సంతోశ్ జాగర్లమూడి,రానా
ఓ సినిమాలో బ్యాగ్రౌండ్ వాయిస్ బలమైన పాత్ర ఎలా అవుతుంది? అంటే కొన్ని చిత్రాలకు కచ్చితంగా ప్లస్ అవుతుంది అంటున్నారు ‘సుబ్రహ్మణ్యపురం’ టీమ్. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’ చిత్రానికి మహేశ్‌బాబు వాయిస్ ఓవర్, సునీల్ నటించిన ‘మర్యాద రామన్న’ చిత్రానికి రవితేజ వాయిస్, ఇదే రవితేజ నాని ‘ఆ’ చిత్రానికి ఇచ్చిన వాయిస్ స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యాయి. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో రానా చేరారు. ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రకథను నడిపించటానికి తన వాయిస్‌తో నడుం కట్టారు రానా.
సుమంత్, ఈషా రెబ్బా జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా సంతోశ్ జాగర్లమూడి దర్శకునిగా పరిచయమవుతున్నారు. సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్ పతాకంపై భీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదలవుతోంది. ‘‘భగవంతుడు ఉన్నాడా? లేదా? అనేది మనిషి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. భగవంతునిపై నమ్మకం లేని మనిషి భగవంతునిపై చేసే పరిశోధనలు ఎలాంటి ఫలితాలు ఇచ్చాయి. ‘సుబ్రహ్మణ్యపురం’లో దాగున్న రహస్యం ఏంటి? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అదనపు ఆకర్షణ అని, యస్పీబీ పాడిన థీమ్ సాంగ్ ఓ హైలైట్ అని, రానా వాయిస్ ఓ ఎస్సెట్ అని కూడా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment