నీకు పులి దొరికిందని చరణ్‌ అన్నాడు! | Manoj's Gunturodu on March 3 | Sakshi
Sakshi News home page

నీకు పులి దొరికిందని చరణ్‌ అన్నాడు!

Published Mon, Feb 27 2017 12:15 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

నీకు పులి దొరికిందని చరణ్‌ అన్నాడు! - Sakshi

నీకు పులి దొరికిందని చరణ్‌ అన్నాడు!

పెళ్లి తర్వాత నా లైఫ్‌లో పెద్దగా మార్పులు ఏం లేవు. ఇప్పుడు టైమ్‌కి ఇంటికి వెళ్తున్నాను. పెళ్లి విషయంలో నేను లక్కీ. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకున్నా.

‘నేను ఆర్టిస్ట్‌ని. నాకు డబ్బు సేవ్‌ చేయడం రాదు. రేపు పరిస్థితి తేడా వస్తే.. చేయి చాచి ఒకర్ని డబ్బులు అడగను. చిన్న అపార్ట్‌మెంట్, గుడిసెకు వెళ్లాలంటే రెడీనా?’ అని పెళ్లికి ముందు ప్రణతిని అడిగా. ‘నీతో ఎక్కడికైనా వస్తా’ అని చెప్పింది. ప్రణతి మూవీ లవర్‌. ఓ ఫ్రెండ్‌లా సలహాలు ఇస్తుంది.

‘‘చిన్నప్పట్నుంచీ డాడీ సక్సెస్‌లు, ఫెయిల్యూర్‌లు చూస్తూ, పెరిగా. ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. అప్పుడు మేమంతా నాన్నగారి వెనకాలే ఉన్నాం.హిట్‌ వచ్చినప్పుడు మా ఇంటి ముందు ఎన్ని కార్లున్నాయి? ఫ్లాప్‌ టైమ్‌లో ఎన్ని ఆగాయనేది తెలుసు. ఆ వాతావరణంలో పెరిగినోళ్లపై జయాపజయాల ప్రభావం ఏముంటుంది?’’ అన్నారు మంచు మనోజ్‌. ఆయన హీరోగా ఎస్‌.కె. సత్య దర్శకత్వంలో శ్రీవరుణ్‌ అట్లూరి నిర్మించిన ‘గుంటూరోడు’ మార్చి 3న విడుదలవుతోంది. మనోజ్‌ చెప్పిన ముచ్చట్లు...

► ‘గుంటూరోడు’ పక్కా హీరోయిజమ్‌ ఉన్న సినిమా. హీరోకి ఆనందం వచ్చినా, కోపం వచ్చినా తట్టుకోలేడు. కళ్ల ముందు అన్యాయం జరిగితే వాడి చేతికి దురద వస్తుంది. సింపుల్‌ కథకు మాంచి యాక్షన్‌ జోడించి సత్య అద్భుతంగా తీశాడు. వెంకట్‌ సూపర్‌ ఫైట్స్‌ కంపోజ్‌ చేశాడు.

► వాయిస్‌ ఓవర్‌ ఇవ్వమని ముందు రామ్‌ చరణ్‌ని అడిగా. తనప్పుడు వేరే ఊరిలో ఉన్నాడు. హైదరాబాద్‌ రావడానికి పది రోజులు పడుతుందన్నాడు. తర్వాతి రోజు చిరంజీవి అంకుల్‌ వాళ్లింటికి నాన్నగారు బ్రేక్‌ ఫాస్ట్‌కి వెళుతుంటే నేనూ వెళ్లాను. ‘అంకుల్‌.. నేనో మాస్‌ కమర్షియల్‌ సినిమా చేశా. మీరు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వాల’ని అడగ్గానే ఓకే చెప్పారు. నెక్స్‌›్టడే కాల్‌ చేసి ‘మను... డబ్బింగ్‌ చెప్పేశా. ఓసారి చూసుకో. కరెక్షన్స్‌ ఉంటే మళ్లీ చెబుతా’ అన్నారు. ఆయన చెప్తే కరెక్షన్స్‌ ఏముంటాయి! ‘చిన్న బిడ్డ కోసం వచ్చావు. నీకు పులి దొరికింది’ అని రామ్‌చరణ్‌ అన్నాడు.

► సినిమా హిట్టూ ఫ్లాపులకు ఈరోజుల్లో కారణాలెన్నో ఉంటాయి. ఉదాహరణకు... పెద్ద సినిమాలు వస్తే థియేటర్లు బ్లాక్‌ చేసి, మా థియేటర్లలో మా సినిమాలు వేసుకుంటామంటారు. బాగున్న చిన్న సినిమాకు ఇవ్వమన్నా ఇవ్వరు. పండగలు, మంచి సీజన్లు పెద్దోళ్లు తీసుకుని, ఎగ్జామ్స్‌ టైమ్‌ను చిన్న సినిమాలకు ఇస్తున్నారు. సరైన విడుదల తేదీ దొరక్క కొన్ని చిన్న సినిమాలు ఆడడం లేదు. ‘గుంటూరోడు’ను ఈ నెల 24న రిలీజ్‌ చేయాలనుకున్నాం. కానీ, సరిపడా సంఖ్యలో థియేటర్లు దొరకలేదు. సినిమా కూడా రెడీ కాలేదు. మార్చి 3న పోటీ ఉన్నప్పటికీ మేలో నా ‘ఒక్కడు మిగిలాడు’ విడుదలకు సిద్ధమవుతోంది. అందుకే, మార్చి 3న రిలీజ్‌ చేస్తున్నాం.

► నటి భావన ఘటన తర్వాత ఆడవాళ్లకు జరుగుతోన్న అన్యాయాలపై ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. చిన్నారులపై అఘాయిత్యాలు అనే వార్తలు చూస్తుంటే కత్తితో కోయాలనిపిస్తుంది. అమ్మాయిలంటే మా ఫ్యామిలీకెంతో ప్రేమ. అందుకే, దేవుడు మాకు ఎక్కువ ఆడపిల్లల్ని ఇచ్చాడనుకుంటున్నా.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement