హాలీవుడ్ దర్శక నిర్మాతలు ఇప్పుడు తెలుగు మార్కెట్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలను తెలుగులో పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు సినిమాకు వీలైనంత ప్రమోషన్ చేసేందుకు ఇక్కడి టాప్ స్టార్స్‌ను సినిమాలో భాగం చేస్తున్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ కోసం రానాతో పాటు పలువురు తెలుగు నటుడు డబ్బింగ్ చెప్పారు.
తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో హాలీవుడ్ మూవీ వచ్చి చేరింది. ప్రపంచానికి సుపరిచిత పాత్రలైన అల్లాదిన్, జీనీల కథను వాల్ట్ డిస్నీ సంస్థ మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించింది. మే 24న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈసినిమాలోని ప్రధాన పాత్రలకు టాలీవుడ్ స్టార్స్ డబ్బింగ్ చెపుతున్నారు.
హీరో అల్లాదిన్ పాత్రకు వరుణ్ తేజ్, దీపం నుంచి వచ్చే జీనీ పాత్రకు సీనియర్ హీరో వెంకటేష్‌లు గాత్రదానం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్ రావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment