'బుట్టబొమ్మ' బ్యూటీకి సూపర్‌ ఛాన్స్.. పాన్ ఇండియా హీరోతో | Anikha Surendran onboard to play a pivotal role in Dhanush D50 Movie | Sakshi
Sakshi News home page

Anikha Surendran: బంపర్ ఆఫర్.. పాన్ ఇండియా హీరో సినిమాలో ఛాన్స్

Published Wed, Aug 2 2023 5:39 AM | Last Updated on Wed, Aug 2 2023 9:47 AM

Anikha Surendran onboard to play a pivotal role in Dhanush D50 Movie - Sakshi

అజిత్‌ హీరోగా నటించిన ‘ఎంతవాడు కానీ’, ‘విశ్వాసం’ వంటి సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది అనికా సురేంద్రన్‌. ఆ తర్వాత కథానాయకిగా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టింది. అందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా మార్చుకుంది. అలా శృతిమించిన అందాలను ఆరబోస్తూ ప్రత్యేకంగా తీర్చుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి సినీ పెద్దల దృష్టిలో పడే ప్రయత్నం చేసింది. అలా తెలుగులో వచ్చిన నాగార్జున ‘ది ఘోస్ట్‌’, ‘బుట్టబొమ్మ’ వంటి చిత్రాల్లో ఓ లీడ్‌ యాక్ట్రస్‌గా నటించింది.

తెలుగులోనే కాకుండా మలయాళంలోనూ కథానాయికగా నటించడం మొదలెట్టింది. అయితే తెలుగులో ఆ అమ్మడు నటించిన బుట్ట బొమ్మ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో మళ్లీ ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఎట్టకేలకు తమిళంలో ఒక అవకాశాన్ని అందుకుంది. నటుడు ధనుష్‌ తన 50వ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఇందులో నటుడు ఎస్‌జే సూర్య, సందీప్‌ కిషన్‌, కాళిదాసు, జయరాం నటి దసరా విజయం అపర్ణ బాలమురళి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రం కోసం చైన్నె, ఈసీఆర్‌ రోడ్‌ లో 500 ఇళ్లతో భారీసెట్‌ ను వేస్తున్నారు. జైలర్‌ చిత్రం విడుదల తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను వెల్లడించే అవకాశం ఉంది. ఈ భారీ చిత్రంలో నటి అనికా సురేంద్రన్‌ ముఖ్య పాత్రలో నటించనున్నట్లు తాజా సమాచారం. మొత్తం మీద కొంచెం ఆలస్యమైనా మంచి చిత్రంలో నటించే అవకాశాన్ని ఈ చిన్నది కొట్టేసిందన్న మాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement