Aladdin Movie
-
అరేబియన్ రాజ్యంలో...
అరేబియన్ నైట్స్ కథలలో అల్లాద్దీన్ అద్భుత దీపం కథకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ కథని ఎన్నిసార్లు సినిమాగా తీసినా చూసిన ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. అందుకే మరోసారి డిస్నీ వారు ప్రస్తుత సాంకేతికతని వాడుకొని ‘అలాద్దీన్’ కథని ఓ విజువల్ వండర్‌గా తయారు చేశారు. ఈ సినిమాలో జీనీగా విల్ స్మిత్, అల్లాద్దీన్‌గా మేనా మసూద్ నటించారు. గైయ్ రిచాయ్ దర్శకుడు. ఈ సినిమా రేపు తెలుగు, తమిళ్, హిందీ,ఇంగ్లీష్ భాషల్లో విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 350 థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇందులోని జీని (దెయ్యం) పాత్రకు వెంకటేశ్, అల్లాద్దీన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పడంతో తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. -
అలాద్దీన్ ప్రపంచం
అరేబియన్ నైట్స్ కథల్లో అలాద్దీన్ అద్భుత దీపం కథకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ అద్భుత దీపంతో ఎన్నో కథలు వచ్చాయి. ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉంటుంది. అందుకే సరికొత్త హంగులతో ఎప్పటికప్పుడు అలాద్దీన్‌ను ప్రేక్షకులకు అందిస్తున్నారు దర్శక–నిర్మాతలు. వాల్ట్ డిస్నీ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో జీనీ, అలాద్దీన్‌గా విల్ స్మిత్, నటించారు. గాయ్ రిట్చయ్ దర్శకత్వం వíహించిన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కాబోతోంది. జీనీ పాత్రకు వెంకటేశ్, అలాద్దీన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పారు. మరోసారి అలాద్దీన్ ప్రపంచంలోకి వెళ్లడానికి ప్రేక్షకులు రెడీగా ఉండాలన్నమాట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది -
నేనూ జీనీ లాంటి వాణ్ణే
‘‘డిస్నీ సినిమాలు అందరికీ తెలుసు. వాళ్ల యానిమేషన్ చిత్రాలు చాలానే చూశాను. ‘అలాద్దీన్’ చిత్రంలో వాయిస్ ఇవ్వాలని సంప్రదించినప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యాం. ఇలాంటి సినిమాలు తెలుగువాళ్లు కూడా చూడాలని అంగీకరించాను’’ అని వెంకటేశ్ అన్నారు. విల్‌స్మిత్ ముఖ్యపాత్రలో రూపొందిన చిత్రం ‘అలాద్దీన్’. డిస్నీ సంస్థ నిర్మించింది. ఈ సినిమాలో జినీ పాత్రకు వెంకటేశ్, అలాద్దీన్ పాత్రకు వరుణ్ తేజ్ తెలుగు డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘జీనీ పాత్రకు డబ్బింగ్ చెప్పడం చాలా ఫన్‌గా ఉంది. క్రేజీ పాత్ర ఇది. చాలెంజింగ్‌గా ఉంది. డబ్బింగ్ చెబుతూ చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో అలాద్దీన్ కోరుకుంటే నేను నెరవేరుస్తుంటాను. జనరల్‌గా కూడా కోరుకున్నది నెరవేర్చడం చాలా బావుంటుంది. ‘ఎఫ్ 2’ తర్వాత మళ్లీ వరుణ్ని గైడ్ చేసే పాత్ర రావడం అనుకోకుండా జరిగింది. మా పిల్లలకు నేను జీనీలాంటి వాణ్ణే. అడిగింది ఇస్తుంటాను’’ అన్నారు. వరుణ్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పటి నుంచి నేను, చెల్లి(నిహారిక) డిస్నీ సినిమాలు చూసేవాళ్లం. ఇప్పుడు డిస్నీ సినిమాలకే డబ్బింగ్ చెప్పడం లక్కీగా ఫీల్ అవుతున్నా. అలాద్దీన్‌లా మూడు కోరికలు వస్తే ప్రపంచమంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను’’ అన్నారు. -
కథ చెబుతారట
అల్లాదిన్ అద్భుత దీపం కథను చిన్నప్పుడు చాలా సందర్భంలో వినే ఉంటాం. ఈ కథనే మళ్లీ మనందరికీ చెప్పడానికి వెంకటేశ్, వరుణ్ తేజ్ సిద్ధమయ్యారు. వాల్ట్ డిస్నీ నిర్మాణంలో విల్‌స్మిత్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అల్లాదిన్’. ఈ సినిమాలో జీని, అల్లాదిన్ పాత్రలకు వెంకటేశ్, వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పారు. బ్లాక్‌బస్టర్ ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’లో నటించాక వీ2 (వెంకీ, వరుణ్ ) ఈ సినిమాకి కలిసి డబ్బింగ్ చెప్పడం విశేషం అని చెప్పవచ్చు. మే 24న ‘అల్లాదిన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. హాలీవుడ్ సినిమా అయినప్పటికీ మన స్టార్స్ వాయిస్ తోడైతే కచ్చితంగా సినిమా అన్ని వర్గాల వారికి చేరువ అవుతుందని భావించి నిర్మాతలు మన స్టార్స్‌తో డబ్బింగ్ చెప్పిస్తుంటారు. ఇటీవలే ‘అవెంజర్స్’లో థానోస్ పాత్రకు రానా డబ్బింగ్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. -
అల్లాదిన్‌కు వరుణ్.. జీనీకి వెంకీ!
హాలీవుడ్ దర్శక నిర్మాతలు ఇప్పుడు తెలుగు మార్కెట్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలను తెలుగులో పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు సినిమాకు వీలైనంత ప్రమోషన్ చేసేందుకు ఇక్కడి టాప్ స్టార్స్‌ను సినిమాలో భాగం చేస్తున్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ కోసం రానాతో పాటు పలువురు తెలుగు నటుడు డబ్బింగ్ చెప్పారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో హాలీవుడ్ మూవీ వచ్చి చేరింది. ప్రపంచానికి సుపరిచిత పాత్రలైన అల్లాదిన్, జీనీల కథను వాల్ట్ డిస్నీ సంస్థ మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించింది. మే 24న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈసినిమాలోని ప్రధాన పాత్రలకు టాలీవుడ్ స్టార్స్ డబ్బింగ్ చెపుతున్నారు. హీరో అల్లాదిన్ పాత్రకు వరుణ్ తేజ్, దీపం నుంచి వచ్చే జీనీ పాత్రకు సీనియర్ హీరో వెంకటేష్‌లు గాత్రదానం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్ రావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.