలోనిది ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్). యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా ఐఎఫ్ఎస్లో ప్రవేశించవచ్చు. ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్ దశలుంటాయి. అర్హత: డిగ్రీ. ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్ ఇతర సర్వీసులతో కలిసి ఉమ్మడిగా ముస్సోరిలో ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత ఐఎఫ్ఎస్ అభ్యర్థులకు న్యూఢిల్లీలోని ఫారెన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్లో ఏడాది కాలంపాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలోనే.. విదేశాల్లో భారత రాయబార కార్యాలయాల పనితీరుపై అవగాహన కల్పించేలా విదేశీ పర్యటన, అక్కడ భారతీయ రాయబార కార్యాలయాలతో అటాచ్మెంట్ ఉంటుంది. విదేశీ వ్యవహారాలతోపాటు స్వదేశంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిపై అవగాహన ఏర్పరిచే దిశగా డిస్ట్రిక్ట్ అటాచ్మెంట్ కూడా ఉంటుంది. వివరాల కోసం యూపీఎస్సీ వెబ్సైట్ www.upsc.gov.in చూడొచ్చు. ఐఐఎం-ఇండోర్ ఆఫర్ చేస్తున్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్(ఐపీఎం) కోర్సు వివరాలను తెలపండి? - రేవతి, హైదరాబాద్. మేనేజ్మెంట్ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే వారికి చక్కని అవకాశం.. ప్రఖ్యాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)- ఇండోర్ అందించే ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (ఐపీఎం). అర్హత: 60 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీలకు 55 శాతం) 10వ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణత, లేదా శాట్-1 స్కోర్ 1600-2400 మధ్యలో (ఎస్సీ/ఎస్టీలకు 1475-2400 మధ్య) ఉండాలి. ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ, అకడమిక్ రికార్డ్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్ సాధారణంగా ఫిబ్రవరి/మార్చిలలో వెలువడుతుంది. కోర్సులో 40 శాతం మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, లాజికల్ కంప్యూటర్ సైన్స్, పొలిటికల్ సైన్స్, సివిలైజేషన్ అండ్ హిస్టరీ, బయలాజికల్ సెన్సైస్, లాంగ్వేజెస్(ఒక భారతీయ భాష, ఒక విదేశీ భాష), సాఫ్ట్ స్కిల్స్ అంశాలు ఉంటాయి. 50 శాతంలో మేనేజ్మెంట్ అంశాలైన..అకౌంటింగ్, ఫైనాన్స్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, ఆపరేషన్స్ అండ్ సర్వీస్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఎకనామిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కార్పొరేట్ గవర్నెన్స్, సీఎస్ఆర్, ఇంటర్నేషనల్ బిజినెస్ తదితర అంశాలను బోధిస్తారు. మిగిలిన 10 శాతంలో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. వివరాలకు: www.iimidr.ac.in ఎంఎస్సీ (ఎన్విరాన్మెంటల్ సైన్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీల వివరాలను తెలపండి? -రాజేష్, హైదరాబాద్. ఎన్విరాన్మెంటల్ సైన్స్‌లో పీజీ చేసిన వారికి ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైైవేట్ కంపెనీలు/ఆర్గనైజేషన్స్‌లో విస్తృత స్థాయిలో అవకాశాలుంటాయి. ఈ క్రమంలో టెక్స్టైల్ మిల్స్, రిఫైనరీలు, ఫెర్టిలైజర్ ప్లాంట్స్, వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, డిస్టలరీలు, మైన్స్, తదితర పరిశ్రమలు వీరికి కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. ఆయా పరిశ్రమలు కాలుష్య స్థాయిని పర్యవేక్షించడానికి ఆర్ అండ్ డీ విభాగంలో వీరి సేవలను వినియోగించుకుంటున్నాయి. సస్టెయినబిలిటీ డెవలప్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ వంటి అంశాల్లో పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ కూడా ఎన్విరాన్‌మెంటలిస్ట్‌లను నియమించుకుంటున్నాయి. ప్రభుత్వ పరంగా ఫారెస్ట్రీ, వైల్డ్ లైఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అర్బన్ ప్లానింగ్, వాటర్ రీసోర్సెస్, అగ్రికల్చరల్ తదితర ఏజెన్సీలు/సంస్థల్లో వివిధ హోదాల్లో అవకాశాలు ఉంటాయి. అందిస్తున్న యూనివర్సిటీలు: ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్ పవేశం: రాత పరీక్ష ఆధారంగా వెబ్సైట్: ఠీఠీఠీ.ౌటఝ్చజ్చీ.్చఛి.జీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి పవేశం: రాత పరీక్ష ఆధారంగా వెబ్సైట్: ఠీఠీఠీ.టఠిఠజీఠ్ఛిటటజ్టీడ.జీ ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం పవేశం: రాత పరీక్ష ఆధారంగా వెబ్సైట్: www.andhrauniversity.edu.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) అందించే కోర్సుల వివరాలను తెలపండి? -సతీష్, నల్లగొండ. భారత ప్రభుత్వ రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) పని చేస్తుంది. దీనికి ..మొహాలీ, హైదరాబాద్, హాజీపూర్, గౌహతి, రాయ్‌బరేలీ, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ ఏడు క్యాంపస్‌లకు అవసరమైన సలహాలు, సూచనలు అందించడానికి ప్రత్యేకంగా మెంటార్ ఇన్స్టిట్యూట్లు కూడా ఉంటాయి. ఈ క్రమంలో నైపర్-హైదరాబాద్‌కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (హైదరాబాద్) మెంటార్ ఇన్స్టిట్యూట్గా వ్యవహరిస్తుంది. ఈ ఇన్స్టిట్యూట్లు మాస్టర్, పీహెచ్డీ స్థాయి కోర్సులను అందిస్తున్నాయి. మాస్టర్ విభాగంలో ఎంఎస్(ఫార్మా), ఎంటెక్ (ఫార్మా), ఎంఫార్మసీ కోర్సులు ఉన్నాయి. స్పెషలైజేషన్స్: క్లినికల్ రీసెర్చ్, బయోటెక్నాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ, మెడికల్ డివెజైస్, నేచురల్ ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ,ఫార్మాస్యూటిక్స్, ఫార్మకోఇన్ఫర్మాటిక్స్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మసీ ప్రాక్టీస్, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ట్రెడిషనల్ మెడిసిన్. ఎంబీఏ (ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్) పీహెచ్డీ స్పెషలైజేషన్స్: కెమికల్ సెన్సైస్, బయాలజికల్ సెన్సైస్, ఫార్మాస్యూటికల్ సెన్సైస్. మాస్టర్ కోర్సుల్లో నైపర్-జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఎంబీఏ కోర్సుకు రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ అనే మూడు దశలు ఉంటాయి. ఎంబీఏతో కలిపి అన్ని మాస్టర్ కోర్సులకు ఒకే పరీక్షను నిర్వహిస్తారు. పీహెచ్డీ కోర్సులకు మాత్రం నైపర్-జేఈఈ, ఇంటర్వ్యూ అనే రెండు దశల విధానాన్ని అనుసరిస్తారు. ప్రవేశ ప్రక్రియ మొత్తం నైపర్-మొహాలీ ఆధ్వర్యంలో జరుగుతుంది. వివరాలకు: www.niper.ac.in -
మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్ కోర్సు వివరాలు..
బిట్స్-పిలానీ అందిస్తున్న మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు వివరాలను తెలపండి? -శ్రీధర్, అదిలాబాద్. బిట్స్-పిలానీ, శంకర్ నేత్రాలయ సహకారంతో ఎంఎస్ (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ) కోర్సును అందిస్తుంది. బయాలాజికల్ సైన్స్‌తో డిగ్రీ లేదా బిట్స్ నుంచి ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. కోర్సులో మొదటి రెండేళ్లు బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, బ్లడ్ బ్యాంకింగ్, టెక్నికల్ కమ్యూనికేషన్స్, బయోస్టాటిస్టిక్స్ వంటి అంశాలను బోధిస్తారు. మూడో ఏడాదిలో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. వివరాలకు: www.bitspilani.ac.in మాస్టర్స్ స్థాయిలో మెడికల్ ల్యాబ్‌టెక్నాలజీ కోర్సును ఆఫర్ చేస్తున్న మరికొన్ని ఇన్స్టిట్యూట్లు: శ్రీరామచంద్ర యూనివర్సిటీ (వెబ్సైట్: www.sriramachandra. edu.in)- తమిళనాడు, మణిపాల్ యూనివర్సిటీ (వెబ్సైట్: www.manipal.edu)-మణిపాల్ (కర్ణాటక). ఎన్జీవో మేనేజ్మెంట్కు సంబంధించి పీజీ డిప్లొమా కోర్సును అందిస్తున్న సంస్థలేవి? -రాజేంద్ర, నల్గొండ. సామాజిక సేవ పట్ల ఆసక్తి ఉన్న వారికి సరిపోయే కోర్సు ఎన్జీవో మేనేజ్మెంట్. కొత్తగా తెచ్చిన కంపెనీల చట్టం ప్రకారం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో సదరు కోర్సు చేసిన అభ్యర్థులకు అవకాశాలు విస్తృతంగా అందుబాటులోకి వస్తాయి. కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్వీస్ ప్రొవైడర్, ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్, సోషల్ సర్వీస్ ప్రొవైడర్, హెచ్ఆర్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్ వంటి హోదాల్లో స్థిరపడొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్, ఫిక్కీ, యునెస్కో, తదితర సంస్థలు వీరిని నియమించుకుంటాయి. అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు: సెంటర్ ఫర్ సోషల్ ఇన్షియేటివ్ అండ్ మేనేజ్మెంట్ (వెబ్సైట్: www.csim.in), అమిటీ యూనివర్సిటీ (వెబ్సైట్: www.amity.edu)-నోయిడా, జామియా మిలియా ఇస్లామియా (http://jmi.ac.in)-న్యూఢిల్లీ. ఇండియన్ ఫారెన్ సర్వీస్ వివరాలను తెలపండి? -సురేష్, సూర్యాపేట. కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ పరిధిలోనిది ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్). ఐపీఎస్, ఐఎఎస్, ఐఆర్ఎస్ ఇతర సర్వీసులతో కలిసి ఉమ్మడిగా ముస్సోరిలో ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత ఐఎఫ్ఎస్ అభ్యర్థులకు న్యూఢిల్లీలోని ఫారెన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్లో ఏడాది కాలంపాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలోనే.. విదేశాల్లో భారత రాయబార కార్యాలయాల పనితీరుపై అవగాహన కల్పించేలా విదేశీ పర్యటన, అక్కడ భారతీయ రాయబార కార్యాలయాలతో అటాచ్మెంట్ ఉంటుంది. విదేశీ వ్యవహారాలతోపాటు స్వదేశంలో గ్రాస్ రూట్ లెవల్లో పరిస్థితిపై అవగాహన ఏర్పరిచే దిశగా డిస్ట్రిక్ట్ అటాచ్మెంట్ కూడా ఉంటుంది. దీని ప్రకారం అభ్యర్థులను బృందాలుగా విభజించి ఒక్కో బృందాన్ని ఒక్కో రాష్ట్రానికి పంపుతారు. అలా.. ఆయా రాష్ట్రాలకు వెళ్లిన బృందాలు అక్కడి సామాజిక, ఆర్థిక, సాంస్కృతికపరమైన అన్ని అంశాలను పరిశీలించాలి. ప్రతి క్షేత్ర స్థాయి పర్యటనలాధారంగా నివేదిక సమర్పించాలి. ఇలా ఏడాదిపాటు తరగతి బోధన పూర్తయ్యాక ఫైనల్ పరీక్షలు ఉంటాయి. వాటిలో ఉత్తీర్ణత సాధిస్తేనే పోస్టింగ్‌కు అర్హత లభిస్తుంది. ఐఎఫ్ఎస్ ప్రొబేషనర్లు ఫారెన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్నాక తప్పనిసరిగా ఒక విదేశీ భాషను ఎంచుకుని అందులో శిక్షణ పొందాలి. ఐఎఫ్ఎస్ అభ్యర్థులకు తొలి పోస్టింగ్ విదేశాల్లోనే ఉంటుంది. సీఎఫ్ఎల్ ప్రోగ్రాంలో భాగంగా శిక్షణ తీసుకున్న విదేశీ భాషను పరిగణనలోకి తీసుకుని ఆ భాష మాతృ భాషగా ఉన్న దేశంలో పోస్టింగ్ లభిస్తుంది. పోస్టింగ్ పొందిన అభ్యర్థులకు.. విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో లభించే తొలి హోదా థర్డ్ సెక్రటరీ. తర్వాత సీనియారిటీ ఆధారంగా సెకండ్ సెక్రటరీ, ఫస్ట్ సెక్రటరీ, కౌన్సెలర్, అంబాసిడర్ లేదా హై కమిషనర్, పర్మినెంట్ రిప్రజెంటేటివ్ హోదాలు లభిస్తాయి. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా ఇండియన్ ఫారెన్ సర్వీసుల్లో ప్రవేశించవచ్చు. ఈ పరీక్షలో ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్ అనే మూడు దశలుంటాయి. అర్హత: ఏదైనా డిగ్రీ. పరీక్ష విధానం, సిలబస్, సంబంధిత వివరాల కోసం యూపీఎస్సీ మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? కోర్సు వివరాలను తెలపండి? -రమేష్, నిజామాబాద్. మైనింగ్ కార్యకలాపాల్లో వినియోగించే యంత్రాల (మెషిన్స్)కు సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్ అంశాలను మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్ కోర్సులో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సులో మైనింగ్ కోసం ఉపయోగించే యంత్రాలు, ఖనిజాల వెలికితీత విధానాలను వివరిస్తారు. ఈ క్రమంలో మైనింగ్ మెథడ్స్ అండ్ మెషినరీ, మెకానిక్స్, ప్లానింగ్, మైన్ డెవలప్మెంట్, జియో మెకానిక్స్, గ్రౌండ్ కంట్రోల్, సర్ఫేస్ ఎన్విరాన్మెంట్, సిస్టమ్స్ ఇంజనీరింగ్ వంటి సబ్జెక్ట్‌లను బోధిస్తారు. ధన్‌బాద్ (జార్ఖండ్)లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్, బీటెక్, ఎంటెక్ విభాగాల్లో మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తుంది. జేఈఈ-అడ్వాన్స్డ్ ఆధారంగా బీటెక్ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. గేట్ ద్వారా ఎంటెక్ కోర్సులో అడ్మిషన్ పొందొచ్చు. వివరాలకు: www.ismdhanbad.ac.in కోర్సు పూర్తయిన తర్వాత మైనింగ్ సంబంధిత కార్యకలాపాలు నిర్వహించే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మైనింగ్ ఇంజనీర్, జియాలాజికల్ ఇంజనీర్, మైనింగ్ మెకానిక్ ఆపరేటర్, మైనింగ్ సూపర్వైజర్, ఎన్విరాన్మెంటల్ అండ్ సేఫ్టీ మేనేజర్, మినరల్ సేల్స్ ఆఫీసర్ వంటి హోదాల్లో స్థిరపడొచ్చు. టాప్ రిక్రూటర్స్: భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్, అర్సెలర్ మిట్టల్, భారత్ ఫ్రోగ్ లిమిటెడ్, కెయిర్న్ ఎనర్జీ, అదానీ మైనింగ్.