స్టార్‌ హీరోతో ముద్దు సీన్స్‌.. తప్పుకున్న ఐశ్వర్య రాయ్‌! | Aishwarya Rai Refused And Rejected Hollywood Movies | Sakshi
Sakshi News home page

ముద్దు సీన్‌ చేయలేక స్టార్‌ హీరోల సినిమానే వదులుకున్న ఐశ్వర్య రాయ్‌!

Published Sun, Nov 10 2024 1:27 PM | Last Updated on Tue, Nov 12 2024 5:05 PM

Aishwarya Rai Refused And Rejected Hollywood Movies

చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. కెరీర్‌లో రాణించాలంటే అన్ని రకాల సినిమాలు చేయాల్సిందే. ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్‌ సీన్స్‌లో నటిస్తేనే ఎక్కువ అవకాశాలు వస్తాయని కొంతమంది నమ్ముతారు. అది కొంతవరకు వాస్తవం కూడా. అయితే అలాంటి సీన్స్‌ చేస్తేనే అవకాశాలు వస్తాయనుకోవడం తప్పే. ఎలాంటి ఎక్స్‌ఫోజింగ్‌ చేయకుండా కేవలం తమ నటనతోనే ఆకట్టుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అయితే ఏ సినిమా ఎంచుకోవాలి, ఇండస్ట్రీలో ఎలా నిలబడాలని అనేది సదరు హీరోయిన్‌ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. 

కొంతమంది పెద్ద సినిమాలో నటించే అవకాశం వచ్చినా..తమ పాత్ర నచ్చపోతే సున్నితంగా తిరస్కరిస్తారు. మరికొంత మంది పెద్ద ప్రాజెక్ట్‌ కదా అని కాంప్రమైజ్‌ అవుతారు. కానీ బాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌ మాత్రం ముద్దు సన్నివేశాలు ఉన్నాయని రెండు భారీ హాలీవుడ్‌ సినిమాలనే వదులుకుంది. స్టార్‌ హీరోలతో నటించే అవకాశం వచ్చినా.. సున్నితంగా ఆ ప్రాజెక్టుల నుంచి తప్పుకుంది.

ఇంటిమేట్‌ సీన్స్‌ ఉన్నాయని.. 
2000 సంవత్సరంలో ఐశ్వర్యరాయ్‌కి బాలీవుడ్‌లో ఫుల్‌ డిమాండ్‌ ఉంది. వరుస సినిమాలు హిట్‌ కావడంతో హాలీవుడ్‌లో కూడా నటించే అవకాశం వచ్చింది. బ్రైడ్ అండ్ ప్రిజుడీస్, మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్ లాంటి హాలీవుడ్‌ సినిమాల్లో కీలక పాత్ర పోషించి, తనదైన నటనతో ఆకట్టుకుంది. అదే సమయంలో ఆమె కెరీర్‌ని మలుపు తిప్పే రెండు భారీ హాలీవుడ్‌ సినిమా అవకాశాలు వచ్చాయట. కానీ కిస్‌ సీన్స్‌, రొమాంటిక్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని రిజెక్ట్‌ చేసిందట.

 హాలీవుడ్‌ హీరో బ్రాడ్ పిట్ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ స్మిత్‌’లో హీరోయిన్‌గా నటించే అవకాశం ముందుగా ఐశ్యరకే వచ్చిందట. అయితే కథలో భాగంగా ఆమె హీరోతో ఇంటిమేట్‌ సీన్స్‌తో పాటు ముద్దు సన్నివేశాల్లో కూడా నటించాలని చెప్పారట. హీరోతో కిస్‌ సీన్‌ చేయడం ఇష్టం లేక ఐశ్వర్య ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుందట. దీంతో ఆ చాన్స్‌ ఏంజలినా జోలీ కొట్టేసింది.

లిప్ లాక్ సీన్‌ ఉందని మరో చిత్రం..
ఐశ్వర్య మరో హాలీవుడ్‌ చిత్రాన్ని కూడా ఇలానే వదులకుందంట. హాంకాక్( Hancock) చిత్రంలో విల్‌ స్మిత్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న చాన్స్‌ ఐశ్వర్యకు వచ్చిందంట. అయితే అందులో విల్‌ స్మిత్‌తో లిప్‌లాక్‌ చేసే సీన్‌ ఉందంట. అలాంటి సన్నివేశాల్లో నటించడం ఇష్టంలేక ఐశ్వర్య ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట. డేట్స్‌ కూడా ఖాలీగా లేకపోవడం మరో కారణమని ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement