lead role
-
పాన్ ఇండియా మూవీలో...
పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందనుంది. ఈ చిత్రానికి ముని దర్శకత్వం వహించనున్నారు. సినిమా టికెట్ ఎంటర్టైన్మెంట్స్– అర్జున్ ఆర్ట్స్‌పై రూపొందనున్న ఈ చిత్రం ఈ నెల 24న హైదరాబాద్‌లోప్రారంభం కానుంది. ‘‘పాయల్ రాజ్‌పుత్ మరో వైవిధ్యమైన పాత్రలో నటించనున్న చిత్రమిది. ఆమె క్యారెక్టర్లో పలు భావోద్వేగాలు ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
Ilaiyaraaja Biopic:వెండితెరకి ఇళయరాజా జీవితం
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా జీవితం వెండితెరపైకి వస్తోంది. ధనుష్ లీడ్ రోల్లో నటిస్తున్న ‘ఇళయరాజా’ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ మూవీకి అరుణ్మాథేశ్వరన్ దర్శకుడు. కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యూరీ మూవీస్ సమర్పణలో రూ΄÷ందుతున్న ‘ఇళయరాజా’ షూటింగ్ బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. ఈ వేడుకకి ఇళయరాజా, హీరోలు కమల్‌హాసన్, ధనుష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇళయరాజాతో తమకున్న అనుబంధాన్ని కమల్‌హాసన్, ధనుష్ పంచుకున్నారు. కాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ఈ మూవీకి ఇళయరాజా సంగీతం అందిస్తారని కోలీవుడ్ టాక్. -
ఫైట్.. హైలైట్
మంచు లక్ష్మి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్–అమెరికా ఇండియా ఎంటర్టైన్మెంట్స్పై రూ΄పొందింది. కాగా ఆదివారం (అక్టోబర్ 8) మంచు లక్ష్మి పుట్టినరోజుని పురస్కరించుకుని ‘ఆదిపర్వం’లోని ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా సంజీవ్ మేగోటి మాట్లాడుతూ– ‘‘1974–1990 మధ్యకాలంలో జరిగిన వాస్తవ ఘటనలతో ఈ చిత్రం రూపొందింది. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో పాటు ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో మంచు లక్ష్మి పాత్ర ఆమె కెరీర్లోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది. తను చేసిన రెండు ఫైట్స్ సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి. ‘అమ్మోరు, అరుంధతి’ చిత్రాల తరహాలో కథ, గ్రాఫిక్స్ ఉంటాయి’’ అన్నారు. ‘‘రెట్రో ఫీల్‌తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మొదలై కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం అలరిస్తుంది’’ అన్నారు చిత్ర ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్ ఘంటా శ్రీనివాస రావ్, సహనిర్మాత గోరెంట శ్రావణి. ఈ చిత్రంలో ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. -
భలేగా బ్యాలెన్స్!
సినిమాలను, వెబ్ సిరీస్‌లను భలేగా బ్యాలెన్స్ చేస్తున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. కథను బట్టి మెయిన్ లీడ్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తుంటారు. ఇప్పటికే తెలుగు ఆంథాలజీ సిరీస్ ‘అద్దం’తో డిజిటల్ వ్యూయర్స్‌కు దగ్గరైన వరలక్ష్మి తాజాగా మరో తెలుగు వెబ్ సిరీస్ ‘మాన్షన్ 24’లో మెయిన్ లీడ్ రోల్ చేశారు. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో రూ΄÷ందిన ఈ సిరీస్‌లో అవికా గోర్, బిందు మాధవి, నందు, మానస్, అయ్యప్ప పి. శర్మ, రావు రమేష్ ఇతర ΄ాత్రధారులు. ‘రాజుగారి గది’ ఫ్రాంచైజీ ఫేమ్ ఓంకార్ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ‘‘ఒకవైపు సినిమాల్లో నెగటివ్, ΄ాజిటివ్ షేడ్స్ ఉన్న ΄ాత్రలు చేస్తున్నాను. వెబ్ సిరీస్‌లలో కూడా మంచి ΄ాత్రలు చేస్తున్నాను’’ అన్నారు వరలక్ష్మి. -
తలకోనలో ఏం జరిగింది?
అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘తలకోన’. నగేష్ నారదాసి దర్శకత్వం వహించారు. స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్ రెడ్డి (చేవెళ్ల) నిర్మించిన ఈ చిత్రం నవంబరులో విడుదల కానుంది. ‘‘కొంతమంది స్నేహితులతో కలిసి అడవికి వెళతారు హీరోయిన్ . ఎంతమంది వెళ్లారు? ఎందరు తిరిగొచ్చారు? అక్కడ ఏం జరిగింది? అనే అంశాలతో ఈ చిత్ర కథ సాగుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సుభాష్ ఆనంద్ సంగీత దర్శకుడు. -
నవ్వించడంతో పాటు థ్రిల్ చేస్తానంటున్న రకుల్
రకుల్ ప్రీత్ సింగ్ నవ్వించడానికి, థ్రిల్ చేయడానికి రెడీ అయ్యారు. ఆమెతో పాటు నీనా గుప్తా కూడా చేతులు కలిపారు. ఈ ఇద్దరూ కలిసి చేసే కామెడీ, థ్రిల్‌ని వచ్చే ఏడాది వెండితెరపై చూడొచ్చు. రకుల్, నీనా గుప్తా లీడ్ రోల్స్‌లో ఓ చిత్రం రూపొందనుంది. కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు ఆశిష్ ఆర్. శుక్లా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని సునీల్ కేతర్పాల్ నిర్మించనున్నారు. రకుల్ ఓ లీడ్ రోల్లో నటించిన ‘ఐ లవ్ యు’కి కూడా కేతర్పాల్నే నిర్మాత. ఈ ఏడాది జూన్‌లో ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. అయితే తాజా చిత్రాన్ని మాత్రం థియేటర్స్‌లోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ని అక్టోబర్‌లో ఆరంభించి, డిసెంబర్‌కల్లా పూర్తి చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రం విడుదలయ్యే చాన్స్ ఉంది. -
'బుట్టబొమ్మ' బ్యూటీకి సూపర్ ఛాన్స్.. పాన్ ఇండియా హీరోతో
అజిత్ హీరోగా నటించిన ‘ఎంతవాడు కానీ’, ‘విశ్వాసం’ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది అనికా సురేంద్రన్. ఆ తర్వాత కథానాయకిగా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టింది. అందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా మార్చుకుంది. అలా శృతిమించిన అందాలను ఆరబోస్తూ ప్రత్యేకంగా తీర్చుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి సినీ పెద్దల దృష్టిలో పడే ప్రయత్నం చేసింది. అలా తెలుగులో వచ్చిన నాగార్జున ‘ది ఘోస్ట్’, ‘బుట్టబొమ్మ’ వంటి చిత్రాల్లో ఓ లీడ్ యాక్ట్రస్‌గా నటించింది. తెలుగులోనే కాకుండా మలయాళంలోనూ కథానాయికగా నటించడం మొదలెట్టింది. అయితే తెలుగులో ఆ అమ్మడు నటించిన బుట్ట బొమ్మ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో మళ్లీ ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఎట్టకేలకు తమిళంలో ఒక అవకాశాన్ని అందుకుంది. నటుడు ధనుష్ తన 50వ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో నటుడు ఎస్జే సూర్య, సందీప్ కిషన్, కాళిదాసు, జయరాం నటి దసరా విజయం అపర్ణ బాలమురళి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం కోసం చైన్నె, ఈసీఆర్ రోడ్ లో 500 ఇళ్లతో భారీసెట్ ను వేస్తున్నారు. జైలర్ చిత్రం విడుదల తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను వెల్లడించే అవకాశం ఉంది. ఈ భారీ చిత్రంలో నటి అనికా సురేంద్రన్ ముఖ్య పాత్రలో నటించనున్నట్లు తాజా సమాచారం. మొత్తం మీద కొంచెం ఆలస్యమైనా మంచి చిత్రంలో నటించే అవకాశాన్ని ఈ చిన్నది కొట్టేసిందన్న మాట. -
రోషన్ లీడ్ రోల్లో వృషభ షురూ
మోహన్ లాల్ ప్రధాన పాత్రలో, రోషన్ లీడ్ రోల్లో నటిస్తున్న ద్విభాషా చిత్రం (తెలుగు, మలయాళం) ‘వృషభ’. నందకిశోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, రాగిణి ద్వివేది, జహ్రా ఎస్ ఖాన్ , షానయ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ వ్యాస్, ఏక్తా కపూర్, విశాల్గుర్నాని, జుహీ పరేహ్ మెహతా, శ్యామ్ సుందర్, శోభాకపూర్, వరుణ్ మాథుర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటి ఊహ క్లాప్ కొట్టారు. మోహన్ లాల్, రోషన్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట నందకిశోర్. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. తెలుగు, మలయాళంతో పాటు తమిళం, కన్నడం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. -
మిస్టీరియస్ డ్రామా
అభిలాష్, రమ్య,ప్రాచీ ఠాకూర్, శివకోన, ప్రభాకర్, నేహా దేశ్΄పాండే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాజుగారి కోడిపులావ్’. కుటుంబ కథా ‘వి’ చిత్రం అనేది ట్యాగ్‌లైన్ . శివ కోన దర్శకత్వంలో అనిల్ మోదుగ, శివకోన నిర్మించిన ఈ సినిమాను ఆగస్టు 4న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రయూనిట్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అభిలాష్ మాట్లాడుతూ– ‘‘రాజుగారి కోడిపులావ్’ రోటీన్ సినిమా కాదు.. కొత్తగా మిస్టీరియస్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు శివ. నటీనటులు కునాల్, నేహాదేశ్ పాండే, రమ్య,ప్రాచీ ఠాకూర్ మాట్లాడారు. -
ఆ మేకప్ ఓ పెద్ద సవాల్
‘‘షూటింగ్ చేసిన ప్రతి రోజూ కాస్ట్యూమ్స్ ధరించడానికి, మేకప్ వేసుకోవడానికి నాలుగైదు గంటలు పట్టే క్యారెక్టర్ చేయడం చిన్న విషయం కాదు. మేకప్ పూర్తయ్యేంతవరకూ కదలకుండా కూర్చోవడం అనేది పెద్ద చాలెంజ్’’ అన్నారు మాళవికా మోహనన్. విక్రమ్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘తంగలాన్’లో మాళవికా మోహనన్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో పీరియాడికల్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. మాళవికా మోహనన్ కూడా అదే తెగకు చెందిన యువతిగా నటిస్తున్నారని సమాచారం. ఈ పాత్రకు సంబంధించిన మేకప్‌కి నాలుగైదు గంటలు పడుతోంది. ‘‘ఇలాంటి పాత్రలు చేసే అవకాశం అరుదుగా వస్తుంది కాబట్టి ఇష్టంగా చేస్తున్నాను’’ అన్నారు మాళవికా మోహనన్. -
కథకు కీ ఇస్తారు!
ఓ కీ ఇచ్చి కథను కీలక మలుపు తిప్పే కీలక పాత్రలు ఉంటాయి. అలాంటి ‘కీ’ రోల్స్ నిడివి తక్కువైనా గుర్తింపు ఎక్కువ ఉంటుంది కాబట్టి హీరో.. హీరోయిన్లు అప్పుడప్పుడూ ‘కీ’ రోల్స్ ఒప్పుకుంటుంటారు. ఇప్పుడు కథకు ‘కీ’ ఇచ్చే పాత్రలు చేస్తున్న కొందరు కథానాయికలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. సిస్టర్ ఆఫ్ శంకర్ కమర్షియల్ మూవీస్‌లో హీరోయిన్గా, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో లీడ్ రోల్ చేయడం మాత్రమే కాదు... వీలైనప్పుడుల్లా అతిథిగా, కీలక పాత్రధారిగా కూడా నటిస్తుంటారు హీరోయిన్ కీర్తీ సురేష్. ‘సీమరాజా’, ‘మన్మథుడు 2’, ‘జాతిరత్నాలు’ వంటి సినిమాల్లో గెస్ట్ రోల్ చేశారు కీర్తి. ఇక మోహన్‌లాల్ ‘మరక్కార్: అరభికడలింటే సింహమ్’, రజనీకాంత్ ‘అన్నాత్తే’(తెలుగులో ‘పెద్దన్న’) చిత్రాల్లో కీర్తీ సురేష్ కథలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ‘భోళా శంకర్’ చిత్రంలో కీ రోల్ చేస్తున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా, చిరంజీవి చెల్లెలుగా కీర్తీ సురేష్ నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. తొలి అడుగు ప్రత్యేక పాత్రల పరంగా తొలి అడుగు వేశారు హీరోయిన్ శ్రుతీహాసన్. నాని హీరోగా శౌర్యవ్ దర్శకుడిగా పరిచయం అవుతూ ‘హాయ్ నాన్న’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కథలో కీలకమైన ఓ ప్రత్యేక పాత్రలో హీరోయిన్ శ్రుతీహాసన్ నటిస్తున్నారు. ఆమె ప్రత్యేక పాత్రలో నటించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూనూర్‌లో జరుగుతోంది. చెరుకూరి మోహన్, విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 21న విడుదల కానుంది. డాటర్ ఆఫ్ భగవత్ అరడజనుకుపైగా సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ, టాలీవుడ్లో మోస్ట్ బిజీ హీరోయిన్గా ఉంటున్న శ్రీలీల ‘భగవత్ కేసరి’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో కీలక పాత్ర చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, బాలకృష్ణ హీరోగా టైటిల్ రోల్ చేస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబరులో రిలీజ్ కానుంది. ఇక శ్రీలీల ఓ కథానాయికగా నటిస్తున్న చిత్రాల్లో ‘గుంటూరు కారం’ ఒకటి. ఇందులో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్. కేరాఫ్ జైలర్ టాలీవుడ్లో ‘క్రేజీ ఫెలో’, ‘ఉగ్రం’ సినిమాల్లో నటించి హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మిర్నా మీనన్. ఈ బ్యూటీ ఇప్పుడు ‘జైలర్’ సినిమాలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుండగా, రమ్యకృష్ణ, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ కుమార్తెగా మిర్నా మీనన్ కనిపిస్తారట. ఈ షూటింగ్లో మిర్నా దాదాపు 40 రోజులు పాల్గొన్నారు. కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 10న విడుదల కానుంది. వెల్కమ్ టు టాలీవుడ్ వజ్రకాళేశ్వరి దేవిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు హీరోయిన్ అపర్ణా దాస్. మల యాళంలో ‘మనోహరం’, తమిళంలో ‘బీస్ట్’ వంటి చిత్రాల్లో నటించిన అపర్ణా దాస్‌కు తెలుగులో తొలి చిత్రం ‘ఆదికేశవ’. వైష్ణవ్‌తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. ఇందులో కీలకమైన వజ్రకాళేశ్వరి దేవి పాత్రను అపర్ణా దాస్ పోషిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం జూలైలో విడుదల కానుంది. వీరే కాదు... కమల్‌హాసన్ ‘ఇండియన్ 2’లో రకుల్‌ప్రీత్ సింగ్, ప్రభాస్ ‘ఆదిపురుష్’లో సోనాల్ చౌహాన్, ‘ప్రాజెక్ట్ కె’లో దిశా పటానీ, రాఘవా లారెన్స్ ‘చంద్రముఖి 2’లో కంగనా రనౌత్.. ఇలా మరికొందరు హీరోయిన్లు ఆయా చిత్రాల కథలకు ‘కీ’గా నిలుస్తున్నారు. -
ఈ వార్త నిజమైతే.. ఫ్యాన్స్‌కు పండగే!
‘మగధీర, బ్రూస్లీ’ చిత్రాల్లో చిరంజీవి, రామ్‌చరణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే మెగాఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ రెండు చిత్రాల్లో రామ్‌చరణే హీరోగా నటించగా, చిరంజీవి గెస్ట్ రోల్ చేశారు. అలాగే చిరంజీవి నటించిన ‘ఖైదీ నం. 150’లో ఓ పాటలో కనిపించారు చరణ్. ఇప్పుడు ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తుండగా రామ్‌చరణ్ పూర్తి స్థాయి నిడివి ఉన్న లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది మే 13న విడుదల కానుంది. అయితే ఫిల్మ్‌నగర్ లేటెస్ట్ టాక్ ఏంటంటే... రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఓ ప్యాన్ ఇండియన్ మూవీని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి ఓ లీడ్ క్యారెక్టర్ చేయనున్నారనే ప్రచారం వినిపిస్తోంది. ఈ వార్త నిజమైతే మెగాఫ్యాన్స్కు పండగే. మరి.. మరోసారి చిరంజీవి, రామ్‌చరణ్ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? అనేది చూడాలి. ఈ సంగతి ఇలా ఉంచితే... శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాలని ఉందని చిరంజీవి ఓ సందర్భంలో చెప్పారు. కానీ ఇప్పటివరకు కుదర్లేదు. మరి... ఆ తరుణం వచ్చిందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
పుకార్లను పట్టించుకోవడం మానేశా
‘‘ఎంబీఏ పూర్తి చేశాక ఉద్యోగం చేస్తున్న టైమ్‌లో పెళ్లి కుదిరింది. అప్పుడు ఉద్యోగం నుంచి బ్రేక్ తీసుకున్నప్పుడు ఓ యాడ్ చేశా. ఆ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ చేస్తున్నప్పుడు సినిమాల్లో నటించమని అవకాశాలొచ్చాయి. కానీ, మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. పెళ్లి తర్వాత నా భర్త భరద్వాజ్ సపోర్ట్‌గా ఉండటం వల్లే ఈ స్థాయిలో ఉన్నా’’ అన్నారు అనసూయ. ‘క్షణం, రంగస్థలం’ వంటి హిట్ చిత్రాల్లో కీలక పాత్రలు చేసిన అనసూయ లీడ్ రోల్ చేసిన చిత్రం ‘కథనం’. రాజేష్ నాదెండ్లను దర్శ కత్వంలో బి.నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనసూయ పంచుకున్న విశేషాలు. ► నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లవుతోంది. హీరోయిన్ కావాలనుకోలేదు. నాకు లీడ్ రోల్ చేసే అవకాశం వస్తుందని ఊహించలేదు. లీడ్ రోల్ అన్నది ఓ బాధ్యత కూడా. ‘రంగస్థలం’ సినిమాలో డైరెక్టర్ సుకుమార్‌గారు చెప్పింది చేశా. ‘కథనం’ సినిమాలోనూ అంతే. దర్శకుడు చెప్పింది చేశా. ► ‘రంగస్థలం– కథనం’ సినిమాలకి మధ్యలో దాదాపు 13 కథలు విన్నా. కొన్ని కథలు నచ్చకపోవడం ఓ కారణం.. కొత్త ప్రొడక్షన్ కంపెనీలు కావడంతో సినిమాని విడుదల చేస్తారో? లేదో? అనే మరో కారణంతోనూ చేయలేదు. ఓ సినిమా కోసం ఎంతో కష్టపడతాం. చేసిన పనికి గుర్తింపు రాకపోతే నేను ఒత్తిడికి లోనవుతా. ► రాజేష్‌కి ‘కథనం’ తొలి సినిమా అయినా చక్కగా తీశాడు. నా కోసమే ఈ కథ రాశాడేమో అనిపిస్తోంది. ఈ చిత్రంలో అను అనే అసిస్టెంట్ డైరెక్టర్ పాత్ర నాది. డైరెక్టర్ కావాలని కథలతో నిర్మాతలను కలుస్తూ ఇబ్బందులు పడుతుంటా. నేను రాసుకున్న ఓ కథ ప్రకారమే రెండు హత్యలు జరుగుతాయి. వాటిపై జరిగే విచారణ ఆసక్తిగా ఉంటుంది. ► నటిగా ఉండటం అదృష్టం.. దౌర్భాగ్యం కూడా. సోషల్ మీడియాలో నా గురించి రకరకాల పుకార్లు వస్తుంటాయి. వీటి గురించి మా ఇంట్లో వాళ్లు అస్సలు బాధపడరు.. మొదట్లో నేనే బాధపడేదాన్ని. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశాను. నాకు ‘బిగ్‌బాస్’లో అవకాశం వచ్చింది. కానీ, నా కుటుంబానికి నేను బానిస అయిపోయా. వారిని వదిలి అన్ని రోజులు ఉండలేననే చేయలేదు. ► ∙‘క్షణం’ నటిగా ధైర్యం ఇచ్చింది. ‘రంగస్థలం’ని కన్నడ, తమిళ్, మళయాళంలో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఆ చిత్రం రిలీజ్ తర్వాత ఆ భాషల నుంచి అవకాశాలు వచ్చాయి కానీ చేయలేదు. ప్రస్తుతం ఓ సినిమాలో సెకండ్ లీడ్ రోల్ చేస్తున్నా. మరో సినిమాలోనూ నటిస్తున్నాను. -
మహాభారతాన్ని నిర్మించబోతున్న దుబాయ్ బిలియనీర్
కొచీ: ప్రతిష్టాత్మక వెయ్యికోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న మహాభారత్ చిత్రానికి నిర్మాత ఖరారయ్యాడు. యూఏఈకి చెందిన భారత వ్యాపారవేత్త బీఆర్ శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారతదేశంలోనే అతిపెద్ద మోషన్ ప్రాజెక్టుగా భావిస్తున్న ఈ ప్రాజెక్టులో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ముందుకొచ్చారు. మరోవైపు ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ కీలక పాత్రపోషించనున్నారు. ప్రముఖ యాడ్ ఫిలిం రూపకర్త వి.ఎ. శ్రీకుమార్ మేనన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ ఎంటీ ప్రాజెక్ట్ ఈ మూవీని రూపొందించనుంది. ఈ చిత్రంలో కీలకమైన భీముడి పాత్రలో సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ మోహన్ లాల్ కనిపించనున్నారు. ఈ విషయాన్ని తన ఫేస్బుక్ ఖాతాలో అధికారికంగా ప్రకటించారు. దీంతోపాటు ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో భీమ పాత్రకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని మోహన్ లాల్ తెలిపారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్య వాదాలు తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్, ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళిల డ్రీమ్ సినిమా మహాభారత్ మూవీని, ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎం.టి వాసుదేవన్ నాయర్ రాసిన ‘రాందమూళం’ నవల ఆధారంగా ఈ సినిమాను 150 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 2018న మొదలుపెట్టి 2020కి రిలీజ్ చేయనున్నారు. అలాగే మొదటి భాగం విడుదలైన 90 రోజుల్లోనే రెండవ భాగాన్ని విడుదల చేయనున్నారని సమాచారం. అంతే కాకుండా ఈ సినిమా కోసం నటీనటులను టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎంపికచేయనుండగా, వారిని ఒక అంతర్జాతీయ దర్శకుడు ఎంపిక చేయనుండడం విశేషం. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రపంచ సినిమా లో గొప్ప పేర్లు ఉత్తమ ప్రతిభగల, సాంకేతిక సిబ్బంది, ఇతర అకాడమీ అవార్డు విజేతలు సహా పాపులర్ నటులతో రూపొందనున్న ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, మలయాళం, కన్నడ, తెలుగు, తమిళంతోపాటు ఇతర విదేశీ భాషల్లోకి డబ్బింగ్ చేయనున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.