Ilaiyaraaja Biopic:వెండితెరకి ఇళయరాజా జీవితం | Ilaiyaraaja Biopic Launched | Sakshi
Sakshi News home page

Ilaiyaraaja Biopic:వెండితెరకి ఇళయరాజా జీవితం

Published Thu, Mar 21 2024 4:06 AM | Last Updated on Thu, Mar 21 2024 7:24 PM

Ilaiyaraaja Biopic Launched - Sakshi

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా జీవితం వెండితెరపైకి వస్తోంది. ధనుష్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న ‘ఇళయరాజా’ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ మూవీకి అరుణ్‌మాథేశ్వరన్  దర్శకుడు. కనెక్ట్‌ మీడియా, పీకే ప్రైమ్‌ ప్రొడక్షన్, మెర్క్యూరీ మూవీస్‌ సమర్పణలో రూ΄÷ందుతున్న ‘ఇళయరాజా’ షూటింగ్‌ బుధవారం చెన్నైలో ప్రారంభమైంది.

ఈ వేడుకకి ఇళయరాజా, హీరోలు కమల్‌హాసన్, ధనుష్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇళయరాజాతో తమకున్న అనుబంధాన్ని కమల్‌హాసన్, ధనుష్‌ పంచుకున్నారు. కాగా ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి నీరవ్‌ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ఈ మూవీకి ఇళయరాజా సంగీతం అందిస్తారని కోలీవుడ్‌ టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement