Ram Singh
-
కోడలి హత్య కేసులో అత్తకు రెండు జీవిత ఖైదులు
ఖలీల్‌వాడి: కట్నం కోసం కొడుకుతో కలిసి కుట్రపన్ని కోడలి కిరాతకంగా హతమార్చిన చేసిన కేసులో బానోత్ పద్మ అనే దోషికి రెండు జీవిత కారాగార శిక్షలు విధిస్తూ నిజామాబాద్ జిల్లా, సెషన్స్ జడ్జి సునీత కుంచాల బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. ప్రధాన ముద్దాయి బానోత్ రామ్‌సింగ్ కోర్టు వాయిదాకు గైర్హాజరవడంతో అతనిపై బెయిల్‌కు వీల్లేని అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ముద్దాయి కోర్టుకు హాజరయ్యాక శిక్ష ఖరారు చేయనున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని... నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం శివ తండాకు చెందిన బానోత్ రామ్‌సింగ్... ఏపీలోని ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన యెండల రాధ సికింద్రాబాద్‌లోని కళామందిర్ షోరూంలో కలిసి పనిచేసేవారు. దీంతో వారి మధ్య ప్రేమ చిగురించి 2020 జనవరి 30న నవీపేట్‌లోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. రాధ తల్లిదండ్రులు పేదలు కావడంతో పెళ్లి సమయంలో కట్నకానుకలు ఇవ్వలేదు. అయితే పెళ్లియిన కొన్ని రోజులకే కట్నం కోసం రాధకు వేధింపులు మొదలయ్యాయి. రూ. లక్ష నగదుతోపాటు బంగారాన్ని తల్లిదండ్రుల నుంచి తేవాలని భర్త, అత్త పద్మ ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. అదే సమయంలో రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ విధించడంతో రామ్‌సింగ్ ఉద్యోగం కోల్పోయాడు. మరో పెళ్లి చేసుకుంటే ఆర్థికంగా కలిసొస్తుందని భావించాడు. ఇందుకు అడ్డంకిగా ఉన్న భార్యను చంపాలని తల్లితో కలిసి కుట్రపన్నాడు.బైక్‌పై తీసుకెళ్లి.. చుట్టాల ఇంటికి వెళ్లొద్దామని రాధను నమ్మించిన రామ్‌సింగ్, పద్మ ఆమెను బైక్‌పై తీసుకెళ్లారు. దగ్గర దారిలో వెళ్దామంటూ రాధను మాక్లూర్ మండలం రాంచంద్రాపల్లి అటవీ ప్రాంతంలోని బాసం లొద్ది గుట్టపైకి తీసుకెళ్లారు. ముందు నడుస్తున్న రాధపై వెంట తెచ్చుకున్న పెట్రోల్, కిరోసిన్‌ను అత్త పోసింది. వెంటనే రామ్‌సింగ్ అగ్గిపుల్ల గీసి నిప్పంటించడంతో మంటలకు తాళలేక రాధ విలవిల్లాడింది. అయినా ఆమె బ్రతికి ఉండటంతో బండ రాళ్లతో తలపై కొట్టి తీవ్రంగా గాయపర్చారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఒక గుంతలో పడేసి సజీవదహనం చేశారు. ఈ కేసును ఛేదించిన అప్పటి నిజామాబాద్ సౌత్ సీఐ శ్రీనాథ్‌రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్ కుమార్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన జడ్జి తాజాగా ముద్దాయి పద్మకు జైలుశిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. వరకట్న వేధింపులు, హత్య చేసినందుకు ఒక జీవితఖైదు విధించడంతోపాటు కుట్ర కేసులో మరో జీవిత ఖైదు, సాక్ష్యాధారాలను మాయం చేసిన నేరానికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రధాన ముద్దాయిపైనా నేరారోపణలు రుజువు అయినట్లు నిర్ధారించారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవిరాజ్ వాదనలు వినిపించారు. -
థర్డ్ డిగ్రీ, సాక్షులను కొట్టడం మీ డ్యూటీనా
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. తాను చెప్పిన విధంగానే వాంగ్మూలం ఇవ్వాలని ఫిర్యాదుదారుడిపై రామ్‌సింగ్ ఎలా ఒత్తిడి చేస్తారని ప్రశ్నించింది. దర్యాప్తు అధికారి వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అంటూ నిలదీసింది. సాక్షులను కొట్టడం, థర్డ్ డిగ్రీ ఉపయోగించడం వంటివి చేయవచ్చా అంటూ సీబీఐ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)ని ప్రశ్నించింది. ఇలాంటి కస్టోడియల్ విచారణ చేయడం విధి నిర్వహణలో భాగమా అంటూ నిలదీసింది. పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, సీబీఐ అధికారి రామ్‌సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై వాదనలు విన్న హైకోర్టు విచారణను ముగించింది. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.వివేకా హత్య విషయంలో తాము చెప్పినట్లు వినకుంటే అంతు చూస్తామంటూ బెదిరించడమే కాకుండా తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి గతంలో పులివెందుల కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు పులివెందుల పోలీసులు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, నర్రెడ్డి సునీత, సీబీఐ అధికారి రామ్‌సింగ్‌లపై కేసు నమోదు చేశారు. పులివెందుల కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ సునీత, రాజశేఖరరెడ్డి, రామ్‌సింగ్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన శ్రీనివాసరెడ్డి, పులివెందుల కోర్టులో విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా సునీత, రాజశేఖరరెడ్డి తరపు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ, మేజిస్ట్రేట్ యాంత్రికంగా ఉత్తర్వులిచ్చారన్నారు. పోలీసుల నుంచి నివేదిక కోరకుండా నేరుగా కేసు నమోదుకు ఆదేశాలివ్వడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. కేసు నమోదుకు జారీ చేసిన ఉత్తర్వుల్లో కారణాలను వెల్లడించలేదన్నారు.సీబీఐ తరఫున ప్రత్యేక పీపీ అనిల్ తన్వర్ వాదనలు వినిపిస్తూ.. పులివెందుల కోర్టు పరిధి దాటి ఉత్తర్వులిచ్చిందని అన్నారు. ఫిర్యాదుదారుడి నుంచి ప్రమాణపూర్వక వాంగ్మూలాన్ని నమోదు చేయకుండానే కేసు నమోదుకు ఆదేశాలిచ్చారని తెలిపారు. రాంసింగ్ ఏం చేసినా విధి నిర్వహణలో భాగంగానే చేశారన్నారు. ఆ విధంగానే తన ముందు హాజరు కావాలని ఫిర్యాదుదారుడిని రామ్‌సింగ్ ఆదేశించారన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. సాక్షులను కొట్టడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వంటివి కూడా విధి నిర్వహణలో భాగమేనా అంటూ నిలదీశారు.సుప్రీంకోర్టు దర్యాప్తు నుంచి రాంసింగ్‌ను తప్పించిందిఅనంతరం ఫిర్యాదుదారు కృష్ణారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ప్రద్యుమ్న కుమార్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాంసింగ్‌పై తీవ్రమైన ఆరోపణలున్నాయన్నారు. అందుకే సుప్రీంకోర్టు ఆయన్ని వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు నుంచి తొలగించిందన్నారు. మేజిస్ట్రేట్ ఉత్తర్వులు సరైనవేనని తెలిపారు. కారణాలను తెలియచేయాల్సిన అవసరం లేదన్నారు. ముందస్తు అనుమతి అవసరం లేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు తీర్పులను ప్రస్తావించారు.నిబంధనల మేరకే మేజిస్ట్రేట్ వ్యవహరించారుపోలీసుల తరఫున రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) యర్రంరెడ్డి నాగిరెడ్డి, అదనపు పీపీ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి, స్పెషల్ అసిస్టెంట్ పీపీ సూరా వెంకట సాయినాథ్ వాదనలు వినిపించారు. ప్రైవేటు ఫిర్యాదుపై విచారణకు ఆదేశించే విషయంలో మేజిస్ట్రేట్ ఎలాంటి కారణాలను తెలియచేయాల్సిన అవసరం లేదన్నారు. నిబంధనలకు అనుగుణంగానే మేజిస్ట్రేట్ వ్యవహరించారని వివరించారు. మేజిస్ట్రేట్ కేసును విచారణకు స్వీకరించలేదని, దర్యాప్తునకు మాత్రమే ఆదేశించి తుది నివేదిక కోరారని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ కూడా దాఖలు చేశారన్నారు. అయితే కోర్టు ఈ చార్జిషీట్‌ను సాంకేతిక కారణాలతో రిటర్న్ చేసిందన్నారు. సీబీఐ అధికారి ప్రాసిక్యూషన్‌కు ముందస్తు అనుమతి అవసరం లేదన్నారు. ఏ దశలోనైనా అనుమతి తీసుకోవచ్చని తెలిపారు. అందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరించారు. -
ప్రజలు ఛీకొడతారన్న కనీస జ్ఞానం టీడీపీకి లేదు’
-
సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై కేసు నమోదు
-
రాంసింగ్‌కు నెసా ఎమినెంట్ సైంటిస్ట్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫె\సర్గా పనిచేస్తున్న డాక్టర్ లకావత్ రాంసింగ్‌కు ఢిల్లీకి చెందిన నేషనల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అకాడమీ (నెసా) అవార్డు దక్కింది. ఈ మేరకు ఎమినెంట్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్– 2021కు రాంసింగ్‌ను ఎంపిక చేసినట్టు నెసా అధ్యక్షుడు డాక్టర్ జావెద్ అహ్మద్ మంగళ వారం వెల్లడించారు. పాడి రైతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా సదస్సుల నిర్వహణ, గోపాల మిత్రలకు శిక్షణ కార్యక్రమాలు, వెటర్నరీ వైద్య కోర్సు ఫైనలియర్ విద్యార్థులకు అవగాహన కల్పించడం, బొవైన్ బ్రీడింగ్‌లో జాతీయ స్థాయి ప్రాజెక్టు పర్యవేక్షణ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేసినట్టు ఆయన వెల్లడించారు. తనను ఎమి నెంట్ సైంటిస్ట్ అవార్డుకు ఎంపిక చేసినందుకు నెసాకు రాంసింగ్ కృతజ్ఞతలు తెలిపారు. -
రైతులకు మద్దతుగా ఆత్మహత్య
న్యూడిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా హరియాణాలోని కర్నాల్‌కు చెందిన మత ప్రబోధకుడు సంత్ బాబా రామ్ సింగ్(65) బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ శివార్లలోని సింఘు సరిహద్దు వద్ద తుపాకీతో కాల్చుకున్నారు. రామ్‌సింగ్‌కు పంజాబ్, హరియాణాల్లో అనుయాయులు ఉన్నారు. హరియాణా శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) సహా పలు ఆధ్యాత్మిక సంస్థల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. బాబా రామ్‌సింగ్ మృతదేహం సమీపంలో ఆయన పంజాబీలో రాసిన ఆత్మాహుతి లేఖ లభించింది. ‘హక్కుల కోసం రోడ్డుపై ఆందోళన చేస్తున్న రైతుల దీనస్థితిని, వారికి న్యాయం చేయకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేతను చూసి తట్టుకోలేకపోతున్నాను’ అని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. రైతులకు మద్దతుగా పలువురు తమకందిన ప్రభుత్వ పురస్కారాలను వెనక్కు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘రైతులకు మద్దతుగా, ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ సేవకుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇది ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా తీసుకుంటున్న చర్య’ అని వివరించారు. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రామ్‌సింగ్ మృతికి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యకు మోదీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ రాక్షసత్వం అన్ని హద్దులు దాటిందని మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమిటీతో లాభం లేదు రైతు ఆందోళనలపై సుప్రీంకోర్టు సూచించినట్లుగా కమిటీని ఏర్పాటు చేయడం వల్ల పరిష్కారం లభించదని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దే ఏకైక పరిష్కారమని పేర్కొన్నాయి. కమిటీని ఏర్పాటు చేస్తామని చర్చల సందర్భంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదించిందని, ఆ ప్రతిపాదనను అప్పుడే తిరస్కరించామని రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సభ నేత అభిమన్యు కోహర్ వెల్లడించారు. ఇప్పటివరకు చర్చలు జరిపిన ప్రభుత్వ ప్రతినిధులు, రైతు ప్రతినిధులు కమిటీతో సమానమేనని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత, దానిపై ప్రభుత్వ స్పందనను గమనించిన తరువాత ఈ విషయంపై మాట్లాడుతామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ పేర్కొన్నారు. మరోవైపు, ఇతర రైతు సంఘాలతో సమాంతర చర్చలను నిలిపేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనల్లో పాల్గొంటున్న 40 రైతు సంఘాల ఐక్య కూటమి ‘సంయుక్త కిసాన్ మోర్చా’ కేంద్రానికి లేఖ రాసింది. యూపీ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాలతో ఇటీవల కేంద్ర ప్రతినిధులు భేటీకావడం తెల్సిందే. వ్యవసాయ చట్టాలకు సవరణలు చేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని కేంద్రానికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. మరోవైపు, చిల్లా సరిహద్దు వద్ద భద్రతను మరింత పెంచారు. చిల్లా సరిహద్దును దిగ్బంధిస్తామని రైతు నేతలు హెచ్చరించిన నేపథ్యంలో ఢిల్లీ–నోయిడా మార్గంలోని చిల్లా సరిహద్దులో బలగాలను మోహరించారు. -
రూ.8 కోట్ల ఎర్రచందనం స్వాధీనం
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు రాష్ట్రం తూత్తుకూడి జిల్లాలో రూ.8 కోట్ల విలువైన రెండు టన్నుల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళకూలీలపై కాల్పుల ఉదంతం తరువాత తమిళనాడులోని ఎర్ర దొంగలను పట్టుకోవడంపై దృష్టిసారించిన పోలీసులు వేలూరులో మోహనాంబాళ్ను రెండురోజుల కిందట అరెస్ట్ చేశారు. ఆమెకు సంబంధించిన వ్యక్తులు తమిళనాడులోనే ఎర్రచందనం దాచి ఉంచారనే అనుమానంతో తిరుపతి డీఎస్పీ రామకృష్ణ, ఐదుగురు ఇన్స్పెక్టర్లతో కూడిన 50 మంది బృందం శనివారం చెన్నైకి చేరుకుంది. నగర శివార్లలోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. అక్కడ వారికి ఏమీ దొరకలేదు. తూత్తుకూడి జిల్లా కొరంపాళం సమీపం మాధవనగరంలో జోసువా అనే వ్యక్తికి చెందిన గోడౌన్‌పై అక్కడి పోలీసులు దాడులు జరపగా ఒక లారీ కంటైనర్‌లో దాచి ఉంచిన రెండుటన్నుల ఎర్రచందనం దుంగలను కనుగొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు నుంచి తూత్తుకూడికి చేరవేసిన ఈ దుంగలను దుబాయికి తరలిచేందుకు సిద్ధం చేసి ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ దుంగల విలువ రూ.8 కోట్లుగా అంచనా వేశారు. ఈ కేసులో జోసువాతోపాటు మరొకరిని తూత్తుకూడి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. 15 దుంగలు స్వాధీనం రుద్రవరం: కర్నూలు జిల్లా రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని మంగమ్మ బరకలు కోనేరు వద్ద నిల్వ ఉంచిన రూ.5 లక్షల విలువ చేసే 15 ఎర్రచందనం దుంగలను శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు రేంజర్ రామ్‌సింగ్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. -
కుక్కలొచ్చాయి జాగ్రత్త!
రుద్రవరం, న్యూస్‌లైన్: నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అటవీశాఖ అధికారులు పోలీసుల సహకారం తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. దీంతో స్మగ్లర్లలో వణుకు పుడుతోంది. రుద్రవరం రేంజ్ పరిధిలోని ఆర్. నాగులవరం, రుద్రవరం తదితర గ్రామాల్లో ఎర్రచందనం స్మగర్లు దుంగలను నిల్వ ఉంచి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు మంగళవారం అటవీ అధికారి రాంసింగ్, పోలీసు అధికారి శ్రీకాంతరెడ్డి డాగ్ స్క్వాడ్ సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రాంసింగ్ మాట్లాడుతూ రేంజ్ పరిధిలోని చాలా గ్రామాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టగలిగామన్నారు. ఆర్ నాగులవరం, టి లింగందిన్నె, తిప్పారెడ్డి పల్లె గ్రామాల్లో స్మగర్లు ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగిస్తున్నారని అక్రమ రవాణాను అడ్డు కోవడానికి పోలీసుల సహకారం కోసం జిల్లా ఎస్పీ రఘురామి రెడ్డిని కోరామన్నారు. స్పందించిన ఆయన జిల్లా పోలీసు అధికారి పోలీసు బలగాలతోపాటు డాగ్ స్క్వాడ్‌ను పంపించారన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో పేరొందిన ఆర్. నాగులవరం గ్రామాన్ని మొదట ఎన్నుకుని దాడులు నిర్వహించామన్నారు. అలాగే రుద్రవరం గ్రామంలోని బెస్తకాలనీలో సోదాలు నిర్వహించామన్నారు. ఇప్పటి నుంచి డాగ్ స్క్వాడ్ సిబ్బంది రుద్రవరం ఫారెస్ట్ కార్యాలయంలో ఉంటుందని రాత్రి సమయంలో దాడులు చేస్తామన్నారు. దాడుల్లో సెక్షన్ అధికారి జాకీర్ ఉశేన్, బీటు అధికారి రామకృష్ణలతోపాటు డాగ్ స్క్వాడ్, పోలీసు, ఫారెస్టు సిబ్బంది పాల్గొన్నారు. -
సాక్ష్యాధారాలు లేకుండా అరెస్టు చేశారు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన డిసెంబర్ 16 నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించిన నలుగురిలో ఇద్దరు పోలీసులు తమను ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని హైకోర్టులో తెలిపారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దోషులు ముఖేశ్, పవన్‌కుమార్ గుప్తాలు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ రేవా ఖేత్రపాల్, జస్టిస్ ప్రతిభారాణిలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దోషుల తరఫు న్యాయవాది ఎంఎల్ శర్మ తన క్లయింట్లను పోలీసులు ఎలాంటి సాక్ష్యాలు లేకుం డానే అరెస్టు చేశారని ధర్మాసనానికి తెలిపారు. కేవలం మీడియా వార్తల ఆధారంగా ముఖేశ్, పవన్ కుమార్ గుప్తాలను పోలీసులు అరెస్టు చేశారని, కీలక ముద్దాయి రాంసింగ్ సోదరుడైన ముఖేశ్‌ను రాజస్థాన్‌లోని ఓ గ్రామం నుంచి సంఘటన జరిగిన మరుసటి రోజు అరెస్టు చేశారని ఆయన ధర్మాసనానికి విన్నవించారు. పోలీసులు తన కక్షిదారులను హింసించడమే కాకుండా వారికి ఉచిత న్యాయ సహాయం అందించలేదని ఆరోపించారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన తరువాత కూడా నిందితులకు పోలీసులు న్యాయసహాయం ఏర్పాటు చేయలేదన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఓ బాలుడితో సహా ఈ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు రాంసింగ్ తరువాత తీహార్ జైలులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు’’ అని ధర్మాసనానికి వివరించాడు. సెప్టెంబర్ 13న ఈ కేసులో ట్రయల్ కోర్టు ముఖేశ్, పవన్‌గుప్తా, అక్షయ్, వినయ్‌లకు మరణశిక్ష విధించింది. మరణశిక్షలను ధ్రువీకరించాల్సిందిగా ట్రయల్ కోర్టు కేసును హైకోర్టుకు దాఖలు పర్చింది.