సాక్షి, హైదరాబాద్: పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫె\సర్‌గా పనిచేస్తున్న డాక్టర్ లకావత్ రాంసింగ్‌కు ఢిల్లీకి చెందిన నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అకాడమీ (నెసా) అవార్డు దక్కింది. ఈ మేరకు ఎమినెంట్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్– 2021కు రాంసింగ్‌ను ఎంపిక చేసినట్టు నెసా అధ్యక్షుడు డాక్టర్ జావెద్ అహ్మద్ మంగళ వారం వెల్లడించారు.
పాడి రైతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా సదస్సుల నిర్వహణ, గోపాల మిత్రలకు శిక్షణ కార్యక్రమాలు, వెటర్నరీ వైద్య కోర్సు ఫైనలియర్ విద్యార్థులకు అవగాహన కల్పించడం, బొవైన్ బ్రీడింగ్‌లో జాతీయ స్థాయి ప్రాజెక్టు పర్యవేక్షణ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేసినట్టు ఆయన వెల్లడించారు. తనను ఎమి నెంట్ సైంటిస్ట్ అవార్డుకు ఎంపిక చేసినందుకు నెసాకు రాంసింగ్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment