ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannadh) కొన్నాళ్లుగా యూట్యూబ్ వేదికగా ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. పూరి నిర్వహిస్తున్న ఈ పాడ్‌కాస్ట్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. సరికొత్త విషయాలను చెబుతూ తన అభిమానులకు జ్ఞానంతో పాటు కొన్ని విషయాల్లో ధైర్యాన్ని కూడా అందిస్తున్నాడు. తాజాగా ఈ డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ ‘ఆటోఫజీ’ అనే పదానికి అర్థం వివరిస్తూ దాని వెనుక ఉన్న కథను చెప్పాడు.
‘‘ఆటోఫజీ’అనేది ఓ గ్రీకు పదం. ఆటో అంటే సెల్ఫ్ అని, ఫజీ అంటే తినడం అని అర్థం. దీన్నే ఇంగ్లీష్‌లో సెల్ఫ్ ఈటింగ్ అంటారు. ఇది శరీరంలో జరిగే జహన ప్రక్రియ. మన శరీరంలో ఉన్న పనికి రాని, దెబ్బతిన్న కణాలను మన శరీరమే తినేస్తుంది. ఆటోఫజీ(Autophagy) అనేది శరీరంలో జరిగే రీసైక్లింగ్ ప్రక్రియ. మన ఆరోగ్యానికి హానికలిగించే ఏ పదార్థం ఉన్నా, దాన్ని కూడా బయటకు పంపుతుంది. అలాగే, దెబ్బతిన్న ప్రొటీన్లను తీసేస్తుంది. ఈ ఆటోఫజీ వల్ల మన మెటబాలిజం పెరిగి, మరింత శక్తి చేకూరుతుంది. వృద్ధాప్య ఛాయలు కనపడకుండా చేస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్‌లాంటి రోగాలు రాకుండా చేస్తుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు, వ్యాయామం చేసినప్పుడే ఈ ఆటోఫజీ సక్రమంగా జరుగుతుంది.
హీట్ అండ్ కోల్డ్ థెరపీలోనూ బాగా పనిచేస్తుంది. దీని వల్ల మన జీవన కాలం పెరుగుతుంది. మన ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. అందుకే పెద్దలు ఉపవాసం అలవాటు చేశారు. మీరు కూడా ఏదో ఒక దేవుడి పేరు చెప్పి, అప్పుడప్పుడు ఉపవాసాలు చేయండి. మీ వ్యాధి నిరోధకశక్తి, మెదడు పనితీరు పెరుగుతుంది. రోజూ వ్యాయామం, ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ మంచిది. మన టిష్యులు రిపేర్ అయి, శరీరంలో హీలింగ్ ప్రక్రియ వేగం అవుతుంది. జపాన్‌కు చెందిన యష్నోరి అనే బయాలజిస్ట్ ఈ ఆటోఫజీ గురించి మొదట కనుక్కొన్నాడు. అతడికి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఉపవాసాలు, వ్యాయామాలు, చన్నీటి స్నానాల వల్ల ఆటోఫజీ యాక్టివేట్ అయి, ఆరోగ్యంగా ఉంటారు. దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే, మీ డాక్టర్‌ను సంప్రదించండి’ అని పూరి అన్నారు.
ఇక సినిమాల విషయాలకొస్తే..పూరి ఇటీవల తెరకెక్కించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్దా బోల్తా కొట్టాయి. భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన ‘లైగర్’ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా తీసిన డబుల్ ఇస్మార్ట్ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో పూరి కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం పలు కథలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ స్టార్ హీరోతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment