అలాద్దీన్ పోస్టర్
అరేబియన్ నైట్స్ కథల్లో అలాద్దీన్ అద్భుత దీపం కథకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ అద్భుత దీపంతో ఎన్నో కథలు వచ్చాయి. ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉంటుంది. అందుకే సరికొత్త హంగులతో ఎప్పటికప్పుడు అలాద్దీన్‌ను ప్రేక్షకులకు అందిస్తున్నారు దర్శక–నిర్మాతలు. వాల్ట్ డిస్నీ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో జీనీ, అలాద్దీన్‌గా విల్ స్మిత్, నటించారు. గాయ్ రిట్చయ్ దర్శకత్వం వíహించిన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కాబోతోంది. జీనీ పాత్రకు వెంకటేశ్, అలాద్దీన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పారు. మరోసారి అలాద్దీన్ ప్రపంచంలోకి వెళ్లడానికి ప్రేక్షకులు రెడీగా ఉండాలన్నమాట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది
Comments
Please login to add a commentAdd a comment