రానా కోసం అమితాబ్, ఎన్టీఆర్ | NTR voice over for Rana Ghazi | Sakshi
Sakshi News home page

రానా కోసం అమితాబ్, ఎన్టీఆర్

Published Sun, Jan 8 2017 11:54 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

రానా కోసం అమితాబ్, ఎన్టీఆర్ - Sakshi

రానా కోసం అమితాబ్, ఎన్టీఆర్

టాలీవుడ్తో పాటు బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రానా. హీరో, విలన్, సపోర్టింగ్ రోల్ ఇలా అన్ని రకాల పాత్రలతో అలరిస్తున్న ఈ మ్యాన్లీ స్టార్ నటిస్తున్న బహు భాషా చిత్రం ఘాజీ. భారత్ పాక్ యుద్ధ సమయంలో మునిగిపోయిన ఓ సబ్ మెరైన్ కథతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో రిలీజ్కు రెడీ అవుతోంది. పీవీపీ సినిమాస్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మూవీతో సంకల్ప్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు అదనపు ఆకర్షణలు జోడించే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారట. అదే వాయిస్ను తెలుగు వర్షన్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందించేందుకు అంగీకరించాడు. త్వరలోనే ఈ వాయిస్ ఓవర్లతో కూడిన ట్రైలర్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement