Manasuku Nachindi
-
అందంతో కట్టిపడేస్తున్న అమైరా ధరించిన చీర ధర వింటే షాకవ్వాల్సిందే!
‘మనసుకు నచ్చింది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమైరా దస్తూర్.. బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోని అన్ని భాషా చిత్రాల్లో నటించి అభిమానధనాన్ని పొందింది. ఆమె ఫేవరెట్ లిస్ట్‌లో ప్లేస్ అయిన ఫ్యాషన్ బ్రాండ్స్ కొన్నిటిని చూద్దాం మరి.. శ్యామల్, భూమిక ఇద్దరు స్నేహితులు శ్యామల్, భూమిక కలసి ముంబైలో ‘శ్యామల్, భూమిక ’ పేరుతో ఓ ఫ్యాషన్ హౌస్‌ను స్థాపించారు. ప్రాచీన సంప్రదాయ డిజైన్స్‌కి ఇది పెట్టింది పేరు. చాలామంది సెలబ్రిటీస్‌కి ఇది ఇష్టమైన బ్రాండ్. అయితే వీటి ధర లక్షల్లోనే ఉంటుంది. ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు. అవకాశం ఎప్పుడొస్తుందో మనకు తెలియదు. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా చాన్స్ మిస్ చేసుకుంటాం. అమైరా ధరించిన శ్యామల్, భూమిక డిజైన్ చీర ధర రూ. 1,50,000/- ఘోష్ జూయల్స్.. అతి ప్రాచీన, ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్‌లో ఘోష్ జ్యూయల్స్ ఒకటి. 1986లో జతిన్ దాత్వనీ ఈ బంగారు అభరణాల వ్యాపారాన్ని ప్రారంభించారు. సంస్కృతి, సంప్రదాయ, డిజైన్స్ తోపాటు ఆధునిక డిజైన్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ నగరాలతో పాటు ఆన్‌లైన్‌లోనూ లభ్యం. -దీపిక కొండి (చదవండి: ఏజెంట్ బ్యూటీ ధరించిన డ్రస్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే!) -
స్పీడ్ పెంచిన హీరోలు
రెండు మూడేళ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు హీరోలు స్పీడ్ పెంచారు. ఒకేసారి రెండు సినిమాలు లేదా ఒకే సినిమాని త్వరగా పూర్తి చేయడం చేస్తున్నారు. దానివల్ల థియేటర్ల కొరత ఏర్పడుతోంది. ఇదే విషయాన్ని ఇటీవల ‘దిల్’ రాజు ప్రస్తావించారు. ఎన్ని ఎక్కువ సినిమాలు వస్తే అంత మంచిదే కానీ, రిలీజ్ విషయంలో అండర్‌స్టాండింగ్‌తో వెళ్లాలి. నిర్మాతలందరూ దాదాపు అలానే వెళుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి 9 గురించి మాట్లాడుకోవాలి. ఒకటి కాదు.. రెండు కాదు. ఏకంగా ఐదు సినిమాలు ఫిబ్రవరి 9న బాక్సాఫీస్ వార్‌కు రెడీ అయ్యాయి. మోహన్‌బాబు ‘గాయత్రి’, వరుణ్‌తేజ్ ‘తొలిప్రేమ’, సాయిధరమ్ తేజ్ ‘ఇంటిలిజెంట్’, నిఖిల్ ‘కిర్రిక్ పార్టీ’, నాగశౌర్య ‘కణం’ అదే రోజున రిలీజ్ కావాల్సింది. కానీ.. గాయత్రి, ఇంటిలిజెంట్ మాత్రమే ఫిబ్రవరి 9న థియేటర్లోకి వచ్చాయి. ‘తొలిప్రేమ’ నిర్మాత బీవీయస్‌యన్ ప్రసాద్, ఆ మూవీ డిస్ట్రిబ్యూటర్ ‘దిల్’ రాజు తమ ‘తొలిప్రేమ’ సినిమాను ఒక్క రోజు వాయిదా వేశారు. అంటే.. ఫిబ్రవరి 10న వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ రిలీజైంది. ‘ఇంటిలిజెంట్’ నిర్మాత సి. కల్యాణ్, ‘తొలిప్రేమ’ నిర్మాత బీవీయస్‌యన్, డిస్ట్రిబ్యూటర్ రాజు.. ముగ్గురూ చర్చించుకుని ఈ నిర్ణయానికి వచ్చారు. అంతేకాదు.. ఇప్పుడు ఒకేరోజు సినిమాలు రిలీజ్ అవుతుంటే.. ఒక సినిమా హీరో, ఇంకో సినిమా హీరోకు సోషల్ మీడియాలో ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. అఖిల్ హీరోగా నాగార్జున నిర్మాణంలో వచ్చిన ‘హలో’, ‘దిల్’ రాజు నిర్మాతగా నాని హీరోగా వచ్చిన ‘ఎమ్సీఏ’ విషయం అప్పుడు ఇలానే పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇటీవల ‘మనసుకు నచ్చింది’ రిలీజ్ అప్పుడు చిత్రకథానాయకుడు సందీప్ కిషన్.. నాని నిర్మించిన ‘అ!’కి శుభాకాంక్షలు చెబితే.. నాని టీమ్ వీళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సాయిధరమ్ తేజ్, లావణ్యా త్రిపాఠి -
‘మనసుకు నచ్చింది’ మూవీ రివ్యూ
టైటిల్ : మనసుకు నచ్చింది జానర్ : రొమాంటిక్ కామెడీ తారాగణం : సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి, అదిత్ అరుణ్, బేబీ జాన్వీ సంగీతం : రధన్ దర్శకత్వం : మంజుల ఘట్టమనేని నిర్మాత : సంజయ్ స్వరూప్, పి.కిరణ్ షో సినిమాతో నటిగా వెండితెరకు పరిచయం అయిన సూపర్ స్టార్ కృష్ణ వారసురాలు మంజుల. తొలి సినిమాతోనే జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న మంజుల తరువాత నటిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా దర్శకురాలిగా మారి మనసుకు నచ్చింది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సందీప్ కిషన్, అమైరా దస్తర్లు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించటంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. నటిగా ప్రూవ్ చేసుకున్నా మంజుల దర్శకురాలిగానూ సక్సెస్ సాధించిందా..? ఈ సినిమాతో సందీప్ కిషన్ హిట్ అందుకున్నాడా..? కథ : సూరజ్(సందీప్ కిషన్), నిత్య (అమైరా దస్తూర్) ఒకే ఫ్యామిలీలో కలిసి పెరిగిన స్నేహితులు. వాళ్ల స్నేహాన్ని ప్రేమగా భావించిన పెద్దవాళ్లు వాళ్లకు పెళ్లిచేయాలని నిర్ణయిస్తారు. కానీ తమ మధ్య స్నేహం తప్ప ప్రేమ లేదని సూరజ్, నిత్యలు ఇంట్లోనుంచి పారిపోతారు. తమ ఫ్రెండ్ శరత్(ప్రియదర్శి) సాయంతో గోవాలోని ఓ గెస్ట్ హౌజ్‌లో ఉంటుంటారు. అప్పటి వరకు ఎలాంటి గోల్స్ లేని సూరజ్ గోవా వెల్లిన తరువాత ఫొటోగ్రాఫర్ కావాలని నిర్ణయించుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో ఫెయిల్ అవుతాడు. కానీ నిత్యా ధైర్యం చెప్పటంతో కూల్ అవుతాడు. అదే సమయంలో నిత్య.. తనకు సూరజ్ మీద ఉన్నది ఇష్టం కాదు ప్రేమ అని తెలుసుకుంటుంది. సూరజ్ కూడా ఏదో ఒకరోజు తన ప్రేమను ఫీల్ అవుతాడని ఎదురుచూస్తుంటుంది. కానీ ఈ లోగా గోవాలో పరిచయం అయిన నిక్కి (త్రిదా చౌదరి)ని సూరజ్ ఇష్టపడతాడు. అదే సమయంలో అభయ్ (అదిత్ అరుణ్) అనే కుర్రాడు నిత్యను ఇష్టపడతాడు. దీంతో వారి పెద్దలు ఈ రెండు జంటలకు పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. చివరకు సూరజ్.. నిత్య ప్రేమను అర్ధం చేసుకున్నాడా..? వారిద్దరు ఒక్కటయ్యారా..? ప్రయాణంలో అసలు ప్రకృతి పాత్ర ఏంటి అన్నదే మిగతా కథ. నటీనటులు : సందీప్ కిషన్ తనకు అలవాటైన యూత్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించాడు. అయితే ఎమోషనల్ సీన్స్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే చాలా సన్నివేశాల్లో సందీప్ నటన నిరాశపరుస్తుంది. హీరోయిన్ అమైర దస్తూర్ అందంతో ఆకట్టుకుంది. నటన పరంగానూ పరవాలేదనిపించింది. మరో హీరోయిన్గా నటించిన త్రిదా చౌదరి పూర్తిగా గ్లామర్ షోకే పరిమితమైంది. ప్రియదర్శి లాంటి లీడింగ్ కమెడియన్‌ను హీరో ఫ్రెండ్ పాత్రకు తీసుకున్నా.. సరిగ్గా ఉపయోగించుకోలేదు. ప్రియదర్శి డైలాగ్స్‌లో గత చిత్రాల్లో కనిపించే చమక్కులు ఈ సినిమాలో మిస్ అయ్యాయి. ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఘట్టమనేని వారసురాలు, మంజుల కూతురు జాన్వీ మంచి నటన కనబరించింది. ఇంగ్లీష్ కలిసి తెలుగు యాక్సెంట్లో జాన్వీ చెప్పిన డైలాగ్స్ అలరిస్తాయి. ఇతర పాత్రలు పెద్దగా తెర మీద కనిపించవు. అదిత్ అరుణ్, నాజర్, సంజయ్, అనితా చౌదరిలవి దాదాపుగా అతిథి పాత్రలే. విశ్లేషణ : మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా చేసిన తొలి ప్రయత్నంలో ఆకట్టుకోలేకపోయింది. రొటీన్ ట్రయాంగ్యులర్ లవ్ స్టోరికి ‘నేచర్’ అనే ఎలిమెంట్‌ను జోడించి చేసిన ఈ ప్రయత్నం పూర్తిగా నిరాశపరిచింది. కథలో కొత్తదనం లేకపోవటం కథనం కూడా నెమ్మదిగా సాగటం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. సినిమాలో ఆకట్టుకునే ఒకే ఒక్క అంశం సినిమాటోగ్రఫి, ప్రకృతి అందాలను వెండితెర మీద మరింత అందంగా చూపించారు సినిమాటోగ్రాఫర్ రవియాదవ్. రధన్ సంగీతం పరవాలేదు. ఎడిటింగ్, నిర్మాణవిలువలు బాగున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా ప్రతీ ఫ్రేము రిచ్‌గా తెరకెక్కించారు. ప్లస్ పాయింట్స్ : సినిమాటోగ్రఫి హీరోయిన్ల గ్లామర్ మైనస్ పాయింట్స్ : కథా కథనం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
మంచి సినిమా చూశాం అంటారు
‘‘రియల్ లైఫ్‌లో నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగా. కానీ.. ‘మనసుకు నచ్చింది’ సినిమాలో సూరజ్ పాత్రలో హై క్లాస్ అబ్బాయిగా కనిపిస్తా. నాకు అలాంటి స్నేహితులు ఉండటంతో సూరజ్‌గా సులభంగా నటించగలిగా’’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు. సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరో హీరోయిన్లుగా మంజుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మనసుకు నచ్చింది’. సంజయ్ స్వరూప్, పి.కిరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మీడియాతో మాట్లాడుతూ– ‘‘మంజులగారు చెప్పిన కథ వినగానే చాలా ఎగై్జట్ అయ్యా. ప్రతి సన్నివేశం చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. నాకు చెప్పిన కథని మంజులగారు అలాగే తెరపైకి తీసుకురావడం గ్రేట్. ఇదొక ఫీల్ గుడ్ మూవీ. మనం మిస్సవుతున్న చిన్న చిన్న సంతోషాలని ఈ కథ గుర్తు చేస్తుంది. ఇటీవల నా సినిమాల్లో వినోదం మిస్ అవడంతో ప్రేక్షకులు సరిగ్గా ఆదరించలేదు. ‘మనసుకు నచ్చింది’లో ఫన్ ఉంటుంది. రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ నేనిప్పటి వరకూ చేయలేదు. ఈ చిత్రంలో చేశా. పిల్లల నుంచి పెద్దల వరకూ.. ముఖ్యంగా పిల్లలకీ, మహిళలకి మా సినిమా బాగా నచ్చుతుంది. ఓ మంచి సినిమా చూశామనే భావన అన్ని వర్గాల ప్రేక్షకులకు కలుగుతుంది’’ అన్నారు. ప్రస్తుతం కునాల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ఆ తర్వాత నందిని పులి అనే లేడీ డైరెక్టర్‌తో లవ్‌స్టోరీ, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో సినిమాలు చేయనున్నా’’ అన్నారు. బషీద్ వల్ల నాకే ఎక్కువ నష్టం ‘‘సీవీ కుమార్ స్వీయదర్శకత్వంలో నిర్మించిన ‘మాయవన్’ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది. ఆ సినిమాని నిర్మాత ఎస్.కె. బషీద్ తెలుగులో ‘ప్రాజెక్ట్ జెడ్’ పేరుతో విడుదల చేశారు. ఆ సినిమాకి నేను తెలుగు డబ్బింగ్ చెప్పలేదని, దాంతో నష్టపోయానని ఆయన ఆరోపిస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో నేను డబ్బింగ్ చెప్పా. సీవీ కుమార్‌గారికి బషీద్ పూర్తి డబ్బులు చెల్లించలేదు. దాంతో ఆయన డబ్బింగ్ వెర్షన్ ఇవ్వలేదు. కానీ బషీద్ సెన్సార్ ప్రింట్‌నే రిలీజ్ చేయడంతో ఫ్లాప్ అయింది. ఆ రకంగా బషీద్ వల్ల నాకే ఎక్కువ నష్టం. తమిళంలో హిట్ అయిన ఓ సినిమాని తెలుగులో చంపేశాడు బషీద్’’ అని సందీప్ కిషన్ అన్నారు. -
'మనసుకు నచ్చింది' రిలీజ్ ట్రైలర్
-
చెట్టు, చేప, ప్రకృతి.. ఇంట్రస్టింగ్ ఫ్రైడే
ఈ శుక్రవారం టాలీవుడ్ లో ఆసక్తికరమైన సినిమాలు బరిలో దిగుతున్నాయి. కొత్త తరహా కథా కథనాలతో రూపొందిన అ! సినిమాతో తొలిసారిగా నాని నిర్మాతగా మారుతుంటే.. మనసుకు నచ్చింది సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల దర్శకురాలిగా మారుతున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా నిర్మాణ సంస్థలు ప్రచార కార్యక్రమాల్లోనూ కొత్తదనం చూపిస్తున్నారు. ఈ రెండు సినిమాలకు మరో ప్రత్యేక కథ కూడా ఉంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాల్లో ముగ్గురు టాప్ హీరోలు కేవలం వినిపించేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా చెట్టు, చేప, ప్రకృతి లాంటి వాటికి టాప్ స్టార్లు గాత్రదానం చేయటం విశేషం. అ! సినిమాలో చేప పాత్రకు నాని, చెట్టు పాత్రకు రవితేజ డబ్బింగ్ చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మనసుకు నచ్చింది సినిమా కొత్త టీజర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ సూపర్ స్టార్ అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈ సినిమాలో మహేష్ బాబు ప్రకృతికి వాయిస్ అందించారు. ఇలా ఒకే రోజు రిలీజ్ అవుతున్న రెండు సినిమాల్లో ముగ్గురు టాప్ హీరోలు చెట్టు, చేప, ప్రకృతి లాంటి వాటికి డబ్బింగ్ చెప్పటం ఆసక్తికరంగా మారింది. -
అక్క కోసం మహేష్ మరో సాయం
సాక్షి, సినిమా : సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి డైరెక్టర్‌గా మారిన మంజుల ఘట్టమనేనికి టాలీవుడ్ ఇప్పుడు ఆల్ ది బెస్ట్ చెబుతోంది. ఆ వరుసలో ముందున్న సోదరుడు మహేష్ బాబు తన వంతుగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై ‘అక్క.. సక్సెస్ కొట్టాలి’ అంటూ కోరుకున్నాడు. అయితే మహేష్ తన సాయాన్ని ఇక్కడితోనే సరిపెట్టలేదు. తాజాగా విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. ‘ఐ లవ్ యూ టూ.. ఇప్పుడే కాదు. ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటాను. నన్ను ప్రేమ అనోచ్చు.. ప్రకృతి అని కూడా అనొచ్చు. నువ్వు నన్ను ఎలాగైనా పిలవొచ్చు. ఎందుకంటే నీ చుట్టూ ఎటు చూసినా నేనే. ఆఖరికి నువ్వు కూడా నేనే. నువ్వు-నేనూ వేరు కాదు. నువ్వు ప్రేమ, నేనూ ప్రేమే. నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు చేయాల్సిందల్లా నన్ను ఫీలవ్వటమే. నిన్ను నిద్ర లేపే పక్షి గొంతులో నేనున్నాను. చెట్టు పూల రంగులో నేనున్నాను. నువ్వు పీల్చే గాలిలో నీ ఊపిరినై నేనున్నాను. నీ ప్రతీ శ్వాస నేనే. ఐ యామ్ ఫీల్ యువర్ లవ్’ అంటూ మహేష్ వాయిస్ ఓవర్ ను అందించాడు. సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరో హీరోయిన్లుగా మంజుల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆనందీ ఆర్ట్స్, మంజుల సొంత బ్యానర్ ఇందిరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాధన్ సంగీతం సమకూర్చాడు. ఫిబ్రవరి 16న మనసుకు నచ్చింది ప్రేక్షకుల ముందుకు రానుంది. #ManasukuNachindi #TrailerWithATwist @urstrulyMahesh https://t.co/seFdtwg60d — Manjula Ghattamaneni (@ManjulaOfficial) February 15, 2018 -
‘మనసుకు నచ్చింది’ ప్రీ రిలీజ్ వేడుక
-
అక్కతో సినిమా కూడా చేస్తానేమో?
‘‘మంజుల డైరెక్షన్ చేస్తుందని ఊహించలేదు. హాలిడేస్ టైమ్‌లో తను ఏదో రాసుకుంటుంటే కవిత రాసుకుంటుందేమో అనుకున్నా. కానీ సినిమా కథ రాసుకుంటుందని అనుకోలేదు’’ అని హీరో మహేశ్‌బాబు అన్నారు. సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరో హీరోయిన్లుగా మంజుల దర్శకత్వంలో సంజయ్ స్వరూప్, పి.కిరణ్ నిర్మించిన ‘మనసుకు నచ్చింది’ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ–రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘మంజుల కథ ప్రిపేర్ చేసుకొని, సినిమా చేయబోతున్నానని చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా. ఒకరకంగా గర్వంగా ఫీలయ్యాను. విజువల్స్ బాగా నచ్చాయి. మా కిరణ్‌గారి సపోర్ట్, గైడెన్స్ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఆశిస్తున్నా. భవిష్యత్‌లో మా అక్కతో (మంజుల) సినిమా కూడా చేస్తానేమో?’’ అన్నారు. ‘‘మనసుకు నచ్చింది’ కథ రాయడం మొదలుకొని, సినిమా పూర్తి చేయడం వరకూ ఒక నేచురల్ ప్రాసెస్‌లా జరిగింది. మా నాన్నగారు (కృష్ణ), తమ్ముడు మహేశ్ గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది. ఒకానొక సందర్భంలో మహేశ్ కొడుకు గౌతమ్ వెళ్లి ‘నాన్నా.. మంజుల ఆంటీ సినిమాలో ఎప్పుడు యాక్ట్ చేస్తావ్?’ అని అడిగితే చాలా సింపుల్‌గా ‘అదే నా ఆఖరి సినిమా అవుతుంది’ అన్నాడట (నవ్వుతూ). కిరణ్‌గారి సహకారానికి రుణపడి ఉంటా’’ అన్నారు మంజుల. ‘‘మంజులగారి దర్శకత్వంలో హీరోగా చేయడం.. అది ఆమె ఫస్ట్ మూవీ కావడం నా లక్’’ అన్నారు సందీప్ కిషన్. -
అప్పుడు మహేశ్ పిలిచి మరీ చాన్స్ ఇస్తాడేమో!
‘‘ఏదో ఒక సినిమా డైరెక్షన్ చేయాలనే ఆలోచన, అవసరం నాకు లేదు. ప్రకృతిలో నేను ఏదైతే ఫీల్ అయ్యానో దాన్ని ప్రేక్షకులకు పంచాలని ఓ బాధ్యతగా ‘మనసుకు నచ్చింది’ కథ తయారు చేసుకున్నా. పైగా నాన్నగారు (కృష్ణ), మహేశ్‌బాబు సంపాదించుకున్న ఇమేజ్ వల్ల నాపై ఓ బాధ్యత ఉంటుంది’’ అని మంజుల ఘట్టమనేని అన్నారు. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా మంజుల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మనసుకు నచ్చింది’. సంజయ్ స్వరూప్. పి.కిరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలవుతోంది. మంజుల పంచుకున్న విశేషాలు.. ► ప్రస్తుత బిజీ లైఫ్‌లో మనం చిన్న చిన్న అనుభూతుల్ని కోల్పోతున్నాం. వాటిని ఎలా ఆస్వాదించాలి? ప్రకృతితో ఎలా మమేకం కావాలి? అన్నదే ‘మనసుకు నచ్చింది’ క£ý . భాషపై నాకు పట్టు లేకపోవడంతో కథ రాయడానికి ఏడాది పట్టింది. నేను డైలాగులు ఇంగ్లీష్‌లో రాశా. వాటిని బుర్రా సాయిమాధవ్గారితో తెలుగులో రాయించాం. ► నా ఫస్ట్ లవ్ ఎప్పుడూ డైరెక్షనే. నేను డైరెక్షన్ చేస్తాననగానే నా భర్త (సంజయ్ స్వరూప్) సపోర్ట్ చేశారు. నాన్నగారు (కృష్ణ) థ్రిల్ అయ్యారు. ఈ సినిమాకి కిరణŠ గారు నిర్మాత అనగానే ఇంకా సంతోషపడ్డారు. మహేశ్‌బాబుకి చెప్పగానే ‘నీకు పిచ్చెక్కిందా. సడెన్‌గా డైరెక్షన్ ఏంటి?’ అన్నాడు. కానీ నా కథ విన్నాక నమ్మకం వచ్చింది. సినిమాలో ప్రకృతికి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ట్రైలర్ చూసి షాక్ అయ్యాడు. చాలా బాగుందన్నాడు. ► ప్రకృతే మా సినిమాలో ప్రధాన హైలెట్. అది కూడా ఒక హీరోనే. స్వచ్ఛమైన ప్రేమకథ, ఫన్ అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రతి సన్నివేశం నా హృదయం నుంచి వచ్చింది. ఇందులో నిత్య పాత్ర నా క్యారెక్టర్‌కి దగ్గరగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘మనసుకు నచ్చింది’ ఒక సముద్రం లాంటి సినిమా. ► సందీప్‌ని దృష్టిలో పెట్టుకుని కథ రాయలేదు. ముందు కథ రాసుకున్నా. హీరో ఎవరైతే బాగుంటారా? అనుకున్నా. కిరణ్‌గారు సందీప్ పేరు చెప్పారు. అప్పటి వరకూ నేను సందీప్ సినిమాలు చూడలేదు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సీడీ పంపితే చూశా. తర్వాత కలిసినప్పుడు కథకి తనే కరెక్ట్ అనిపించింది. మంచి పాత్ర ఇవ్వాలే కానీ తను బాగా నటిస్తాడు. ► నాకు డైరెక్షన్ కష్టం అనిపించలేదు. చాలా ఎంజాయ్ చేశా. నేను డైరెక్షన్ చేసిన తీరు చూసిన కెమెరామెన్ రవి యాదవ్ ‘మీకిది తొలి సినిమాలా లేదు మేడమ్. పది సినిమాలు తీసిన అనుభవం ఉన్నట్లుంది’ అన్నారు. నా సినిమాకు రెహమాన్‌గారితో సంగీతం చేయించాలనే ఆలోచన ఉండేది. రధన్ స్వరపరచిన ‘అందాల రాక్షసి’ పాటలు వినగానే నాకు రెహమాన్‌గారు గుర్తుకొచ్చారు. రధన్ అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు. ► నాన్నగారు, మహేశ్ ఇంకా ఈ సినిమా చూడలేదు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తామన్నారు. 16వ తేదీ ఎప్పుడొస్తుందా అని చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. మహేశ్‌కి ఏ కథ అయినా సరిపోతుంది. తను ఇక్కడ ఉండటం టాలీవుడ్ అదృష్టం. తనతో పనిచేయడం నా కల. తన ఇమేజ్‌కి తగ్గట్టు కథ రెడీ చేస్తే పిలిచి మరీ అవకాశమిస్తాడేమో. ► ట్రైలర్ చూసిన కొందరు కృష్ణవంశీగారిలా కొత్తగా తీశావని అభినందిస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు తప్ప కొత్త కథలను ప్రేక్షకులు ఆదరించరనే భావన ఫిల్మ్‌మేకర్స్‌లో ఉంది. ఆ ఆలోచనా ధోరణి మారాలి. ప్రేక్షకులు చాలా తెలివైనవారు. కొత్త కథలనెప్పుడూ ఆదరిస్తారు. అందుకే ‘పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి, తొలిప్రేమ’ వంటి వైవిధ్యమైన చిత్రాలు వచ్చాయి.. హిట్ అయ్యాయి. ► ఓ టాప్ హీరో ప్రజలకు సేవ చేద్దామనుకొని రాజకీయాల్లోకి ఎలా వెళ్లాడు? అనే అంశంపై ఓ కథ రాసుకున్నా. అది పవన్ కల్యాణ్‌గారి వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుంది. అవకాశం వస్తే ఆయనతో చేయడానికి రెడీ. హీరోని దృష్టిలో పెట్టుకుని కథలు రాయను. కథ రాశాకే హీరో ఎవరని ఆలోచిస్తా. -
మహేశ్ ఇంప్రెస్ అయ్యాడు – మంజుల
‘‘నేను డైరెక్షన్ చేస్తున్నానంటే మహేశ్ నమ్మలేదు. టీజర్స్, సాంగ్స్ చూసి షాక్ అయ్యాడు. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఈ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యాడు’’ అన్నారు మంజుల. సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరో హీరోయిన్లుగా మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించిన సినిమా ‘మనసుకు నచ్చింది’. పి.కిరణ్, సంజయ్ స్వరూప్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ–‘‘ఏదో ఓ సినిమా డైరెక్ట్ చేయాలని ఈ సినిమా డైరెక్ట్ చేయలేదు. మంచి విషయం ఉండబట్టే చేశాను. బేసిక్‌గా నేను రొమాంటిక్ పర్సన్‌ను. అందుకే ఓ స్వీట్ లవ్‌స్టోరీ రాసుకున్నాను. ఈ సినిమా చూసి కెమెరామేన్ ఛోటాగారు బెస్ట్ లవ్ స్టోరీ అన్నారు. కథను ముందు కిరణ్‌గారికి చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. ఆ సాయంత్రమే సాయిమాధవ్ బుర్రాకి చెప్పాను. ఆయనకూ బాగా నచ్చింది. ఈ సినిమాలో మా ఆయన (సంజయ్) స్పెషల్ రోల్ చేశారు. ఆయన లక్కీ యాక్టర్. ఆయన చేసిన సినిమాలన్నీ హిట్టయ్యాయి. మా అమ్మాయి కూడా మంచి రోల్ ప్లే చేసింది. సందీప్, అమైరా బాగా చేశారు. నా దగ్గర పవన్ కల్యాణ్ కోసం మంచి కథ ఉంది. ఆయనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఆ ఒక్క సినిమా చేసి రాజకీయాల్లోకి వెళ్లొచ్చు’’ అన్నారు.‘‘ప్రతి ఒక్కరి లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసే అందమైన చిత్రం. ఇందులో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని ఒక ఇంట్రస్టింగ్ మెసేజ్ ఉంటుంది. ఇది ఏ జానర్ సినిమా అని ఒక ఫ్రెండ్ అడిగాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ ఒక మంచి కాఫీలాంటి సినిమా అవుతుంది అనిపించింది. నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అన్నారు సందీప్ కిషన్. ‘‘మంజుల కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. బేసిక్‌గా నాకు లవ్‌స్టోరీస్ అంటే చాలా ఇష్టం. అందరికీ నచ్చుతుందని ఈ సినిమా తీశాం. ఫిబ్రవరి 16న విడుదల చేస్తున్నాం’’ అన్నారు పి.కిరణ్. ‘‘ప్రేక్షకులందరికీ నచ్చే కథ. అందరికీ నచ్చే డైలాగ్స్ రాశాను. మంజులగారు క్లారిటీతో, మనసుకు హత్తుకునేలా రాయించుకున్నారు’’ అన్నారు బుర్రా సాయిమాధవ్. ‘‘సినిమా చూశాం. చాలా హ్యాపీగా ఉన్నాం. అందరికీ నచ్చేలా ఓ మంచి సినిమా తీసిన మంజులకు నా కంగ్రాట్స్. కిరణ్‌గారు లేకపోతే ఈ సినిమా లేదు’’ అన్నారు సంజయ్ స్వరూ‹ప్. ఈ సినిమాకు సంగీతం: రధన్, కెమెరా: రవి యాదవ్, మాటలు: సాయి మాధవ్ బుర్రా. -
‘మనసుకు నచ్చింది’ ఆడియో లాంచ్
-
రెండేళ్లలో తెలుగు డబ్బింగ్ చెబుతా
‘‘నా పాత్ర పేరు నిత్య. యోగా టీచర్ని. మంజులగారు నన్ను ఆడిషన్ ద్వారా ఎంపిక చేశారు. పైగా నిత్య పాత్ర నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుంది. అందుకే నటించేందుకు ఒప్పుకున్నా’’ అని కథానాయిక అమైరా దస్తూర్ అన్నారు. సందీప్‌కిషన్, అమైరా దస్తూర్ జంటగా మంజుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మనసుకు నచ్చింది’. పి.కిరణ్, సంజయ్ స్వరూప్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా అమైరా పలు విశేషాలు పంచుకున్నారు. ► బీకామ్ చదివిన నేను మోడల్‌గా చేశా. ‘ఇస్సక్’ అనే హిందీ చిత్రం ద్వారా తొలిసారి కెమెరా ముందుకొచ్చా. జాకీచాన్ ‘కుంగ్ ఫు యోగా’, ఇమ్రాన్ హష్మి ‘మిస్టర్ ఎక్స్’, ధనుష్ ‘అనేగన్’(తెలుగులో అనేకుడు) తదితర సినిమాల్లో నటించా. తెలుగులో ‘మనసుకు నచ్చింది’ నా తొలి సినిమా. ► అందం, అభినయానికి ప్రాధాన్యం ఇస్తా. ఈ సినిమాలో అలాంటి పాత్రే దక్కినందుకు హ్యాపీ. పాటలకు వచ్చి వెళ్లిపోయే పాత్ర కాదు నాది. కథతో పాటు సాగుతుంది. కొద్దిసేపట్లో పెళ్లిచేసుకోబోయే సూరజ్ (సందీప్), నిత్య ఎందుకు పారిపోయారు? ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నదే ఆసక్తికరం. ► మంజులగారు ఈ సినిమాని బాగా తెరకెక్కించారు. సందీప్ కిషన్ మంచి సహనటుడు. సెట్లో ఎంతో హెల్ప్ చేశాడు. తెలుగు రాకపోవడంతో ఇబ్బందులు పడ్డా. ఇప్పుడు నేర్చుకుంటున్నా. రెండేళ్లలో నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను. ► రాజ్‌తరుణ్‌తో ‘రాజుగాడు’ చిత్రంలోనూ నటిస్తున్నా. బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోని అన్ని భాషా చిత్రాల్లో నటించా లని ఉంది. -
‘మనసుకు నచ్చింది’ మూవీ స్టిల్స్