Environmental Science
-
సహజ వనరుల బ్యాలెన్స్‌షీట్స్ ఏవీ?
చట్టసభ ల్లో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందే సహజ వనరులకు సంబంధించిన బ్యాలెన్స్ ప్రకటించాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రముఖ పర్యావరణ వేత్త, సామాజిక కార్యకర్త ప్రొ.కె.పురుషోత్తం రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం నేతగా వ్యవహరించిన ఆయన ఆ తర్వాత అదే వర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా, హెచ్ఓడీగా, చైర్మన్ బోర్డ్ఆఫ్ స్టడీస్‌గా, ఓయూ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ డైరెక్టర్‌గా సేవలందించారు. 1990కు ముందు నుంచే వివిధరూపాల్లో పెరుగుతున్న వాయు, నీరు, వాతావరణ కాలుష్యాలపై గొంతెత్తి పోరాడారు. నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాలను వెలికితీసే ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఇతర సంస్థలతో కలిసి పోరాడి విజయం సాధించారు. పర్యావరణ అంశాలతో పాటు వర్తమాన రాజకీయ పరిస్థితులపై సాక్షి ఇంటర్వ్యూలో తనదైన శైలిలో సూటిగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లో.... - ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి పబ్లిక్ డొమైన్ లో ఆ వివరాలు ఎక్కడ ? ప్రతీ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్లను ప్రవేశపెట్టే ముందు పార్లమెంట్‌కు సహజ వనరుల బ్యాలన్స్ షీట్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు.పబ్లిక్ డొమైన్లో ఈ వివరాలు పెట్టాల్సి ఉన్నా ఎక్కడా ఆ సమాచారం లేదు. ప్రజలకు ఈ వివరాలు తెలిస్తేనే కదా.. ఆయా అంశాలపై అవగాహన ఏర్పడి చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. దేశంలోని సహజవనరులు, ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి పరిస్థితి ఏమిటని తెలుసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, లోకాయుక్తలు ఏ విధంగా పని చేయగలుగుతాయి. పేరుకు మాత్రమే నీతి ఆయోగ్ (గతంలో ప్రణాళికా సంఘం) వంటివి ఉన్నా... సహజ వనరుల తరుగుదల ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా దేశాభివృద్ధిని, పురోగతిని ఎలా అంచనా వేస్తాయి? రైతులకు అందజేయాల్సిన ఆధునిక సాంకేతికత, దాని ద్వారా సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను అస్సలు పట్టించుకోవడం లేదు. సేంద్రియ వ్యవసాయం, సహజ వ్యవసాయ పద్ధతులు, సహజవనరుల పరిరక్షణపై ఎలాంటి దిశానిర్దేశం లేకుండా పోయింది. ఇసుక రవాణా తీవ్రమైన పర్యావరణ సమస్య... అన్ని రాష్ట్రాల్లో సహజవనరు ఇసుక యథేచ్ఛగా దోపిడీకి గురవుతోంది. ఇసుక, గుట్ట లు, కొండలు, అడవి, ఇతర సహజవన రులు దేశప్రజల ఉమ్మడి ఆస్తి. అధికారంలో ఉన్న పార్టీ ఇష్టారీతిన తవ్వి అమ్ముకోడానికి కాదు. వాగుల్లో ఇసుక లేక పోతే నీరు రీచార్జ్ కాదు. గుట్టలు తొలగిస్తే దాని ప్రభా వం కూడా పర్యావరణ వ్యవస్థపై పడుతుంది. అధికార పార్టీ నేతలకు ఆర్థికంగా ప్రయోజనం కలిగించే చర్యలు పేదల పాలిట శాపాలుగా మారుతున్నాయి. స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి ప్రస్తుతం రాజకీయపరమైన అధికారాలన్నీ కూడా అధికారంలో ఉన్న పార్టీల వద్ద కేంద్రీకృతమై ఉన్నాయి. రాజ్యాంగపరంగా గ్రామీణ స్థానిక సంస్థలు, పట్టణ స్ధానిక సంస్థల వంటి స్థానిక ప్రభుత్వాలకు కొన్ని అధికారాలు కేటాయించారు. వాటిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆధిపత్యం చెలాయించకుండా హక్కుల రక్షణకు రాష్ట్ర ఎన్నికల సంఘాలు (ఎస్ఈసీ) ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను ఎస్ఈసీలకు అప్పగించినా..అవి రాష్ట్ర ప్రభుత్వాలను ఎదిరించి, స్వతంత్రంగా పనిచేసే స్థాయికి ఎదగలేదు. తమ పరిధిలో నిష్పక్షపాత నిర్ణయాలు కూడా తీసుకోలేని స్థితిలో వున్నాయి. అవి రాష్ట్ర ప్రభుత్వ అ«దీనంలో పనిచేసే శాఖలుగా మారిపోవడం విషాదకరం. రాజ్యాంగానికి అనుగుణంగా కాకుండా ఇష్టారాజ్యంగా ప్రభుత్వాలు లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ వంటివి కేవలం ఆకారపుష్టిగానే మిగిలిపోయాయి. ఇక సమాచారహక్కు కమిషనర్ల నియామకమే జరగడం లేదు. రాజ్యాంగానికి అనుగుణంగా కాకుండా రాష్ట్రప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నాయి. ఎన్నికలప్పుడు ఇలాంటి ముఖ్యమైన అంశాలు చర్చకు రావడం లేదు. కులం,మతం, ప్రాంతం వంటి విషయాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి చర్చను పక్కదోవ పట్టిస్తున్నారు. గతంతో పోలి్చతే ఇప్పుడు ప్రజాసమస్యలనేవి ఏమాత్రం ప్రధానచర్చకు రావడం లేదు. ఎన్నికల్లో సామాన్యుడు పోటీ చేసే పరిస్థితి ఉందా ? ఎన్నికలనేవి ఎమ్మెల్యేల అభ్యర్థులకు వ్యాపారంగా మారిపోవడం విషాదకరం. రాజకీయపార్టీలు కూడా సిగ్గులేకుండా ఎన్నికోట్లు ఖర్చుచేస్తారనే దాని ప్రాతిపదికన అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తున్నాయి. ఎన్నికల్లో డబ్బు పాత్ర విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులు అసలు పోటీ చేయాలని కనీసం ఆలోచన చేసే, సాహసించే పరిస్థితులే లేకుండా పోయాయి. సుస్థిర అభివృద్ధిపై హామీ ఏదీ? అటు కేంద్ర, ఇటు రాష్ట్రప్రభుత్వాలు దేశ, రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి గురించి స్పష్టమైన హామీలు ఇవ్వకపోతే ఎలా? సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంబంధించిన ప్యారిస్ అగ్రిమెంట్లో సంతకం పెట్టి భారత్ భాగస్వామి అయినా...వాటిని సాధించే దిశలో మాత్రం అడుగులు వేయకపోవడం విచారకరం. ఈ విషయంలో మన దేశం వ్యవహారశైలి తీసికట్టుగా ఉంది. పర్యావరణ అంశాలపై .. దేశంలో ప్రవహించే ప్రతీ నదిలో ప్రవహించే నీరు విషతుల్యంగా మారుతోంది. వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకోవడంతో...వాయునాణ్యత తీసికట్టుగా మారి దేశవ్యాప్తంగా పీల్చే గాలి విషంగా మారుతోంది. జీవవైవిధ్యమే పూర్తిస్థాయిలో దెబ్బతింటోంది. దీంతో మొత్తం దేశమే ఓ గ్యాస్‌చాంబర్‌గా మారుతోంది. ఈ అంశాలేవి కూడా అటు లోక్‌సభ ఎన్నికల్లో, ఇటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా చర్చనీయాంశం కావడం లేదు. అసలు ఈ సమస్యలకు ప్రాధాన్యత లేదన్నట్టుగా రాజకీయపార్టీలు పట్టించుకోవడం లేదు. -కె. రాహుల్ -
రాంసింగ్‌కు నెసా ఎమినెంట్ సైంటిస్ట్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫె\సర్గా పనిచేస్తున్న డాక్టర్ లకావత్ రాంసింగ్‌కు ఢిల్లీకి చెందిన నేషనల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అకాడమీ (నెసా) అవార్డు దక్కింది. ఈ మేరకు ఎమినెంట్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్– 2021కు రాంసింగ్‌ను ఎంపిక చేసినట్టు నెసా అధ్యక్షుడు డాక్టర్ జావెద్ అహ్మద్ మంగళ వారం వెల్లడించారు. పాడి రైతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా సదస్సుల నిర్వహణ, గోపాల మిత్రలకు శిక్షణ కార్యక్రమాలు, వెటర్నరీ వైద్య కోర్సు ఫైనలియర్ విద్యార్థులకు అవగాహన కల్పించడం, బొవైన్ బ్రీడింగ్‌లో జాతీయ స్థాయి ప్రాజెక్టు పర్యవేక్షణ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేసినట్టు ఆయన వెల్లడించారు. తనను ఎమి నెంట్ సైంటిస్ట్ అవార్డుకు ఎంపిక చేసినందుకు నెసాకు రాంసింగ్ కృతజ్ఞతలు తెలిపారు. -
ఉతికి ఇస్త్రీ చేస్తా
ప్రపంచంలో విద్యను కనిపెట్టిన వ్యక్తి తీవ్ర ప్రమాదంలో పడ్డాడు. ఆ వ్యక్తి కోసం ఈ ఫొటోలోని పిడుగు సీరియస్‌గా గాలిస్తోంది. పొరపొటున దొరికాడో అంతే సంగతులు ఈ పిల్ల చేతిలో! సబ్బునీళ్లతో ఉతికి మంచినీళ్లలో జాడించి ఎండలో ఆరబెట్టి చక్కగా ఇస్త్రీ చేసేస్తుందట ఆ వ్యక్తిని. గుర్రున చూసే ఎమోజీ ఎక్స్ప్రెషన్తో ఉన్నారా? గుజరాత్‌కు చెందిన ఆరేడేళ్ల ఈ అమ్మాయి నిద్రను, ఆటను చెడగొట్టే స్కూల్ టైట్ షెడ్యూల్ మీద విరుచుకుపడుతున్న తీరును వీడియో తీశారు. దాన్ని అరుణ్ బొత్రా అనే పోలీస్ ఆఫీసర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ట్విట్టర్లో పెట్టిన గంటకే దాదాపు రెండున్నర లక్షల పై చిలుకు వీక్షణాలు వచ్చాయట. ‘‘కనీసం ఒక్క నెల రోజులైనా ఈ స్కూల్ నుంచి నాకు చుట్కారా (విముక్తి) కావాలి. అరే.. పొద్దున్నే నిద్రలేపుతారు.. మంచినీళ్లు తాగిస్తారు.. బ్రష్ చేసుకొమ్మని వెంటపడ్తారు.. తర్వాత పాలు తాగమని పోరుతారు.. స్నానం చేయమని తోస్తారు.. టిఫిన్ కుక్కుతారు.. స్కూల్‌కి పరిగెత్తమంటారు. స్కూల్లో మాత్రం? ముందు ప్రేయర్.. తర్వాత ఇంగ్లిష్.. ఆ తర్వాత ఈవీఎస్ (ఎన్వైర్మెంటల్ సైన్స్).. తర్వాత మ్యాథ్స్.. గుజరాతి.. ఆ తర్వాత జీకే.. ఆ జీకే అంటే మ్యాథ్సే కదా... అసలు ఈ స్కూల్, చదువు కనిపెట్టిన వాళ్లు నాకు కనిపిస్తే నీళ్లలో ముంచి.. ఇస్త్రీ చేస్తా..’’ అంటూ స్కూల్, హోమ్‌వర్క్, పేరెంట్స్ ఒత్తిడిని గుక్క తిప్పుకోకుండా ఏకరువు పెట్టింది. ‘‘ఇదంతా పెట్టి దేవుడు మంచే చేశాడు కదా?’’ అని వీడియో తీసిన వ్యక్తి ఆ అమ్మాయిని అడిగితే? ‘‘ఆ.. ఆ.. చదువుకొమ్మని వెంటపడ్డం ఏం మంచి? ఇదొక్కటి లేకపోతే ఎంత మజాగా ఉంటుంది?’’ అంటూ ముక్కుపుటాలదిరిస్తూ విరుచుకుపడింది ఆ చిచ్చరపిడుగు. ‘‘ఇంతకీ మోదీ..’’ అని ఆ వ్యక్తి ఏదో అడగబోతుండగా.. అది పూర్తికాకుండానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా.. ‘‘ఈసారి మోదీని ఓడించాల్సిందే’’అంటూ నడుముకు చేయిపెట్టుకొని తాపీగా ఆన్సర్ ఇచ్చింది. -
నైపర్ అందించే కోర్సుల వివరాలు..
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ వివరాలను తెలపండి? -సుష్మ, నిజామాబాద్. కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ పరిధిలోనిది ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్). యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా ఐఎఫ్ఎస్లో ప్రవేశించవచ్చు. ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్ దశలుంటాయి. అర్హత: డిగ్రీ. ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్ ఇతర సర్వీసులతో కలిసి ఉమ్మడిగా ముస్సోరిలో ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత ఐఎఫ్ఎస్ అభ్యర్థులకు న్యూఢిల్లీలోని ఫారెన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్లో ఏడాది కాలంపాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలోనే.. విదేశాల్లో భారత రాయబార కార్యాలయాల పనితీరుపై అవగాహన కల్పించేలా విదేశీ పర్యటన, అక్కడ భారతీయ రాయబార కార్యాలయాలతో అటాచ్మెంట్ ఉంటుంది. విదేశీ వ్యవహారాలతోపాటు స్వదేశంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిపై అవగాహన ఏర్పరిచే దిశగా డిస్ట్రిక్ట్ అటాచ్మెంట్ కూడా ఉంటుంది. వివరాల కోసం యూపీఎస్సీ వెబ్సైట్ www.upsc.gov.in చూడొచ్చు. ఐఐఎం-ఇండోర్ ఆఫర్ చేస్తున్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్(ఐపీఎం) కోర్సు వివరాలను తెలపండి? - రేవతి, హైదరాబాద్. మేనేజ్మెంట్ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే వారికి చక్కని అవకాశం.. ప్రఖ్యాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)- ఇండోర్ అందించే ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (ఐపీఎం). అర్హత: 60 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీలకు 55 శాతం) 10వ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణత, లేదా శాట్-1 స్కోర్ 1600-2400 మధ్యలో (ఎస్సీ/ఎస్టీలకు 1475-2400 మధ్య) ఉండాలి. ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ, అకడమిక్ రికార్డ్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్ సాధారణంగా ఫిబ్రవరి/మార్చిలలో వెలువడుతుంది. కోర్సులో 40 శాతం మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, లాజికల్ కంప్యూటర్ సైన్స్, పొలిటికల్ సైన్స్, సివిలైజేషన్ అండ్ హిస్టరీ, బయలాజికల్ సెన్సైస్, లాంగ్వేజెస్(ఒక భారతీయ భాష, ఒక విదేశీ భాష), సాఫ్ట్ స్కిల్స్ అంశాలు ఉంటాయి. 50 శాతంలో మేనేజ్మెంట్ అంశాలైన..అకౌంటింగ్, ఫైనాన్స్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, ఆపరేషన్స్ అండ్ సర్వీస్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఎకనామిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కార్పొరేట్ గవర్నెన్స్, సీఎస్ఆర్, ఇంటర్నేషనల్ బిజినెస్ తదితర అంశాలను బోధిస్తారు. మిగిలిన 10 శాతంలో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. వివరాలకు: www.iimidr.ac.in ఎంఎస్సీ (ఎన్విరాన్మెంటల్ సైన్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీల వివరాలను తెలపండి? -రాజేష్, హైదరాబాద్. ఎన్విరాన్మెంటల్ సైన్స్‌లో పీజీ చేసిన వారికి ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైైవేట్ కంపెనీలు/ఆర్గనైజేషన్స్‌లో విస్తృత స్థాయిలో అవకాశాలుంటాయి. ఈ క్రమంలో టెక్స్టైల్ మిల్స్, రిఫైనరీలు, ఫెర్టిలైజర్ ప్లాంట్స్, వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, డిస్టలరీలు, మైన్స్, తదితర పరిశ్రమలు వీరికి కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. ఆయా పరిశ్రమలు కాలుష్య స్థాయిని పర్యవేక్షించడానికి ఆర్ అండ్ డీ విభాగంలో వీరి సేవలను వినియోగించుకుంటున్నాయి. సస్టెయినబిలిటీ డెవలప్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ వంటి అంశాల్లో పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ కూడా ఎన్విరాన్‌మెంటలిస్ట్‌లను నియమించుకుంటున్నాయి. ప్రభుత్వ పరంగా ఫారెస్ట్రీ, వైల్డ్ లైఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అర్బన్ ప్లానింగ్, వాటర్ రీసోర్సెస్, అగ్రికల్చరల్ తదితర ఏజెన్సీలు/సంస్థల్లో వివిధ హోదాల్లో అవకాశాలు ఉంటాయి. అందిస్తున్న యూనివర్సిటీలు: ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్ పవేశం: రాత పరీక్ష ఆధారంగా వెబ్సైట్: ఠీఠీఠీ.ౌటఝ్చజ్చీ.్చఛి.జీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి పవేశం: రాత పరీక్ష ఆధారంగా వెబ్సైట్: ఠీఠీఠీ.టఠిఠజీఠ్ఛిటటజ్టీడ.జీ ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం పవేశం: రాత పరీక్ష ఆధారంగా వెబ్సైట్: www.andhrauniversity.edu.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) అందించే కోర్సుల వివరాలను తెలపండి? -సతీష్, నల్లగొండ. భారత ప్రభుత్వ రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) పని చేస్తుంది. దీనికి ..మొహాలీ, హైదరాబాద్, హాజీపూర్, గౌహతి, రాయ్‌బరేలీ, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ ఏడు క్యాంపస్‌లకు అవసరమైన సలహాలు, సూచనలు అందించడానికి ప్రత్యేకంగా మెంటార్ ఇన్స్టిట్యూట్లు కూడా ఉంటాయి. ఈ క్రమంలో నైపర్-హైదరాబాద్‌కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (హైదరాబాద్) మెంటార్ ఇన్స్టిట్యూట్గా వ్యవహరిస్తుంది. ఈ ఇన్స్టిట్యూట్లు మాస్టర్, పీహెచ్డీ స్థాయి కోర్సులను అందిస్తున్నాయి. మాస్టర్ విభాగంలో ఎంఎస్(ఫార్మా), ఎంటెక్ (ఫార్మా), ఎంఫార్మసీ కోర్సులు ఉన్నాయి. స్పెషలైజేషన్స్: క్లినికల్ రీసెర్చ్, బయోటెక్నాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ, మెడికల్ డివెజైస్, నేచురల్ ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ,ఫార్మాస్యూటిక్స్, ఫార్మకోఇన్ఫర్మాటిక్స్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మసీ ప్రాక్టీస్, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ట్రెడిషనల్ మెడిసిన్. ఎంబీఏ (ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్) పీహెచ్డీ స్పెషలైజేషన్స్: కెమికల్ సెన్సైస్, బయాలజికల్ సెన్సైస్, ఫార్మాస్యూటికల్ సెన్సైస్. మాస్టర్ కోర్సుల్లో నైపర్-జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఎంబీఏ కోర్సుకు రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ అనే మూడు దశలు ఉంటాయి. ఎంబీఏతో కలిపి అన్ని మాస్టర్ కోర్సులకు ఒకే పరీక్షను నిర్వహిస్తారు. పీహెచ్డీ కోర్సులకు మాత్రం నైపర్-జేఈఈ, ఇంటర్వ్యూ అనే రెండు దశల విధానాన్ని అనుసరిస్తారు. ప్రవేశ ప్రక్రియ మొత్తం నైపర్-మొహాలీ ఆధ్వర్యంలో జరుగుతుంది. వివరాలకు: www.niper.ac.in -
పచ్చని కెరీర్‌కు స్వాగతం!
పచ్చని చీర కట్టుకున్న ప్రకృతి.. కాలుష్యం కోరల్లో చిక్కుకుంది.. ‘భూతాపం’ ఇప్పుడు పుడమి నెత్తిన పెనుభూతమై కూర్చొంది! రోజురోజుకూ పెరుగుతున్న కర్బన ఉద్గారాలు.. పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఏకైక మార్గం పర్యావరణ పరిరక్షణ. దీనికి సంబంధించిన అంశాలను శాస్త్రీయ కోణంలో విశ్లేషించే నైపుణ్యాలను అందించే కోర్సు పర్యావరణ శాస్త్రం (ఎన్విరాన్మెంటల్ సైన్స్). నేడు ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణంపై అవగాహన పెరుగుతున్న కారణంగా.. సంబంధిత రంగంలో నిపుణులైన మానవ వనరుల అవసరం పెరుగుతోంది. దీంతో ‘పర్యావరణం’ పచ్చని కెరీర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. శరవేగంగా విస్తరిస్తున్న పారిశ్రామికీకరణ, పట్టణీకరణలతో పాటు పర్యావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. దీంతో పచ్చని పర్యావరణం మసకబారుతోంది. ఈ సమస్య పరిష్కారానికి పెద్ద ఎత్తున నిపుణుల అవసరం ఏర్పడింది. దీన్ని గమనించిన ఉన్నత విద్యా సంస్థలు పర్యావరణ మానవ వనరులను తీర్చిదిద్దేందుకు పలు కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ క్రమంలో తెరపైకి వచ్చిన కోర్సు.. ఎన్విరాన్మెంటల్ సైన్స్. పరిసరాల అధ్యయనం: చుట్టూ ఉన్న పరిసరాల గురించి అధ్యయనం చేయడమే ఎన్విరాన్మెంటల్ సైన్స్ (పర్యావరణ శాస్త్రం). దీనికి మూలం జీవశాస్త్రమైనప్పటికీ.. అనేక శాస్త్రాలతో సంబంధం ఉన్న అంశంగా మారుతోంది. ఈ క్రమంలో నేచురల్ సెన్సైస్, సోషల్ సెన్సైస్ వంటి అంశాల కలయికగా ఎన్విరాన్మెంటల్ సైన్స్ కరిక్యులం ఉంటుంది. ఇందులో బయలాజికల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, జియాలజీ, జాగ్రఫీ, ఎకాలజీ, జియోగ్రఫీ, సాయిల్ సైన్స్.. సంబంధిత అంశాలను బోధిస్తారు. మనం తాగే నీటి నుంచి జీవించేందుకు అవసరమైన ఆక్సిజన్ వరకు పర్యావరణ సంబంధిత అన్ని అంశాలను ఎన్విరాన్మెంటల్ సైన్స్ చర్చిస్తుంది. ఇది గాలి, నీరు, ధ్వని, పారిశ్రామిక, వాహన, ప్లాస్టిక్ వ్యర్థాల కాలుష్య నివారణ మార్గాలపై అవగాహన పెంపొందిస్తుంది. అకడమిక్‌గా ఇలా: ఎన్విరాన్మెంటల్ సైన్స్ కోర్సుల రూపకల్పన భారత్‌లో 1980ల్లోనే జరిగినప్పటికీ.. ఇటీవల కాలంలోనే వీటి ప్రాశస్త్యం పెరుగుతోంది. ఈ విభాగంలో బ్యాచిలర్, పీజీ, పీహెచ్డీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీ గ్రూప్ సబ్జెక్ట్‌లలో ఎన్విరాన్మెంట్ సైన్స్ ఒక ప్రధాన సబ్జెక్ట్‌గా పలు యూనివర్సిటీలు ఈ కోర్సును అందిస్తున్నాయి. - ప్రముఖ ఇంజనీరింగ్ యూనివర్సిటీలు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్‌ను బీటెక్ స్థాయిలో అందిస్తున్నాయి. సివిల్ ఇంజనీరింగ్‌లో ఒక ఐచ్ఛికాంశం (ఎలెక్టివ్ సబ్జెక్ట్)గా ఎన్విరాన్మెంటల్ సైన్స్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. బేసిక్ సైన్స్ కోర్సుగా ఎన్విరాన్మెంటల్ సైన్స్ కోర్సులో థియరీ, లేబొరేటరీలకు ప్రాధాన్యమిస్తారు. అదే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కోర్సులో థియరీతోపాటు ఇంజనీరింగ్ టెక్నాలజీ అంశాల సమ్మిళితంగా బోధన సాగుతుంది. పీజీ స్థాయిలో: ఐఐటీ ఖరగ్‌పూర్ బీటెక్ స్థాయిలోనే సివిల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ అనే డ్యూయల్ డిగ్రీ కోర్సుకు రూపకల్పన చేసింది. సాధారణంగా అకడమిక్ స్థాయిలో పర్యావరణ శాస్త్రంలో ఎనర్జీ కన్సర్వేషన్, బయో డైవర్సిటీ, క్లైమేట్ చేంజ్, భూగర్భ జల వనరుల నిర్వహణ, భూ ఉపరితల పరిరక్షణ అంశాలపై శిక్షణ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ సైన్స్ విషయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఐఐటీ-ముంబై, ఐఐటీ-ఢిల్లీ వంటి ప్రముఖ విద్యా సంస్థలు సహా మరెన్నో ఇంజనీరింగ్ సంస్థలు ఎంటెక్‌లో ఎన్విరాన్మెంటల్ సైన్స్ కోర్సును ఒక స్పెషలైజేషన్‌గా అందిస్తున్నాయి. మన రాష్ట్రంలో జేఎన్టీయూ పరిధిలోనూ ఎంటెక్ స్థాయిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. పీజీ తర్వాత చాలా యూనివర్సిటీలు పీహెచ్డీ కోర్సును కూడా అందిస్తున్నాయి. అంతేకాకుండా యూజీసీ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ టెస్టింగ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్సలో జేఆర్ఎఫ్ను అందిస్తోంది. పర్యావరణ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో అకడమిక్ స్థాయిలో అవగాహన కల్పించి దీని నివారణ కోసం నిపుణులను తీర్చిదిద్దడమే దీని ప్రధాన ఉద్దేశం.. ఈ నైపుణ్యాలు అవసరం: పర్యావరణ పరిరక్షణ అనేది ప్రజల ఆరోగ్యంతోనూ ముడిపడిన అంశమైన నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యే నేర్పు ఉండాలి. ఆఫీస్ రూంకే పరిమితమై విధులు నిర్వర్తిస్తామనే ధోరణి ఈ రంగంలో సరిపడదు. ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లగలిగే విధంగా మానసికంగా సంసిద్ధంగా ఉండాలి. అవకాశాలు అపారం: పర్యావరణ రంగంలో నిష్ణాతులను ఎన్విరాన్మెంటలిస్ట్లుగా వ్యవహరిస్తారు. పీహెచ్డీ స్థాయి అభ్యర్థులు శాస్త్రవేత్తలుగా, ప్రొఫెసర్లుగా స్థిరపడే అవకాశం ఉంది. పీజీ స్థాయి ఉత్తీర్ణులు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లుగా, కోఆర్డినేటర్లుగా అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో నిపుణులైన ఎన్విరాన్మెంటల్ సైన్స్ / ఇంజనీరింగ్‌లో మానవ వనరుల పరంగా డిమాండ్-సప్లయ్ విషయంలో వేలల్లో వ్యత్యాసం ఉంది. ఏటా పదివేల ఉద్యోగావకాశాలు పర్యావరణ సుస్థిరాభివృద్ధి, కాలుష్య నివారణ దిశగా ప్రభుత్వం చేపడుతున్న పలు చర్యల కారణంగా ఈ రంగంలో గత పదేళ్లలో ఏటా దాదాపు పదివేల ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో గ్రీన్ బిల్డింగ్స్ (హరిత నిర్మాణాలు) కాన్సెప్ట్ పెరిగిన నేపథ్యంలో ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్‌ల ఆవశ్యకత క్రమేణా పెరుగుతోంది. ప్రభుత్వం కూడా సౌరశక్తి, పునరుత్పాదక ఇంధన వనరుల వంటి రంగాలకు మరింత ప్రాధాన్యం ఇస్తోంది. దాంతో ఈ రంగంలో మానవ వనరుల డిమాండ్ సమీప భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. .................................................................. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) అంచనా ప్రకారం.. సౌరశక్తి విభాగంలో ప్రతి సోలార్ ప్రాజెక్ట్‌లో ఒకరికి ప్రత్యక్షంగా, మరో ముగ్గురికి పరోక్షంగా అవకాశాలు లభించనున్నాయి. .................................................................. బయోమాస్ ప్రొడక్షన్ విభాగంలోనూ ప్రతి యూనిట్లో ప్రత్యక్షంగా నలుగురికి, పరోక్షంగా పది మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. గ్రీన్ బిల్డింగ్స్ విభాగంలోనే 2025 నాటికి లక్ష మంది ప్రొఫెషనల్స్ అవసరం ఏర్పడనుంది. .................................................................. రెన్యువబుల్ ఎనర్జీ విభాగంలో 2020 నాటికి దాదాపు పది లక్షల మంది నిపుణులు కావాలి. ఇక.. సిమెంట్, రసాయన ఉత్పత్తులు, ఫెర్టిలైజర్స్ తదితర పారిశ్రామిక సంస్థలను కూడా పరిగణనలోకి తీసుకుంటే రానున్న పదేళ్లలో వేల సంఖ్యలో ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్‌ల అవసరం ఏర్పడనుంది. పీజీ ఎన్విరాన్మెంటల్సైన్స్: ఇన్స్టిట్యూట్లు ఐఐటీ-బాంబే వెబ్సైట్: www.iitb.ac.in ఐఐటీ- ఢిల్లీ వెబ్సైట్: www.iitd.ac.in ఐఐటీ- గువాహటి వెబ్సైట్: www.iitg.ac.in ఐఐటీ-ఖరగ్‌పూర్ వెబ్సైట్: www.iitkgp.ac.in జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వెబ్సైట్: www.jnu.ac.in మన రాష్ట్రంలో: ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్ వెబ్సైట్: www.osmania.ac.in ఆంధ్రా యూనివర్సిటీ- విశాఖపట్నం వెబ్సైట్: www.andhrauniversity.edu.in జేఎన్టీయూ-హైదరాబాద్ వెబ్సైట్: www.jntuh.ac.in ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వెబ్సైట్:www.nagarjunauniversity.ac.in శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వెబ్సైట్: www.svuniversity.in ఉపాధి వేదికలు: ప్రస్తుతం అంతటా ‘క్లీన్ ఎన్విరాన్మెంట్’ దిశగా ఆలోచనలు సాగుతున్న తరుణంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ విభాగంలో అర్బన్ ప్లానింగ్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్సెస్, కాలుష్య నియంత్రణ మండళ్లు తదితర విభాగాలు ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. ప్రైవేటు రంగంలో టెక్స్టైల్ మిల్స్, రిఫైనరీలు, ఫెర్టిలైజర్ ప్లాంట్స్, వ్యర్థాల నిర్వహణ ప్లాంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, మైనింగ్ కంపెనీలు ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. ఆయా పరిశ్రమలు పర్యావరణ కాలుష్య స్థాయిని పరిశీలించడానికి ఆర్ అండ్ డీ విభాగంలో వీరి సేవలను వినియోగించుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ప్రతి సంస్థ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిబంధన కారణంగా.. పర్యావరణ పరిరక్షణ కోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఎన్విరాన్మెంటల్ కోర్సు ఉత్తీర్ణులకు అవకాశాలు ఇస్తున్నాయి. స్వ చ్ఛంద సంస్థలు కూడా అవకాశాలు కల్పిస్తున్నాయి. కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లలో ఫ్యాకల్టీగా స్థిరపడొచ్చు. ఎన్విరాన్మెంటల్ జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. అంతర్జాతీయంగానూ యునెటైడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీసీ), ఎర్త్ సిస్టమ్ గవర్నెన్స ప్రాజెక్ట్ వంటి సంస్థల్లో అడుగుపెట్టొచ్చు. వేతనాలు: కంపెనీని బట్టి ప్రారంభంలో కనీసం రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు వేతనం అందుకోవచ్చు. పీజీ/పీహెచ్డీ ఉంటే నెలకు రూ. 35 వేల నుంచి రూ. 50 వేల వరకు లభిస్తుంది. తర్వాత అర్హత, అనుభవం ఆధారంగా రెట్టింపు వేతనాన్ని అందుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనలు.. మరిన్ని అవకాశాలు: రూ. 50 కోట్ల వ్యయాన్ని మించిన ప్రాజెక్టులను చేపట్టే సంస్థలు, పదివేల మందికిపైగా కార్మికులతో నిర్మాణం చేపట్టే యూనిట్లు, నిత్యం 50 వేలకుపైగా వ్యర్థాలను విడుదల చేసే ఉత్పత్తి సంస్థలు తప్పనిసరిగా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలి. ఇందుకోసం సంబంధిత నిపుణులను నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు. స్వయం ఉపాధి దిశగా ఆలోచన ఉంటే ఎన్విరాన్మెంట్ కన్సల్టెంట్గానూ ప్రాక్టీస్ చేయవచ్చు. ఐదంకెల జీతం! ప్రస్తుతం అకడమిక్ పరంగా బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీ రెండో సంవత్సరంలో ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఒక పేపర్‌గా ఉన్నప్పటికీ దీనిపై విద్యార్థులకు తగినంత అవగాహన లేదు. పీజీ స్థాయిలో మాత్రం ఎందరో ఈ కోర్సును ఎంచుకుంటున్నారు. కోర్సు పూర్తి చేసిన నెల రోజుల్లోపే ఐదంకెల జీతంతో ఉద్యోగాలు పొందుతుండటమే ఈ కోర్సు ప్రాముఖ్యతకు నిదర్శనం. అంతేకాకుండా సమీప భవిష్యత్తులో వేల సంఖ్యలో మానవ వనరుల అవసరం ఏర్పడనుంది. - డాక్టర్ ఎ.వి.వి.ఎస్.స్వామి, హెచ్ఓడీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్