Jr NTR Voice For Title Glimpse Of Sai Dharam Tej SDT15 - Sakshi
Sakshi News home page

Jr NTR F0r SDT15 : సాయి తేజ్‌కు ఎన్టీఆర్‌ సాయం.. అప్‌డేట్‌ వదిలిన మేకర్స్‌

Published Mon, Dec 5 2022 4:52 PM | Last Updated on Mon, Dec 5 2022 6:05 PM

Jr NTR Voice For Title Glimpse Of Sai Dharam Tej SDT15 - Sakshi

సాయి ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం కార్తీక్‌ దండు డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. SDT 15 వర్కింగ్ టైటిల్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుకుమార్‌ కథ అందిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.

డిసెంబర్‌7న ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు రెడీ అయ్యింది మూవీ యూనిట్‌. అయితే తాజాగా ఈ టైటిల్‌ గ్లింప్స్‌కు జూ.ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ అందిస్తుండటం విశేషం. ఈ మేరకు మేకర్స్‌ అప్‌డేట్‌ను వదిలారు. దీంతో ఆ ప్రాజెక్ట్‌పై క్యూరియాసిటీ మొదలైంది.  మిస్టిక్ థ్రిల్లర్ కథాంశంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement