ఈ శుక్రవారం టాలీవుడ్ లో ఆసక్తికరమైన సినిమాలు బరిలో దిగుతున్నాయి. కొత్త తరహా కథా కథనాలతో రూపొందిన అ! సినిమాతో తొలిసారిగా నాని నిర్మాతగా మారుతుంటే.. మనసుకు నచ్చింది సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల దర్శకురాలిగా మారుతున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా నిర్మాణ సంస్థలు ప్రచార కార్యక్రమాల్లోనూ కొత్తదనం చూపిస్తున్నారు.