భారతీయ సంస్కృతికి అద్దం పట్టే రీతిలో సాగిన ఫ్యాషన్ వాక్ ఔరా అనిపించింది. ఆయా రాష్ట్రాల వస్త్రధారణతో సాగిన క్యాట్ వాక్ అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లోని రాయదుర్గంలోని ఎఫ్‌డీడీఐ ఆడిటోరియంలో ప్రధాని నరేంద్ర మోదీ భావజాలమైన వారసత్వ చేనేత వ్రస్తాలను ప్రోత్సహించేందుకు చేపట్టిన అవతరణ్–2024లో భాగంగా బుధవారం ఫ్యాషన్ వాక్ నిర్వహించారు.
ఎఫ్‌డీడీఐ(ఫుట్‌వేర్ డిజైన్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్)లోని ఫ్యాషన్ డిజైన్ విభాగం రెండో సంవత్సరం విద్యార్థులు ఫ్యాషన్ వాక్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలిచే చీర కట్టు, పంచెకట్టుతో ర్యాంప్‌పై విద్యార్థులు మెరిశారు. యువతులు వివిధ రాష్ట్రాల సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.
సాంఘిక సంస్కరణల చుట్టూ ఉండే సంప్రదాయ కథలలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే రీతిలో వ్రస్తాలను డిజైన్ చేశారని ఎఫ్‌డీడీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్.తేజ్ లోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. నిఫ్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ మధుప్రియ ఝా ఠాకూర్, ఎల్‌జీఏడీ సీనియర్ ఫ్యాకల్లీ సి.వేణుగోపాల్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. బెస్ట్ డిజైనర్, బెస్ట్ మోడల్‌ను ఎంపిక చేయనున్నారు.
(చదవండి: చందమామ లేదు.. యూట్యూబ్ ఉంది..!)
Comments
Please login to add a commentAdd a comment