– విక్రమ్
‘‘తంగలాన్ ’ తమిళ సినిమానో, తెలుగు సినిమానో కాదు. ఓ మంచి సినిమా. నా మనసుకు దగ్గరైన సినిమా. ‘తంగలాన్ ’ చూసి ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతారు. ఈ సినిమాలో ఎమోషన్స్, అడ్వెంచర్స్, మెసేజ్.. ఇలా చాలా అంశాలు ఉన్నాయి’’ అని విక్రమ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘తంగలాన్ ’. పార్వతీ తిరువోతు, మాళవికా మోహనన్ హీరోయిన్స్.
పా. రంజిత్ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘తంగలాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విక్రమ్ మాట్లాడుతూ–‘‘వందేళ్ల క్రితం జరిగిన కథ ‘తంగలాన్’. ‘మద్రాస్’ సినిమా నుంచి పా.రంజిత్‌తో వర్క్ చేయాలనుకుంటే ‘తంగలాన్ ’తో కుదిరింది. నాకు మంచి రోల్ ఇచ్చిన రంజిత్‌కు థ్యాంక్స్. జ్ఞానవేల్ రాజాగారు బాగా స΄ోర్ట్ చేశారు.
నేను గతంలో నటించిన పాత్రల్ని (శివపుత్రుడు, నాన్న, సేతు, అపరిచితుడు, ఐ..) ఈ వేదికపై చూడగానే భావోద్వేగంగా అనిపించింది. ఇలాంటి విభన్నమైన పాత్రలు ఇంకా చేయాలనే స్ఫూర్తి కలిగింది’’ అన్నారు. పా. రంజిత్ మాట్లాడుతూ–‘‘తంగలాన్ ’ రెగ్యులర్ మూవీ కాదు. దేశ స్వాతంత్య్రానికి పూర్వం ఉంటుంది. విక్రమ్‌గారు అద్భుతంగా నటించారు. ఆయన దొరకడం నా అదృష్టం. ‘తంగలాన్ ’ ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
‘‘తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే ్రపాణం. ‘తంగలాన్ ’ని స΄ోర్ట్ చేయండి. ఆగస్టు 15న విడుదలవుతున్న ‘మిస్టర్ బచ్చన్ ’, ‘డబుల్ ఇస్మార్ట్’, ‘ఆయ్’ వంటి సినిమాలూ విజయాలు సాధించాలి’’ అన్నారు నిర్మాత జ్ఞానవేల్ రాజా. ‘‘ఈ చిత్రంలో ‘గంగమ్మ’ పాత్రలో నటించాను. విక్రమ్‌లాంటి కో స్టార్‌ని నేను ఇప్పటి వరకూ చూడలేదు’’ అన్నారు పార్వతి తిరువోతు.
‘‘విక్రమ్‌గారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకున్న నా కల ‘తంగలాన్ ’తో నిజమైంది’’ అన్నారు మాళవికా మోహనన్ . ‘‘ఇదొక అద్భుతమైన మూవీ’’ అన్నారు నటుడు డేనియల్. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, స్టూడియోగ్రీన్ ఎగ్జిక్యూటివ్ సీఈవో ధనుంజయన్ , నిర్మాతలు ‘మధుర’ శ్రీధర్, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, ఎస్‌కేఎన్ , దర్శక–నిర్మాత సాయిరాజేష్, దర్శకుడు కరుణకుమార్, మైత్రీ మూవీస్ శశి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment