సినీ అభిమానులు ఇప్పుడు చిన్న తెరలకు అతుక్కుపోతున్నారు. ఆ సంఖ్య వేలల్లో కాదు, లక్షల్లో ఉంది. దీంతో వెబ్ సిరీస్‌లకు డిమాండ్ పెరగడంతో వాటి నిర్మాణాలు జోరందుకున్నాయి. తాజాగా ‘వర్కవుట్ అయ్యింది’ పేరుతో ఓ వెబ్ సిరీస్ ప్రారంభమైంది. మా ఆయి పతాకంపై బి.శివకుమార్ దర్శకత్వంలో రూపేష్ కుమార్ చౌదరి ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సిరీస్ షూటింగ్ లాంచనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని పలు లొకేషన్స్‌లో ఈ సిరీస్ షూటింగ్ జరపనున్నారు. రూపేష్‌కుమార్ చౌదరి, మీనాకుమారి, శశిధర్, సూర్య, ఫన్ బకెట్ ఫణి, ఫన్ బకెట్ భార్గవి, ఇషాని, ఫణీంద్ర, మోడబుల్ గై, రాహుల్ కొసరాజు నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో ప్రముఖ డాన్స్‌మాస్టర్ అనీ లామా కీలక పాత్రలో నటిస్తున్నారు.
Published Mon, Dec 17 2018 8:53 PM | Last Updated on Mon, Dec 17 2018 8:55 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment