సుమంత్, ఈషారెబ్బ జంటగా సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్ బ్యానర్‌లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ‘సుబ్రహ్మణ్యపురం’. బీరం సుధాకర రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడి పరిచయం అవుతున్నాడు. డిసెంబర్ 7న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈషా రెబ్బ ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
‘దర్శకుడు సంతోష్ రెండు గంటలు కథ చెప్పాడు.. అతను కథ చెపుతున్నప్పుడు నేను విజువలైజ్ చేసుకున్నాను అది నాకు బాగా నచ్చింది. అందుకే ఓకే చెప్పాను. సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో నేను ఊరంటే చాలా ఇష్టపడే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. తనకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం.
ఈ టీంతో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఆర్.కె. ప్రతాప్ సినిమాటోగ్రఫీ, శేఖర్ చంద్ర మ్యూజిక్ సుబ్రహ్మణ్యపురం కు పెద్ద అసెట్ గా నిలిచాయి. దర్శకుడు సంతోష్ మొదటి సినిమా అయినా అన్ని క్రాప్ట్ ల నుండి బెస్ట్ అవుట్ పుట్ ని తీసుకున్నాడు. అతను కథను డీల్ చేసిన విధానం చాలా బాగుంది.
నేను భక్తురాలుగా కనిపిస్తాను సుమంత్ కంప్లీట్ అపోజిట్ రోల్ ప్లే చేసాడు. రెండు పాత్రల అభిప్రాయాల మద్య ఘర్షణ ఉంటుంది. దేవుడు ఉన్నాడని నమ్మే అమ్మాయికి , దేవుడు పై రిసెర్చ్ చేసే అబ్బాయి కి మద్య లవ్ ఫీల్ ఎలా కలిగింది అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.సుమంత్ నటన సహాజంగా ఉంటుంది అది నాకు నచ్చుతుంది.
నిర్మాత అంటే ఓన్లీ బడ్జట్ లోనే ఇన్వాల్వ్ అవుతారు అనుకుంటారు. కానీ సుధాకర రెడ్డి గారు సినిమా కథ చర్చలలో కూడా పాల్గోనేవారు, రోజూ షూట్ కి వచ్చి ఏం జరుగుతుందో తెలుసుకునే వారు.
Published Thu, Dec 6 2018 3:24 PM | Last Updated on Thu, Dec 6 2018 3:24 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment