
మనసుకు నచ్చింది ప్రమోషన్ ఈవెంట్‌లో మహేష్-మంజుల
సాక్షి, సినిమా : సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి డైరెక్టర్‌గా మారిన మంజుల ఘట్టమనేనికి టాలీవుడ్ ఇప్పుడు ఆల్ ది బెస్ట్ చెబుతోంది. ఆ వరుసలో ముందున్న సోదరుడు మహేష్ బాబు తన వంతుగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై ‘అక్క.. సక్సెస్ కొట్టాలి’ అంటూ కోరుకున్నాడు. అయితే మహేష్ తన సాయాన్ని ఇక్కడితోనే సరిపెట్టలేదు.
తాజాగా విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. ‘ఐ లవ్ యూ టూ.. ఇప్పుడే కాదు. ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటాను. నన్ను ప్రేమ అనోచ్చు.. ప్రకృతి అని కూడా అనొచ్చు. నువ్వు నన్ను ఎలాగైనా పిలవొచ్చు. ఎందుకంటే నీ చుట్టూ ఎటు చూసినా నేనే. ఆఖరికి నువ్వు కూడా నేనే. నువ్వు-నేనూ వేరు కాదు. నువ్వు ప్రేమ, నేనూ ప్రేమే. నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు చేయాల్సిందల్లా నన్ను ఫీలవ్వటమే. నిన్ను నిద్ర లేపే పక్షి గొంతులో నేనున్నాను. చెట్టు పూల రంగులో నేనున్నాను. నువ్వు పీల్చే గాలిలో నీ ఊపిరినై నేనున్నాను. నీ ప్రతీ శ్వాస నేనే. ఐ యామ్ ఫీల్ యువర్ లవ్’ అంటూ మహేష్ వాయిస్ ఓవర్ ను అందించాడు.
సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరో హీరోయిన్లుగా మంజుల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆనందీ ఆర్ట్స్, మంజుల సొంత బ్యానర్ ఇందిరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాధన్ సంగీతం సమకూర్చాడు. ఫిబ్రవరి 16న మనసుకు నచ్చింది ప్రేక్షకుల ముందుకు రానుంది.
#ManasukuNachindi #TrailerWithATwist @urstrulyMahesh https://t.co/seFdtwg60d
— Manjula Ghattamaneni (@ManjulaOfficial) February 15, 2018
Comments
Please login to add a commentAdd a comment