నైపర్ అందించే కోర్సుల వివరాలు.. | Details of the courses offered by Niper | Sakshi
Sakshi News home page

నైపర్ అందించే కోర్సుల వివరాలు..

Published Thu, Nov 13 2014 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

నైపర్ అందించే కోర్సుల వివరాలు..

నైపర్ అందించే కోర్సుల వివరాలు..

టి. మురళీధరన్
టి.ఎం.ఐ. నెట్‌వర్క్

 
ఇండియన్ ఫారెన్ సర్వీస్ వివరాలను తెలపండి?
-సుష్మ, నిజామాబాద్.

 
కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ పరిధిలోనిది ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్). యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా ఐఎఫ్‌ఎస్‌లో ప్రవేశించవచ్చు. ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్ దశలుంటాయి. అర్హత: డిగ్రీ. ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్‌ఎస్ ఇతర సర్వీసులతో కలిసి ఉమ్మడిగా ముస్సోరిలో ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత ఐఎఫ్‌ఎస్ అభ్యర్థులకు న్యూఢిల్లీలోని ఫారెన్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏడాది కాలంపాటు శిక్షణ ఉంటుంది.

శిక్షణ సమయంలోనే.. విదేశాల్లో భారత రాయబార కార్యాలయాల పనితీరుపై అవగాహన కల్పించేలా విదేశీ పర్యటన, అక్కడ భారతీయ రాయబార కార్యాలయాలతో అటాచ్‌మెంట్ ఉంటుంది. విదేశీ వ్యవహారాలతోపాటు స్వదేశంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిపై అవగాహన ఏర్పరిచే దిశగా డిస్ట్రిక్ట్ అటాచ్‌మెంట్ కూడా ఉంటుంది.  వివరాల కోసం యూపీఎస్సీ వెబ్‌సైట్ www.upsc.gov.in చూడొచ్చు.
 
ఐఐఎం-ఇండోర్ ఆఫర్ చేస్తున్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్(ఐపీఎం) కోర్సు వివరాలను తెలపండి?   
 - రేవతి, హైదరాబాద్.


మేనేజ్‌మెంట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే వారికి చక్కని అవకాశం.. ప్రఖ్యాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)- ఇండోర్ అందించే ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఐపీఎం). అర్హత: 60 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీలకు 55 శాతం) 10వ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణత, లేదా శాట్-1 స్కోర్ 1600-2400 మధ్యలో (ఎస్సీ/ఎస్టీలకు 1475-2400 మధ్య) ఉండాలి. ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ, అకడమిక్ రికార్డ్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్ సాధారణంగా ఫిబ్రవరి/మార్చిలలో వెలువడుతుంది.

కోర్సులో 40 శాతం మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, లాజికల్ కంప్యూటర్ సైన్స్, పొలిటికల్ సైన్స్, సివిలైజేషన్ అండ్ హిస్టరీ, బయలాజికల్ సెన్సైస్, లాంగ్వేజెస్(ఒక భారతీయ భాష, ఒక విదేశీ భాష), సాఫ్ట్ స్కిల్స్ అంశాలు ఉంటాయి. 50 శాతంలో మేనేజ్‌మెంట్ అంశాలైన..అకౌంటింగ్, ఫైనాన్స్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, ఆపరేషన్స్ అండ్ సర్వీస్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, ఎకనామిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కార్పొరేట్ గవర్నెన్స్, సీఎస్‌ఆర్, ఇంటర్నేషనల్ బిజినెస్ తదితర అంశాలను బోధిస్తారు. మిగిలిన 10 శాతంలో ఇంటర్న్‌షిప్ ఉంటుంది.
 వివరాలకు: www.iimidr.ac.in
 
 
ఎంఎస్సీ (ఎన్విరాన్‌మెంటల్ సైన్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీల వివరాలను తెలపండి?
-రాజేష్, హైదరాబాద్.

 
ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో పీజీ చేసిన వారికి ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైైవేట్ కంపెనీలు/ఆర్గనైజేషన్స్‌లో విస్తృత స్థాయిలో అవకాశాలుంటాయి. ఈ క్రమంలో టెక్స్‌టైల్ మిల్స్, రిఫైనరీలు, ఫెర్టిలైజర్ ప్లాంట్స్, వేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, డిస్టలరీలు, మైన్స్, తదితర పరిశ్రమలు వీరికి కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. ఆయా పరిశ్రమలు కాలుష్య స్థాయిని పర్యవేక్షించడానికి ఆర్ అండ్ డీ విభాగంలో వీరి సేవలను వినియోగించుకుంటున్నాయి. సస్టెయినబిలిటీ డెవలప్‌మెంట్, పొల్యూషన్ కంట్రోల్ వంటి అంశాల్లో పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ కూడా ఎన్విరాన్‌మెంటలిస్ట్‌లను నియమించుకుంటున్నాయి. ప్రభుత్వ పరంగా ఫారెస్ట్రీ, వైల్డ్ లైఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అర్బన్ ప్లానింగ్, వాటర్ రీసోర్సెస్, అగ్రికల్చరల్ తదితర ఏజెన్సీలు/సంస్థల్లో వివిధ హోదాల్లో అవకాశాలు ఉంటాయి.

అందిస్తున్న యూనివర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
పవేశం: రాత పరీక్ష ఆధారంగా
వెబ్‌సైట్: ఠీఠీఠీ.ౌటఝ్చజ్చీ.్చఛి.జీ
వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
పవేశం: రాత పరీక్ష ఆధారంగా
వెబ్‌సైట్: ఠీఠీఠీ.టఠిఠజీఠ్ఛిటటజ్టీడ.జీ
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
పవేశం: రాత పరీక్ష ఆధారంగా
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
 
 
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) అందించే కోర్సుల వివరాలను తెలపండి?
-సతీష్, నల్లగొండ.

భారత ప్రభుత్వ రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) పని చేస్తుంది. దీనికి ..మొహాలీ, హైదరాబాద్, హాజీపూర్, గౌహతి, రాయ్‌బరేలీ, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ ఏడు క్యాంపస్‌లకు అవసరమైన సలహాలు, సూచనలు అందించడానికి ప్రత్యేకంగా మెంటార్ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ఉంటాయి. ఈ క్రమంలో నైపర్-హైదరాబాద్‌కు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (హైదరాబాద్) మెంటార్ ఇన్‌స్టిట్యూట్‌గా వ్యవహరిస్తుంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లు మాస్టర్, పీహెచ్‌డీ స్థాయి కోర్సులను అందిస్తున్నాయి.

మాస్టర్ విభాగంలో ఎంఎస్(ఫార్మా), ఎంటెక్ (ఫార్మా), ఎంఫార్మసీ కోర్సులు ఉన్నాయి. స్పెషలైజేషన్స్:
క్లినికల్ రీసెర్చ్, బయోటెక్నాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ, మెడికల్ డివెజైస్, నేచురల్ ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ,ఫార్మాస్యూటిక్స్, ఫార్మకోఇన్ఫర్మాటిక్స్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మసీ ప్రాక్టీస్, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ట్రెడిషనల్ మెడిసిన్.
ఎంబీఏ (ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్) పీహెచ్‌డీ స్పెషలైజేషన్స్:
కెమికల్ సెన్సైస్, బయాలజికల్ సెన్సైస్, ఫార్మాస్యూటికల్ సెన్సైస్.
మాస్టర్ కోర్సుల్లో నైపర్-జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఎంబీఏ కోర్సుకు రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ అనే మూడు దశలు ఉంటాయి. ఎంబీఏతో కలిపి అన్ని మాస్టర్ కోర్సులకు ఒకే పరీక్షను నిర్వహిస్తారు. పీహెచ్‌డీ కోర్సులకు మాత్రం నైపర్-జేఈఈ, ఇంటర్వ్యూ అనే రెండు దశల విధానాన్ని అనుసరిస్తారు. ప్రవేశ ప్రక్రియ మొత్తం నైపర్-మొహాలీ ఆధ్వర్యంలో జరుగుతుంది.
వివరాలకు: www.niper.ac.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement