గుంటూరోడుకి చిరు సాయం | Chiranjeevi voice over to Manoj's Gunturodu and Rana's Ghazi Attack | Sakshi
Sakshi News home page

గుంటూరోడుకి చిరు సాయం

Published Mon, Feb 20 2017 10:58 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

గుంటూరోడుకి చిరు సాయం - Sakshi

గుంటూరోడుకి చిరు సాయం

మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి మాట సాయం చేశారు. రానా హీరోగా సంకల్ప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఘాజీ’ చిత్రానికి చిరు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మంచు మనోజ్‌ హీరోగా ఎస్‌.కె. సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుంటూరోడు’ చిత్రానికి మెగాస్టార్‌ తన మాట ఇచ్చారు. ‘చిత్ర కథ, పాత్రల పరిచయ సన్నివేశాలకు చిరంజీవిగారు తనదైన మాస్‌ స్టయిల్‌లో వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు’ అని దర్శకుడు తెలిపారు.

‘చిరంజీవిగారు మా చిత్రానికి మాట సాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. చిత్రబృందం తరఫున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని మనోజ్‌ అన్నారు. మనోజ్, ప్రగ్యా జైస్వాల్‌ జంటగా ఎస్‌.కె. సత్య దర్శకత్వంలో క్లాప్స్‌ అండ్‌ విజిల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపైశ్రీ వరుణ్‌ అట్లూరి నిర్మించిన ‘గుంటూరోడు’ చిత్రం మార్చి 3న విడుదలవుతోంది. రాజేంద్రప్రసాద్, కోటా శ్రీనివాసరావు, రావు రమేష్, సంపత్, పృధ్వీ, కాశీ విశ్వనాథ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వసంత్, కెమెరా: సిద్ధార్థ రామస్వామి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ప్రభు తేజ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement