ఆ మేకప్‌ ఓ పెద్ద సవాల్‌ | Malavika Mohanan spends 4-5 hours on her make-up for her role in Thangalaan | Sakshi
Sakshi News home page

ఆ మేకప్‌ ఓ పెద్ద సవాల్‌

Published Fri, Jun 23 2023 12:47 AM | Last Updated on Fri, Jun 23 2023 12:47 AM

Malavika Mohanan spends 4-5 hours on her make-up for her role in Thangalaan - Sakshi

‘‘షూటింగ్‌ చేసిన ప్రతి రోజూ కాస్ట్యూమ్స్‌ ధరించడానికి, మేకప్‌ వేసుకోవడానికి నాలుగైదు గంటలు పట్టే క్యారెక్టర్‌ చేయడం చిన్న విషయం కాదు. మేకప్‌ పూర్తయ్యేంతవరకూ కదలకుండా కూర్చోవడం అనేది పెద్ద చాలెంజ్‌’’ అన్నారు మాళవికా మోహనన్‌. విక్రమ్‌ హీరోగా పా. రంజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘తంగలాన్‌’లో మాళవికా మోహనన్‌ ఓ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు.

కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్‌ నేపథ్యంలో పీరియాడికల్‌ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్‌ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. మాళవికా మోహనన్‌ కూడా అదే తెగకు చెందిన యువతిగా నటిస్తున్నారని సమాచారం. ఈ పాత్రకు
సంబంధించిన మేకప్‌కి నాలుగైదు గంటలు పడుతోంది. ‘‘ఇలాంటి పాత్రలు చేసే అవకాశం అరుదుగా వస్తుంది కాబట్టి ఇష్టంగా చేస్తున్నాను’’ అన్నారు మాళవికా మోహనన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement