అలాద్దీన్ పోస్టర్
అరేబియన్ నైట్స్ కథలలో అల్లాద్దీన్ అద్భుత దీపం కథకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ కథని ఎన్నిసార్లు సినిమాగా తీసినా చూసిన ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. అందుకే మరోసారి డిస్నీ వారు ప్రస్తుత సాంకేతికతని వాడుకొని ‘అలాద్దీన్’ కథని ఓ విజువల్ వండర్‌గా తయారు చేశారు. ఈ సినిమాలో జీనీగా విల్ స్మిత్, అల్లాద్దీన్‌గా మేనా మసూద్ నటించారు. గైయ్ రిచాయ్ దర్శకుడు. ఈ సినిమా రేపు తెలుగు, తమిళ్, హిందీ,ఇంగ్లీష్ భాషల్లో విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 350 థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇందులోని జీని (దెయ్యం) పాత్రకు వెంకటేశ్, అల్లాద్దీన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పడంతో తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment