
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్ రేపు (ఫిబ్రవరి 25) విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీంకు శుభాకాంక్షలు తెలుపుతూ చిరు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్‌కు చిరు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఒకే సెట్లో గాడ్ ఫాదర్, భీమ్లా నాయక్‌లు ఉన్న సినిమాటిక్ వీడియోను చిరంజీవి షేర్ చేశారు. ప్రస్తుతం చిరు నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్.
చదవండి: భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై కేటీఆర్ ట్వీట్
ఇటీవల భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ సినిమాల షూటింగ్ ఒకే చోట జరగడంతో చిరంజీవి ఖైదీ డ్రెస్‌లోనే భీమ్లా నాయక్ మూవీ సెట్‌కి వెళ్లి సందడి చేశారు. ఈ సందర్భంగా రానా, పవన్ కల్యాణ్, సాగర్ కే చంద్ర, త్రివిక్రమ్‌లతో ఫొటోలు కూడా దిగారు. అలాగే భీమ్లా నాయక్ టీం కూడా రీసెంట్‌గా గాడ్ ఫాదర్ సెట్‌లో సందడి చేసింది. రానా, త్రివిక్రమ్, పనన్ కల్యాణ్, సాగర్ కే చంద్ర, గాడ్ ఫాదర్ మూవీ సెట్‌కు వచ్చి కాసేపు చిరుతో ముచ్చటించారు.
చదవండి: 2 ఎకరాల్లో బన్నీ కొత్త ఇల్లు.. దాని విలువ ఎన్ని కోట్లో తెలుసా!
ఈ రెండు సందర్భాలకు సంబంధించిన సన్నివేశాలు, ఫొటోలను సినిమాటిక్‌గా వీడియోగా క్రియేట్ చేసిన వీడియోను రామ్ చరణ్ ఇదివరకే షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చిరు ఈ వీడియోను తన ట్విటర్‌లో షేర్ చేస్తూ.. రేపు విడుదల కానున్న భీమ్లా నాయక్ టీంకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇద్దరు మెగా హీరోలను ఒకే ఫ్రేంలో చూసి మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.
All The Best Team #BheemlaNayak @PawanKalyan @SitharaEnts https://t.co/KCTL0b5Eoj
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 24, 2022