![NTR And Rajini Kanth Competes For Mohanlal Movie Odiyan - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/30/oda.jpg.webp?itok=6e4xYi1P)
రజనీకాంత్, మోహన్ లాల్,ఎన్టీఆర్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, తెలుగు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ మోహన్ లాల్ ‘ఒడియన్’ సినిమాకు మాట సాయం చేయనున్నారని టాక్. మోహన్‌లాల్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన భారీ బడ్జెట్ పీరియాడికల్ చిత్రం ‘ఒడియన్’. కేరళలోని పూర్వకాలంలో నివసించిన ఒడియన్ల తెగకు సంబంధించిన వ్యక్తి ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఇందులో మోహన్‌లాల్ వివిధ గెటప్స్‌లో కనిపిస్తారు. దానికోసం ఫిజికల్‌గా చాలా కష్టపడ్డారు కూడా. యంగ్ లుక్‌లో కనిపించడానికి సుమారు 18 కిలోలకు పైగా బరవు తగ్గారాయన. వీఏ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్‌లో రిలీజ్ కానుంది.
ఈ సినిమాను దక్షిణాది భాషలన్నింట్లో రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. దాంతో ఆయా భాషల హీరోలతో వాయిస్ ఓవర్ చెప్పించి, క్రేజ్ తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. తమిళంలో ఈ చిత్రం పరిచయ డైలాగ్స్‌ను రజనీకాంత్ చెబుతారట. అలాగే తెలుగులో ఈ సినిమాకు సంబంధించిన వాయిస్ ఓవర్ ఎన్టీఆర్ అందిస్తారని టాక్. ఆల్రెడీ ఎన్టీఆర్, మోహన్‌లాల్ కలసి ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సమయంలో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే అడిగితే కాదనకుండా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెబుతారని ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment