
ఆస్కార్ వేడుకల్లో కమెడియన్ క్రిస్ రాక్ చెంప చెళ్లుమనిపించి వార్తల్లోకెక్కాడు హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్. ఆ తర్వాత ఆస్కార్ కమిటీ అతడిపై 10 ఏళ్లపాటు నిషేధం విధించడం, ఆస్కార్ కమిటీలో తన సభ్యత్వానికి విల్‌స్మిత్ రాజీనామా చేయడం, క్రిస్‌రాక్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం తెలిసిందే! తాజాగా ఈ స్టార్ హీరో ఓ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
తన ఇంట్లోకి వచ్చిన పెద్ద సాలీడును చూసి స్మిత్ హడలిపోయాడు. 'వార్నీ, ఎంత పెద్దగా ఉంది, ట్రే.. నేను కుర్చీలో ఉన్నాను కదా, నువ్వు వెళ్లి దాన్ని పట్టుకుని అవతల పాడేయ్. నువ్వు యంగ్ అలాగే స్ట్రాంగ్ కదా, నువ్వైతేనే దాన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలవు, వెళ్లు' అంటూ సాలీడును పట్టుకునే బాధ్యతను కొడుక్కి పురమాయించాడు. మొత్తానికి తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి ఎలాగోలా ఆ పురుగును ఓ గ్లాస్ బౌల్‌లో బంధించారు. 'దీనితో మాకు పెద్ద తలనొప్పి వచ్చింది.. అసలు ఈ ఇంటినే అమ్మేస్తా' అని సరదాగా విసుక్కున్నాడు స్మిత్. ఇది చూసిన ఫ్యాన్స్.. 'ఒక్క పురుగు కనిపిస్తే ఏకంగా ఇంటినే అమ్మేస్తారా? ఇదేదో గమ్మత్తుగా ఉందే', 'మా ఇంట్లోకి ఇలాంటి కీటకాలు చాలానే వస్తాయి, ఒక్కదానికే అంతలా భయపడుతున్నారేంటి?' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: విడాకుల తర్వాత ఒక్కటిగా కనిపించిన ధనుష్, ఐశ్వర్య.. ఫొటో వైరల్
ఆగస్టు చివరి వారంలో ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే!
Comments
Please login to add a commentAdd a comment