ప్రముఖ హీరో-నిర్మాత మంచు విష్ణు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ఓవైపు కుటుంబ సమస్యలతో సతమవుతున్న ఇతడు.. తరంగ వెంచర్స్ పేరుతో మీడియా-ఎంటర్ టైన్‌మెంట్ ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. 50 మిలియన్ డాలర్స్ పెట్టుబడి పెట్టనున్నారు. హాలీవుడ్ స్టార్ నటుడు విల్ స్మిత్.. ఇందులో భాగస్వామి అయ్యేందుకు సుముఖంగా ఉన్నారని స్వయంగా విష్ణునే బయటపెట్టాడు. త్వరలో శుభవార్త వింటారని చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: మోహన్ బాబు పరారీలో ఉన్నాడా? ట్వీట్ వైరల్)
విష్ణు ఆధ్వర్యంలోని తరంగ వెంచర్స్.. ఓటీటీ, యానిమేషన్, గేమింగ్, బ్లాక్ చెయిన్, సరికొత్త టెక్నాలజీలైన ఏఆర్, వీఆర్, ఏఐ వంటి సాంకేతికతకు సంబంధించిన సేవలను అందించనుంది. ఇందులో మంచు విష్ణు, ఆది శ్రీ, ప్రద్యుమన్ ఝాలా, వినయ్ మహేశ్వరి, విల్‌స్మిత్, దేవేష్ చావ్లా, సతీష్ కటారియాలు భాగస్వాములుగా ఉన్నారు. వీళ్లతో పాటు మరికొందరు కూడా ఆసక్తి చూపుతున్నారట.
మంచు విష్ణు లేటెస్ట్ మూవీ 'కన్నప్ప'.. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. రాబోయే ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ ఉంటుందని కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు. ఈ మూవీలో విష్ణుతోపాటు మోహన్‌బాబు, శరత్‌కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు అతిథి పాత్రల్లో మెరవనున్నారు.
(ఇదీ చదవండి: ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. మీడియాతో ఏమన్నాడంటే?)
Comments
Please login to add a commentAdd a comment