
యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా నటించిన చిత్రం మధురం. రాజేష్ చికిలే డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై యం.బంగార్రాజు నిర్మించాడు. ఎ మెమొరబుల్ లవ్ అనేది ట్యాగ్ లైన్. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుతూ.. 'మధురం.. ఇట్స్ ఎ క్లీన్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఈ సినిమా నాకు టర్నింగ్ పాయింట్ అవుతుంది" అని అన్నారు.
చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ.. '1990 నేపథ్యంలో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ ఇది. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టినట్లు చూపించాం. సినిమా చూశాక అప్పటి వాళ్ళ స్కూల్ డేస్.. కాలేజ్ డేస్ గుర్తుకు తెచ్చేలా ఈ మూవీ ఉంటుంది" అని చెప్పారు. హీరోయిన్ వైష్ణవి సింగ్ మాట్లాడుతూ.."ఇదొక యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్. ఇందులో నా క్యారెక్టర్ అందరిని అలరిస్తుంది. ఉదయ్ రాజ్ చాలా సపోర్ట్ చేశారు. ఇలాంటి మంచి కాన్సెప్ట్ లో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్" అని చెప్పారు.