చివరి పేజీ షురూ | Nikhil resumes shooting for 18 Pages Shooting | Sakshi
Sakshi News home page

చివరి పేజీ షురూ

Published Thu, Oct 27 2022 6:18 AM | Last Updated on Thu, Oct 27 2022 6:18 AM

Nikhil resumes shooting for 18 Pages Shooting - Sakshi

 నిఖిల్‌ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘18 పేజెస్‌’. డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి జీఏ2 పిక్చర్స్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ ‘18 పేజెస్‌’ చివరి పేజీ (షెడ్యూల్‌) ప్రారంభమైంది.

‘‘కార్తికేయ 2’ విడుదల, ప్రమోషన్స్, సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ కోసం కొంచెం విరామం తీసుకున్న తర్వాత నిఖిల్‌ తాజాగా ‘18 పేజెస్‌’ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు. ఈ సినిమా చివరి షెడ్యూల్‌  ప్రారంభమైంది. డిసెంబర్‌ 23న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: వసంత్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: శరణ్‌ రాపర్తి (గీతా ఆర్ట్స్‌), అశోక్‌ బండ్రెడ్డి, లైన్‌ ప్రొడ్యూసర్‌: బాబు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement