నవ్వించడంతో పాటు థ్రిల్‌ చేస్తానంటున్న రకుల్‌ | Rakul Preet Singh and Neena Gupta join forces for a comedy-thriller Next | Sakshi
Sakshi News home page

నవ్వించడంతో పాటు థ్రిల్‌ చేస్తానంటున్న రకుల్‌

Published Fri, Sep 29 2023 12:54 AM | Last Updated on Fri, Sep 29 2023 6:48 AM

Rakul Preet Singh and Neena Gupta join forces for a comedy-thriller Next - Sakshi

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నవ్వించడానికి, థ్రిల్‌ చేయడానికి రెడీ అయ్యారు. ఆమెతో పాటు నీనా గుప్తా కూడా చేతులు కలిపారు. ఈ ఇద్దరూ కలిసి చేసే కామెడీ, థ్రిల్‌ని వచ్చే ఏడాది వెండితెరపై చూడొచ్చు. రకుల్, నీనా గుప్తా లీడ్‌ రోల్స్‌లో ఓ చిత్రం రూపొందనుంది. కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు ఆశిష్‌ ఆర్‌. శుక్లా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని సునీల్‌ కేతర్‌పాల్‌ నిర్మించనున్నారు.

రకుల్‌ ఓ లీడ్‌ రోల్‌లో నటించిన ‘ఐ లవ్‌ యు’కి కూడా కేతర్‌పాల్‌నే నిర్మాత. ఈ ఏడాది జూన్‌లో ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. అయితే తాజా చిత్రాన్ని మాత్రం థియేటర్స్‌లోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ని అక్టోబర్‌లో ఆరంభించి, డిసెంబర్‌కల్లా పూర్తి చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రం విడుదలయ్యే చాన్స్‌ ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement