సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ దాదాపు 16 నెలల పాటు ఇంటికి పరిమితమయ్యారు. ఇక చాలా గ్యాప్ తర్వాత తేజ్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీంతో ఈ చిత్రంపపై మెగా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. SDT 15 అనే వర్కింగ్ టైటిల్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుకుమార్ కథ అందిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ టైటిల్ గ్లింప్స్ వదిలారు మేకర్స్. ఈ చిత్రానికి విరుపాక్ష అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఫస్ట్ టైటిల్ గ్లింప్స్‌తో విడుదల చేసిన ఈ టీజర్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ అందించారు.ఎన్టీఆర్ వాయిస్‌తో రిలీజ్ అయిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. “అజ్ఞానం భయానికి మూలం. భయం మూఢ నమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనప్పుడు, ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ టీజర్‌కి హైలైట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా మూవీ టైటిట్‌తో పాటు, రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించింది చిత్ర బృందం. సోషియో ఫాంటసీ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 21న విడుదల చేస్తున్నట్లు టైటిల్ పోస్టర్‌లో పేర్కొన్నారు.
చదవండి:
అభిమానిగానే చిరంజీవికి ఆనాడు విజ్ఞప్తి చేశా: వర్మ క్లారిటీ
బిగ్‌బాస్ బ్యూటీ కాళ్లు పట్టుకున్న ఆర్జీవీ!
Comments
Please login to add a commentAdd a comment