అందంతో కట్టిపడేస్తున్న అమైరా ధరించిన చీర ధర వింటే షాకవ్వాల్సిందే! | What Is The Price Of The Saree Worn By Amyra Dastur | Sakshi
Sakshi News home page

అందంతో కట్టిపడేస్తున్న అమైరా ధరించిన చీర ధర వింటే షాకవ్వాల్సిందే!

Aug 13 2023 8:36 AM | Updated on Aug 13 2023 1:40 PM

What Is The Price Of The Saree Worn By Amyra Dastur - Sakshi

‘మనసుకు నచ్చింది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమైరా దస్తూర్‌.. బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోని అన్ని భాషా చిత్రాల్లో నటించి అభిమానధనాన్ని పొందింది. ఆమె ఫేవరెట్‌ లిస్ట్‌లో ప్లేస్‌ అయిన ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ కొన్నిటిని చూద్దాం మరి.. 

శ్యామల్, భూమిక
ఇద్దరు స్నేహితులు శ్యామల్, భూమిక కలసి ముంబైలో ‘శ్యామల్, భూమిక ’ పేరుతో ఓ ఫ్యాషన్‌ హౌస్‌ను స్థాపించారు. ప్రాచీన సంప్రదాయ డిజైన్స్‌కి ఇది పెట్టింది పేరు. చాలామంది సెలబ్రిటీస్‌కి ఇది ఇష్టమైన బ్రాండ్‌. అయితే వీటి ధర లక్షల్లోనే ఉంటుంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు. అవకాశం ఎప్పుడొస్తుందో మనకు తెలియదు. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా చాన్స్‌ మిస్‌ చేసుకుంటాం. అమైరా ధరించిన శ్యామల్‌, భూమిక డిజైన్‌ చీర ధర రూ. 1,50,000/-

ఘోష్‌ జూయల్స్‌..
అతి ప్రాచీన, ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్‌లో ఘోష్‌ జ్యూయల్స్‌ ఒకటి. 1986లో జతిన్‌ దాత్వనీ ఈ బంగారు అభరణాల వ్యాపారాన్ని ప్రారంభించారు. సంస్కృతి, సంప్రదాయ, డిజైన్స్‌ తోపాటు ఆధునిక డిజైన్స్‌ కూడా ఇక్కడ లభిస్తాయి. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ నగరాలతో పాటు ఆన్‌లైన్‌లోనూ లభ్యం.

-దీపిక కొండి

(చదవండి: జెంట్‌ బ్యూటీ ధరించిన డ్రస్‌ ధర వింటే షాక్‌ అవ్వాల్సిందే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement