వెంకటేశ్, వరుణ్ తేజ్
అల్లాదిన్ అద్భుత దీపం కథను చిన్నప్పుడు చాలా సందర్భంలో వినే ఉంటాం. ఈ కథనే మళ్లీ మనందరికీ చెప్పడానికి వెంకటేశ్, వరుణ్ తేజ్ సిద్ధమయ్యారు. వాల్ట్ డిస్నీ నిర్మాణంలో విల్‌స్మిత్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అల్లాదిన్’. ఈ సినిమాలో జీని, అల్లాదిన్ పాత్రలకు వెంకటేశ్, వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పారు. బ్లాక్‌బస్టర్ ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’లో నటించాక వీ2 (వెంకీ, వరుణ్ ) ఈ సినిమాకి కలిసి డబ్బింగ్ చెప్పడం విశేషం అని చెప్పవచ్చు. మే 24న ‘అల్లాదిన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. హాలీవుడ్ సినిమా అయినప్పటికీ మన స్టార్స్ వాయిస్ తోడైతే కచ్చితంగా సినిమా అన్ని వర్గాల వారికి చేరువ అవుతుందని భావించి నిర్మాతలు మన స్టార్స్‌తో డబ్బింగ్ చెప్పిస్తుంటారు. ఇటీవలే ‘అవెంజర్స్’లో థానోస్ పాత్రకు రానా డబ్బింగ్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment