![Pawan Kalyan lending his voice to Sye Raa Narasimha Reddy - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/19/Pawan_Chiru.jpg.webp?itok=mp3ccUnv)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్‌కు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్రయూనిట్ తాజాగా విడుదల చేసింది. ఇంతకుముందే ఫొటోలు రిలీజ్ చేసింది. ‘సైరా నరసింహారెడ్డి’ అంటూ పవన్ ఆవేశంగా నినదించడం వీడియోలో ఉంది. హీరో చిరంజీవి, దర్శకుడు సురేందర్ రెడ్డి దగ్గరుండి పవన్‌తో డబ్బింగ్ చెప్పించడం వీడియో దృశ్యాల్లో కనబడుతోంది. రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదలకానుంది. టీజర్‌కు వాయిస్ ఓవర్ అందించిన తన బాబాయ్ పవన్ కల్యాణ్‌కు రామ్ చరణ్ ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు.
చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కన్నడ స్టార్ సుధీర్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి, జగపతిబాబు, తమన్నా, రవికిషన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడ అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment