
ప్రకాశ్ రాజ్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సాక్ష్యం’. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ చిత్రానికి నటుడు ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సందర్భంగా అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘కథాగమనానికి వాయిస్ ఓవర్ చాలా కీలకం.
అందుకే ఎవరైనా సీనియర్ ఆర్టిస్ట్ వాయిస్ ఓవర్ చెబితే బాగుంటుందని భావించిన శ్రీవాస్ స్వయంగా ప్రకాశ్‌రాజ్‌గారిని సంప్రదించగా ఆయన సమ్మతించారు. ఆయన మాట సినిమాలో చాలా కీలకపాత్ర పోషించనుంది. కర్మ సిద్ధాంతం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకి ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వరన్, కెమెరా: ఆర్థర్ ఏ. విల్సన్.
Comments
Please login to add a commentAdd a comment