వాయిస్ ఓవర్ | Puri Jagannadh does a voice over for romantic-comedy 'Ladies and Gentleman' | Sakshi
Sakshi News home page

వాయిస్ ఓవర్

Published Sat, Dec 27 2014 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

వాయిస్ ఓవర్

వాయిస్ ఓవర్

పూరి జగన్నాథ్ ఓ చిత్రంలో వినబడనున్నారు. కనపడకుండా.. వినపడటమేంటి? అనుకుంటున్నారా! మానవ సంబంధాలపై సోషల్ మీడియా, ఇంటర్‌నెట్ నేపథ్యంలో రూపొందుతోన్న ‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్’ చిత్రానికి పూరి జగన్నాథ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. తన గొంతు ద్వారా  ఆ కథను నడిపించే బాధ్యతను పూరీ తీసుకున్నారు. ఇటీవలే ఆయన వాయిస్ ఓవర్ ఇవ్వడం పూర్తయ్యిందనీ, మంచి చిత్రాలకు ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందే ఉంటాననీ నిరూపించిన పూరీగారికి కృతజ్ఞతలనీ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ‘మధురా’ శ్రీధర్ అన్నారు. మంజునాథ్ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో అడవి శేష్, మహత్ రాఘవేంద్ర, కమల్ కామరాజ్, చైతన్య కృష్ణ, నిఖితా నారాయణ్, స్వాతి దీక్షిత్, జాస్మిన్ ప్రధాన పాత్రధారులు. ఎంవీకే రెడ్డి ఈ చిత్రానికి మరో నిర్మాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement