'ముగ్గురు హీరోయిన్లతో సినిమా'.. ఘనంగా షూటింగ్ ప్రారంభం! | Tollywood New Movie Shoot Starts In Ramana Naidu Studio at Hyderabad | Sakshi
Sakshi News home page

లవ్ స్టోరీతో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది: డైరెక్టర్

Published Sun, Aug 25 2024 9:25 PM | Last Updated on Sun, Aug 25 2024 9:25 PM

Tollywood New Movie Shoot Starts In Ramana Naidu Studio at Hyderabad

శ్యామ్ షెల్వన్, హాన్విక, రితిక, గ్రీష్మ, ఎస్తేర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం "ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ". ఈ సినిమాకు కిరణ్  దర్శకత్వం వహిస్తున్నారు. ఎంఎంఆర్ ఆర్ట్ క్రియేషన్స్ ప్రొడక్షన్  పతాకంపై  మంద మల్లికార్జున రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా  హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది.

ఈ సందర్భంగా డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ.."కొత్త వాడినైనా మా నిర్మాత మల్లికార్జున్ రెడ్డి ఈ కథను నమ్మి ముందుకొచ్చారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇందులో లవ్ స్టోరీతో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది . ఈ చిత్రం యూత్, కుటుంబ సమేతంగా చూసే విధంగా తెరకెక్కించబో తున్నాం'.అని అన్నారు.

నిర్మాత మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ.. 'ఈ చిత్రం కథ విన్న వెంటనే చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఈ చిత్రం కచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. సెప్టెంబర్ ఫస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో  ప్రారంభించనున్నాం' అని తెలిపారు. ఈ సినిమాకు గాజుల శివ సినిమాటోగ్రఫీ, చరణ్ అర్జున్ సంగీతమందిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement