వెంకటేశ్, వరుణ్ తేజ్
‘‘డిస్నీ సినిమాలు అందరికీ తెలుసు. వాళ్ల యానిమేషన్ చిత్రాలు చాలానే చూశాను. ‘అలాద్దీన్’ చిత్రంలో వాయిస్ ఇవ్వాలని సంప్రదించినప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యాం. ఇలాంటి సినిమాలు తెలుగువాళ్లు కూడా చూడాలని అంగీకరించాను’’ అని వెంకటేశ్ అన్నారు. విల్‌స్మిత్ ముఖ్యపాత్రలో రూపొందిన చిత్రం ‘అలాద్దీన్’. డిస్నీ సంస్థ నిర్మించింది. ఈ సినిమాలో జినీ పాత్రకు వెంకటేశ్, అలాద్దీన్ పాత్రకు వరుణ్ తేజ్ తెలుగు డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘జీనీ పాత్రకు డబ్బింగ్ చెప్పడం చాలా ఫన్‌గా ఉంది.
క్రేజీ పాత్ర ఇది. చాలెంజింగ్‌గా ఉంది. డబ్బింగ్ చెబుతూ చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో అలాద్దీన్ కోరుకుంటే నేను నెరవేరుస్తుంటాను. జనరల్‌గా కూడా కోరుకున్నది నెరవేర్చడం చాలా బావుంటుంది. ‘ఎఫ్ 2’ తర్వాత మళ్లీ వరుణ్‌ని గైడ్ చేసే పాత్ర రావడం అనుకోకుండా జరిగింది. మా పిల్లలకు నేను జీనీలాంటి వాణ్ణే. అడిగింది ఇస్తుంటాను’’ అన్నారు. వరుణ్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పటి నుంచి నేను, చెల్లి(నిహారిక) డిస్నీ సినిమాలు చూసేవాళ్లం. ఇప్పుడు డిస్నీ సినిమాలకే డబ్బింగ్ చెప్పడం లక్కీగా ఫీల్ అవుతున్నా. అలాద్దీన్‌లా మూడు కోరికలు వస్తే ప్రపంచమంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment